Pallavi Prashanth: అసలైన రైతు బిడ్డ అంటే ఈయన.. పల్లవి ప్రశాంత్‌కి ఫ్యాన్స్ కౌంటర్!

పల్లవి ప్రశాంత్‌.. బిగ్‌ బాస్‌ 7 విన్నర్‌గా నిలిచిన తర్వాత.. కొన్ని కారణాల వల్ల విమర్శల పాలవుతున్నాడు. రైతు బిడ్డగా సింపథి పొందిన అతను ఇప్పుడు అదే రైతు బిడ్డ ట్యాగ్‌పై కూడా వ్యతిరేకతను చవిచూస్తున్నాడు. అతని స్థానంలో మరో కొత్త రైతు బిడ్డ వచ్చేశాడు. అతనెవరో ఇప్పుడు చూద్దాం..

పల్లవి ప్రశాంత్‌.. బిగ్‌ బాస్‌ 7 విన్నర్‌గా నిలిచిన తర్వాత.. కొన్ని కారణాల వల్ల విమర్శల పాలవుతున్నాడు. రైతు బిడ్డగా సింపథి పొందిన అతను ఇప్పుడు అదే రైతు బిడ్డ ట్యాగ్‌పై కూడా వ్యతిరేకతను చవిచూస్తున్నాడు. అతని స్థానంలో మరో కొత్త రైతు బిడ్డ వచ్చేశాడు. అతనెవరో ఇప్పుడు చూద్దాం..

బిగ్‌ బాస్‌-7 రియల్టీ గేమ్‌ షోలో గెలుపొందిన పల్లవి ప్రశాంత్‌ అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటికి వచ్చిన సమయంలో అతని అభిమానులు ట్రాఫిక్‌ కు తీవ్ర అంతరాయం కలిగించడమే కాకుండా.. ఆర్టీసీ బస్సు అద్దాలు పగులగొట్టి ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారు. ఈ ఘటనపై పల్లవి ప్రశాంత్‌ తో పాటు మరికొంతమందిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ ఘటనపై సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతోంది. ఓ మామూలు గేమ్‌ షోలో గెలిచి ఇంత షో చేయడం అవసరమా అంటూ చాలా మంది నెటిజన్లు పల్లవి ప్రశాంత్‌ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్‌ రైతుబిడ్డ ట్యాగ్‌ తో వైరల్‌ అయ్యాడని.. కానీ, అసలైన రైతు బిడ్డ ఇతనే అంటూ మరో వ్యక్తిని తెరపైకి తీసుకొస్తున్నారు కొంతమంది నెటిజన్లు. మరి, ఆ అసలైన రైతు బిడ్డ ఎవరు? అతని కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బిగ్‌ బాస్‌ హౌజ్‌ లోకి వెళ్లక ముందు, వెళ్లాక.. ప్రశాంత్‌ తానో రైతు బిడ్డనని సింపథీ పొందాడు. చాలా మంది రైతు బిడ్డ అనగానే పల్లవి ప్రశాంత్‌ అనే భ్రమలోకి వెళ్లిపోయారు. కానీ, బిగ్‌ బాస్‌ విన్నర్‌ గా నిలిచిన తర్వాత పల్లవి ప్రశాంత్‌ ప్రవర్తన చూసిన అతని అభిమానులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలైన రైతు బిడ్డ అంటే ఇతనిలా ఉండాలని అంటున్నారు. అతనే రాజేందర్‌ రెడ్డి. ఈయన ఒక యూట్యూబర్‌. తెలుగు రైతుబడి పేరుతో యూట్యూబ్‌ లో ఓ ఛానెల్‌ నిర్వహిస్తూ.. నూతన పద్ధతులు, కొత్త పంటలు సాగు చేసే రైతుల అనుభవాలు, వారి కష్టనష్టాలను ఇతరులకు తెలియజేయడం, వ్యవసాయంలో కొత్త సాంకేతిక పరికరాల గురించి వివరించడం, వాటిని సబ్సిడీ ద్వారా, ప్రభుత్వ పథకాలల్లో ఎలా పొందవచ్చనే విషయాలను వివరిస్తూ ఉంటారు.

ప్రస్తుతం ఆయన యూట్యూబ్‌ ఛానెల్‌ కు 1.21 మిలియన్ల సబ్‌స్రైబర్లు ఉన్నారు. అయితే.. ఆయన వీడియోలన్నీ రైతులకు ఉపయోగపడేలా ఉన్నాయి. ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణుకుతూ.. వ్యవసాయం చేస్తూ.. మన నోటికి ఇంత తిండి అందిస్తున్న రైతులకు ఏదో ఒక వీడియోతో తన వంతు సాయం అందిస్తున్న రాజేందర్‌ రెడ్డినే అసలైన రైతు బిడ్డ అని అంటున్నారు. అయినా.. రైతు కుటుంబంలో పుట్టినంత మాత్రాన ప్రతి ఒక్కరు రైతు బిడ్డ అయిపోలేరని.. నేను రైతు బిడ్డని.. నేను రైతు బిడ్డని అని పదే పదే చెప్పుకోవడం వల్ల కూడా రైతు బిడ్డలు అవ్వరని నెటిజన్లు పల్లవి ప్రశాంత్‌ కు కౌంటర్‌ ఇస్తున్నారు. కేవలం రైతు కుటుంబంలో పుట్టినంత మాత్రాన రైతు బిడ్డలు అయిపోతే.. తెలుగు రాష్ట్రాల్లో 80 శాతం మంది యువతీయువకులు రైతు బిడ్డలే అవుతారని అంటున్నారు.

అయినా.. రైతు బిడ్డ అంటే ఏదో ఒక విధంగా రైతులకు ఉపయోగపడుతూ ఉండాలని, కేవలం సింపథీ కోసం రైతు బిడ్డ అని చెప్పుకుంటూ.. ఇలా పబ్లిక్‌ న్యూసెన్స్‌ క్రియేట్‌ చేస్తూ, ప్రభుత్వ ఆస్థులకు నష్టం కలిగించే వాళ్లు రైతు బిడ్డలు ఎలా అవుతారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఒక రియాల్టీ గేమ్‌ షోలో మంచి ప్రదర్శనతో గెలిచినందుకు పల్లవి ప్రశాంత్‌ కు అందరూ అభినందనులు తెలుపుతున్నారని, కానీ గెలిచి బయటికి వచ్చిన తర్వాత పోలీసుల మాట వినకుండా కాస్త అతి చేయడంతోనే ప్రశాంత్‌ పై ఇంత నెగిటివిటీ వచ్చిందని స్వయంగా పల్లవి ప్రశాంత్‌ అభిమానులే ఒప్పుకుంటున్నారు. మరి పల్లవి ప్రశాంత్‌ వ్యవహారంతో పాటు.. అసలైన రైతు బిడ్డ వివాదంలో తెరపైకి వచ్చిన యూట్యూబర్‌ రాజేందర్‌ రెడ్డి చేస్తున్న రైతు ఉపయోగ వీడియోలపై మీ అభిప్రాయమేంటి.. పల్లవి ప్రశాంత్, యూట్యూబర్ రాజేందర్ రెడ్డి.. ఇద్దరిలో ఎవరు అసలైన రైతు బిడ్డ అని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments