iDreamPost
android-app
ios-app

Vinesh Phogat: రాత్రంతా నరకం అనుభవించిన వినేశ్‌ ఫొగాట్‌! బరువు తగ్గడానికి రక్తం తీసి, జుట్టు కట్‌ చేసి!

  • Published Aug 07, 2024 | 2:20 PM Updated Updated Aug 07, 2024 | 2:20 PM

Vinesh Phogat Disqualified Updates: పారిస్‌ ఒలింపిక్స్‌లో మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో ఫైనల్‌కు చేరుకున్న వినేశ్‌ ఫొగాట్‌ మీద అనర్హత వేటు విధించారు. అయితే అధికంగా ఉన్న బరువు తగ్గించుకోవడం కోసం ఆమె చేసిన ప్రయత్నాల గురించి తెలిస్తే.. కన్నీరు ఆగదు. ఆ వివరాలు..

Vinesh Phogat Disqualified Updates: పారిస్‌ ఒలింపిక్స్‌లో మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో ఫైనల్‌కు చేరుకున్న వినేశ్‌ ఫొగాట్‌ మీద అనర్హత వేటు విధించారు. అయితే అధికంగా ఉన్న బరువు తగ్గించుకోవడం కోసం ఆమె చేసిన ప్రయత్నాల గురించి తెలిస్తే.. కన్నీరు ఆగదు. ఆ వివరాలు..

  • Published Aug 07, 2024 | 2:20 PMUpdated Aug 07, 2024 | 2:20 PM
Vinesh Phogat: రాత్రంతా నరకం అనుభవించిన వినేశ్‌ ఫొగాట్‌! బరువు తగ్గడానికి రక్తం తీసి, జుట్టు కట్‌ చేసి!

పారిస్‌ ఒలంపిక్స్‌లో భారత మహిళా రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు విధించిన సంగతి తెలిసిందే. నిర్దేశిత బరువు కన్నా.. కొన్ని గ్రాములు సుమారు 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండటంతో.. ఫైనల్లో పాల్గొనకుండా ఆమె మీద అనర్హత వేటు విధించారు. ఈ నిర్ణయం క్రీడాభిమానులనే కాక.. భారతీయులందరినీ షాక్‌కు గురి చేసింది. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ సెమీ ఫైనల్‌లో వినేశ్ 5-0తో క్యూబాకు చెందిన ఉస్నేలిస్ గుజ్‌మన్ లోపెజ్‌పై విజయం సాధించి.. ఫైనల్‌కు చేరుకుంది. ఇక తుది సమరంలో తలబడే ముందు అనగా మంగళవారం ఆమె బరువును చెక్‌ చేశారు. కొన్ని గ్రాములు ఎక్కువ వెయిట్‌ ఉండటంతో వినేశ్‌ను డిస్‌క్వాలిఫై చేశారు. దాంతో గోల్డ్‌ మెడల్‌ పక్కా అనుకుంటున్న వేళ.. అసలు ఎలాంటి పతకం లేకుండానే ఆమె వెనుదిరగాల్సి వచ్చింది.

అయితే అధికంగా ఉన్న బరువు తగ్గడం కోసం వినేశ్‌ ఓ పోరాటమే చేసిందని చెప్పవచ్చు. మంగళవారం రాత్రి నాటికి వినేశ్‌ నిర్దేశిత 50 కేజీల కన్నా.. 2 కేజీల బరువు అధికంగా ఉన్నారు. దాన్ని తగ్గించుకోవడం కోసం రాత్రంతా ఆమె ఎంతో శ్రమించారు. జాగింగ్‌, స్కిప్పింగ్‌, సైక్లింగ్‌ చేశారు. అయినా ఆశించినా ఫలితం రాకపోవడంతో.. ఆమె కోచ్‌, స్టాఫ్‌ ఏకంగా వినేశ్‌ నుంచి కొంత రక్తాన్ని తొలగించారు.. ఆఖరికి జుట్టు కూడా కట్‌ చేశారు. అయినా సరే.. ఈవెంట్‌కు ముందు ఆమె 100 గ్రాముల బరువు అధికంగా ఉండటంతో.. నిర్వాహకులు ఆమెపై అనర్హత వేటు విధించారు. దాంతో ఆమె ఎలాంటి పతకం లేకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.

ఇక అధికంగా ఉన్న బరువు తగ్గడం కోసం వినేశ్‌ ఫొగాట్‌ రాత్రంగా జాగింగ్‌, స్కిప్పింగ్‌, సైక్లింగ్‌ చేయడంతో.. డీహైడ్రేషన్‌ బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురైంది. దాంతో ఆమెని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పాపం బరువు తగ్గడానికి రాత్రంతా నరకం అనుభవిచింనా.. ఆఖరికి రక్తం తీసినా.. లాభం లేకుండా పోయింది. పతకం సాధించి.. అంతర్జాతీయ వేదిక మీద ఇండియా పతాకం రెపరెపలాడించాలని ఆశించినా.. ఆ కోరిక తీరలేదు. ఇక ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు సెలబ్రిటీలు స్పందించారు. వినేశ్‌కు ధైర్యం చెప్పారు. దీనిపై స్పందిస్తూ మోదీ ట్వీట్‌ చేశారు. నిరశపడవద్దని.. మళ్లీ గెలుపు దిశగా ముందుకు సాగాలని సూచించారు.

‘‘వినేశ్‌.. మీరు ఛాంపియన్లకే ఛాంపియన్‌. దేశానికే గర్వకారణం. ప్రతీ భారతీయుడికి మీరే స్ఫూర్తి. ఒలింపిక్స్‌లో మీ అనర్హత మమ్మల్ని ఎంతగానో భాదిస్తుంది. మీకు కలిగిన నిరాశను మాటల్లో వర్ణించలేకపోతున్నాం. సవాళ్లకు ఎదురు నిలిచి పోరాడే స్వభావం మీది. మళ్లీ గెలుపు దిశగా ముందుకు సాగాలి’’ అంటూ మోదీ ట్వీట్‌ చేశారు. అలానే ఈ అంశంలో వినేశ్‌కు సహాయం చేసేందుకు వీలైన అంశాలన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించాలని ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసిషేయన్‌ అధ్యక్షురాలు పీటీ ఉషను ఆదేశించారు.