iDreamPost

టీమిండియా పేసర్ల సక్సెస్‌ వెనుక బౌలింగ్‌ కోచ్‌ మాంబ్రే! అతను ఆడింది 5 మ్యాచ్‌లే

  • Published Nov 08, 2023 | 8:20 PMUpdated Nov 10, 2023 | 11:27 AM

ఒకే మ్యాచ్‌లో ముగ్గురు పేసర్లు నిప్పులు చెరగడం టీమిండియా గతంలో ఎప్పుడూ చూడలేదనే చెప్పాలి. ఇంతకాలం బ్యాటింగ్‌, స్పిన్‌ బలంపై విజయాలు సాధించే టీమిండియా.. ఈ వరల్డ్‌ కప్‌లో పేస్‌ బౌలింగ్‌ బలంపై విజయాలు సాధిస్తోంది. అయితే.. జట్టులో ఇంత భారీ మార్పుకు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒకే మ్యాచ్‌లో ముగ్గురు పేసర్లు నిప్పులు చెరగడం టీమిండియా గతంలో ఎప్పుడూ చూడలేదనే చెప్పాలి. ఇంతకాలం బ్యాటింగ్‌, స్పిన్‌ బలంపై విజయాలు సాధించే టీమిండియా.. ఈ వరల్డ్‌ కప్‌లో పేస్‌ బౌలింగ్‌ బలంపై విజయాలు సాధిస్తోంది. అయితే.. జట్టులో ఇంత భారీ మార్పుకు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Nov 08, 2023 | 8:20 PMUpdated Nov 10, 2023 | 11:27 AM
టీమిండియా పేసర్ల సక్సెస్‌ వెనుక బౌలింగ్‌ కోచ్‌ మాంబ్రే! అతను ఆడింది 5 మ్యాచ్‌లే

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో టీమిండియా సూపర్‌ ఫామ్‌లో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి.. ఓటమి ఎరుగని జట్టుగా ఉంది. ఈ విజయాల్లో జట్టులోని అందరి ఆటగాళ్ల కాంట్రిబ్యూషన్‌ ఉన్నా కూడా.. ముఖ్యంగా బౌలింగ్‌ గురించి మాట్లాడుకోవాలి. టోర్నీ ఆరంభంలో దాదాపు తొలి ఐదు మ్యాచ్‌లు కూడా టీమిండియా ఛేజింగ్‌ చేస్తూ గెలిచింది. వీటిలో ఏ ఛేజ్‌లో కూడా టీమిండియా అంత భారీ స్కోర్‌ ఎదురుకాలేదు. అందుకు కారణం.. టీమిండియా బౌలర్ల ఎంతో అద్భత ప్రదర్శన కనబర్చడమే. ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ లాంటి బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న జట్లను కూడా టీమిండియా బౌలర్లు 200 మార్క్‌ను దాటనివ్వలేదు. అలాగే ఇంగ్లండ్‌ను 129కి, శ్రీలంకను అత్యంత ఘోరంగా 55కి ఆలౌట్‌ చేసి పడేశారు. తాజాగా అరివీర భయంకరమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న సౌతాఫ్రికాను 83కే కుప్పకూల్చారు.

బౌలింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో మరీ ముఖ్యంగా పేస్‌ ఎటాక్‌ గురించి మాట్లాడుకోవాలి. స్పిన్‌కు అనుకూలించే మన దేశపు పిచ్‌లపై టీమిండియా ముగ్గురు పేసర్లతో ఆడుతోంది. జస్పీత్ర్‌ బుమ్రా, మొహమ్మద్‌ సిరాజ్‌, మొహమ్మద్‌ షమీ.. ఈ త్రిమూర్తులు టీమిండియా పేస్‌కు సరికొత్త అర్థం చెబుతున్నారు. ముగ్గురు కూడా గంటకు 140కి పైగా వేగంతో బౌలింగ్‌ చేసే బౌలర్లే. పైగా సీమ్‌, స్వింగ్‌, లైండ్‌ అండ్‌ లెంత్‌ ఇలా అన్ని బెస్ట్‌ ‍క్వాలిటీస్‌ ఈ ముగ్గురిలో మెండుగా ఉన్నాయి. అసలు ఇండియన్‌ క్రికెట్‌ హిస్టరీలో ఇంత దుర్బేధ్యమైన పేస్‌ బౌలింగ్‌ ఎటాక్‌ గతంలో ఎన్నడూ చూడలేదని క్రికెట్‌ అభిమానులే కాదు, దిగ్గజ మాజీ క్రికెటర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. టీమిండియాలో కపిల్‌ దేవ్‌, శ్రీనాథ్‌, వెంకటేశ్‌ప్రసాద్‌, జహీర్‌ ఖాన్‌, నెహ్రా, ఇర్ఫాన్‌ పఠాన్‌ లాంటి పేసర్లు ఉన్నా.. ఏక కాలంలో ముగ్గురు పేసర్లు కూడా నిప్పులు చెరగడం ఇండియా ఎప్పుడు చూడలేదనే చెప్పాలి. ఇంతకాలం బ్యాటింగ్‌, స్పిన్‌ బలంపై విజయాలు సాధించే టీమిండియా.. ఈ వరల్డ్‌ కప్‌లో పేస్‌ బౌలింగ్‌ బలంపై విజయాలు సాధిస్తోంది. అయితే.. జట్టులో ఇంత భారీ మార్పుకు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా పేస్‌ బౌలింగ్‌ ఇంత బాగా ఉందంటే.. కచ్చితంగా బౌలర్లకు క్రెడిట్‌ ఇ‍వ్వాల్సిందే. బుమ్రా, సిరాజ్‌, షమీ వీళ్ల ముగ్గురిది కూడా నేచురల్‌ టాలెంట్‌. కానీ, వీరు మరింత డేంజర్‌గా మారేలా పదును పెట్టింది మాత్రం టీమిండియా బౌలింగ్‌ కోచ్‌ పరాస్‌ మాంబ్రే. బుమ్రా, సిరాజ్‌, షమీ పేస్‌ ఎటాక్‌ వెనుక కనిపించి శక్తే ఈ మాంబ్రే. ఆయన బౌలింగ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాకా.. పేస్‌ చాలా సీరియస్‌గా శ్రద్ధ పెట్టారు. ఆల్‌రౌండర్‌ లేకపోయినా, ఎక్స్‌ట్రా బ్యాటర్‌ లేకపోయినా.. ముగ్గురు క్వాలిటీ పేసర్లతో ఆడే ధైర్యం టీమిండియాకు వచ్చిందంటే.. అందుకు కారణం మాంబ్రే. ముంబైకి చెందిన పరాస్‌ మాంబ్రే 1972 జూన్‌ 20న ముంబైలో జన్మించారు. చిన్నతనం నుంచే క్రికెట్‌పై పిచ్చి ఇష్టంతో పెరిగాడు మాంబ్రే. కానీ, 15 ఏళ్ల తర్వాతే అతను ప్రొఫెషనల్‌ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అంతకు ముందు గల్లీ క్రికెట్‌లో రబ్బర్‌, టెన్నిస్‌ బాల్‌తోనే క్రికెట్‌ ఆడేవాడు.

ఆ తర్వాత తండ్రితో తాను క్రికెట్‌ అవ్వాలనుకుంటున్నానని చెప్పి.. సచిన్‌కు కోచింగ్‌ ఇచ్చిన అజయ్‌ మంజ్రేకర్‌ వద్ద కోచింగ్‌ తీసుకొని దేశవాళీ క్రికెట్‌లోకి అడుగుపెట్టి సత్తా చాటాడు. దేశవాళీ క్రికెట్‌లో అత్యుత్తమైన బౌలర్లలో ఒకడిగా మాంబ్రే ఉన్నారు. తన కెరీర్‌లో 91 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 284 వికెట్లు, 83 లిస్ట్‌-ఏ మ్యాచ్‌లు ఆడి 111 వికెట్లు తీశాడు. అయితే.. దేశవాళీ టోర్నీలో ఇంత అద్భుతంగా రాణించిన మాంబ్రే.. 1996 మే 23న ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ, ఎక్కువ కాలం టీమ్‌లో కొనసాగలేకపోయారు. టీమిండియా తరఫున కేవలం 3 వన్డేలు, 2 టెస్టులు మాత్రమే ఆడారు. టెస్టుల్లో 2, వన్డేల్లో 3 వికెట్లు పడగొట్టారు. అయితే.. 1996 వన్డే వరల్డ్‌ కప్‌లో ఆడే అవకాశం మాంబ్రేకు వచ్చింది కానీ, వరల్డ్‌ కప్‌ ముందు నిర్వహించిన ఓ క్యాంప్‌లో ఆయనతో పాటు మరో నాలుగురు బౌలర్లు వెంకటేష్ ప్రసాద్, జవగల్ శ్రీనాథ్, మనోజ్ ప్రభాకర్, సలీల్ అంకోలా మంచి ప్రదర్శన కనబర్చి వరల్డ్‌ కప్‌కు ఎంపియ్యారు. ఆ తర్వాత చాలా కాలం తర్వాత ఇండియా-ఏ టీమ్‌కు కోచ్‌గా పనిచేసి.. టీమిండియా సీనియర్‌ జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గా ఎంపికయ్యారు. ఆయన నేతృత్వంలోనే టీమిండియా పేసర్లు అద్భుతాలు చేస్తున్నారు. మరి టీమిండియా పేస్‌ దళం వెనుకున్న ఈ దళపతిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి