iDreamPost
android-app
ios-app

Neeraj Chopra: నీరజ్‌ చోప్రాతో ఫైనల్‌లో తలపడనున్న పాకిస్థాన్‌ అథ్లెట్‌ అర్షద్‌ నదీమ్‌!

  • Published Aug 06, 2024 | 8:50 PM Updated Updated Aug 06, 2024 | 8:50 PM

Paris Olympics 2024: క్రికెట్​లో భారత్-పాకిస్థాన్​ ఫైట్ ఎన్నోసార్లు చూశాం. ఈ దాయాది దేశాలు తలపడుతుంటే చూసేందుకు ఇతర దేశాల అభిమానులు కూడా ఎగబడతారు. అలాంటి భారత్-పాక్ మరోమారు సమరానికి సై అంటున్నాయి.

Paris Olympics 2024: క్రికెట్​లో భారత్-పాకిస్థాన్​ ఫైట్ ఎన్నోసార్లు చూశాం. ఈ దాయాది దేశాలు తలపడుతుంటే చూసేందుకు ఇతర దేశాల అభిమానులు కూడా ఎగబడతారు. అలాంటి భారత్-పాక్ మరోమారు సమరానికి సై అంటున్నాయి.

  • Published Aug 06, 2024 | 8:50 PMUpdated Aug 06, 2024 | 8:50 PM
Neeraj Chopra: నీరజ్‌ చోప్రాతో ఫైనల్‌లో తలపడనున్న పాకిస్థాన్‌ అథ్లెట్‌ అర్షద్‌ నదీమ్‌!

భారత్-పాకిస్థాన్.. ఈ రెండు దాయాది దేశాల మధ్య వైరం ఇవాళ్టిది కాదు. సరిహద్దుల్లోనే కాదు క్రీడా మైదానాల్లోనూ ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య యుద్ధం నెక్స్ట్ లెవల్​లో జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా క్రికెట్​లో వీళ్ల మధ్య మ్యాచ్ అంటే ప్రపంచం మొత్తం దృష్టి దాని పైనే ఉంటుంది. ఆ మ్యాచ్ టికెట్లు హాట్ కేక్స్​లా అమ్ముడుపోతాయి. లైవ్ స్ట్రీమింగ్ పాత వ్యూస్ అన్నీ బ్రేక్ అవుతాయి. క్రికెట్​తో పాటు హాకీ, కబడ్డీ లాంటి ఇతర గేమ్స్​లో కూడా భారత్-పాక్ ఢీ అంటే ఢీ అంటూ తలపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మరోమారు ఈ దాయాది దేశాలు సమరానికి సై అంటున్నాయి. అయితే దీనికి క్రికెట్ కాదు.. ఒలింపిక్స్ గేమ్స్ వేదిక కానుంది.

ఒలింపిక్స్​లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్​కు అంతా రెడీ అవుతోంది. జావెలిన్ త్రోలో ఈ ఇరు దేశాల అథ్లెట్లు తొడ గొట్టి తాడో పేడో తేల్చుకోనున్నారు. టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాను పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ ఫేస్ చేయనున్నాడు. ఇవాళ జరిగిన క్వాలిఫికేషన్​లో ఫస్ట్ అటెంప్ట్​లోనే జావెలిన్​ను 89.34 మీటర్ల దూరం విసిరాడు నీరజ్. గ్రూప్​లో అగ్రస్థానంలో నిలిచిన అతడు నేరుగా ఫైనల్ బెర్త్​ను ఖరారు చేసుకున్నాడు. పీటర్స్ అండర్సన్ (88.63 మీటర్లు), నదీమ్ అర్షద్ (86.59 మీటర్లు) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. నీరజ్​తో పాటు ఇతర ఆటగాళ్లపై ఎక్స్​పెక్టేషన్స్ ఉన్నా పాక్​కు చెందిన నదీమ్ డైరెక్ట్​గా ఫైనల్ చేరతాడని ఎవరూ ఊహించలేదు.

క్వాలిఫికేషన్​లో మూడో స్థానంలో నిలిచిన నదీమ్.. ఫైనల్​లో నీరజ్​కు టఫ్​ కాంపిటీషన్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. దీంతో ఇది భారత్ వర్సెస్ పాక్ ఫైట్​గా మారింది. టోక్యో ఒలింపిక్స్​తో పాటు ఆ తర్వాత పాల్గొన్న అనేక టోర్నీల్లో నంబర్​ వన్​గా నిలుస్తూ వచ్చిన నీరజ్​కు పాక్ అడ్డంకిని దాటడం పెద్ద కష్టమేమీ కాదని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. అతడి ఫామ్​, ఫిట్​నెస్ దృష్ట్యా మరో బంగారు పతకం అందుకోవడం ఈజీనే అని చెబుతున్నారు. అయితే పాక్ అథ్లెట్​ను తక్కువ అంచనా వేయడానికి లేదని అంటున్నారు. నీరజ్ తన బెస్ట్ ఇస్తే ఏ ఆటగాడు కూడా అతడి దరిదాపుల్లోకి రారని.. ఈ ఒలింపిక్స్​లో దేశానికి ఫస్ట్ గోల్డ్ అందించాల్సిన బాధ్యత అతడి మీదే ఉందని చెబుతున్నారు. మరి.. నీరజ్ వర్సెస్ నదీమ్ ఫైట్​ కోసం మీరెంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.