SNP
SNP
భారత క్రికెట్ అభిమానులు అంతా ఆసియా కప్ 2023 టోర్నీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 17వ వరకు ఈ మినీ వరల్డ్ కప్ జరగనుంది. ఈ టోర్నీ కోసం ఇప్పటికే బీసీసీఐ భారత జట్టును కూడా ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 18 మందితో కూడిని స్క్వౌడ్‌ను సోమవారం వెల్లడించింది. అయితే.. ఆసియా కప్‌లో అన్ని మ్యాచ్‌ల్లో కంటే భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కోసమే ఎక్కువగా మంది క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాన్ని క్రికెట్ మ్యాచ్ కంటే కూడా ఓ మినీ యుద్ధంగా చూస్తారు. ఇప్పుడు ఆసియా కప్‌లో సెప్టెంబర్ 2న జరగనున్న భారత్-పాక్ మ్యాచ్ కోసం కూడా క్రికెట్ ఫ్యాన్స్ అలాగే చూస్తున్నారు. అయితే.. ఈ మ్యాచ్‌కి ముందే టీమిండియాకు పాకిస్థాన్ హెచ్చరికలు జారీ చేసింది.
ఆసియా కప్ ప్రారంభానికి ముందు ఆఫ్ఘనిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది పాకిస్థాన్. మంగళవారం శ్రీలంకలోని రాజపక్సా స్టేడియం వేదికగా పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య తొలి వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. మ్యాచ్ ఆరంభమైన కొద్ది సేపు ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లు పాక్‌ను వణికించారు. ఓపెనర్ ఫకర్ జమాన్(2), కెప్టెన్ బాబర్ అజమ్(0), రిజ్వాన్(21), అఘా సల్మాన్(7) ఇలా వరుస వికెట్ల పడగొడుతూ.. 62 పరుగులకే 4 వికెట్లు తీసుకున్నారు ఆఫ్ఘాన్ బౌలర్లు. వారి జోరు చూపి పాకిస్థాన్ జట్టు ఏంటి ఇంత దారుణంగా ఆడుతుందని అంతా అనుకున్నారు. మొత్తం మీద 47.1 ఓవర్లలో 201 పరుగులు మాత్రమే చేసి పాకిస్థాన్ ఆలౌట్ అయింది. ఆఫ్ఘాన్ బౌలర్లలో ముజీబ్ 3, రషీద్ ఖాన్, నబీ రెండేసి వికెట్లతో పాకను తక్కువ స్కోర్‌కే పరిమితం చేశారు.
202 పరుగుల టార్గెట్‌ను ఆఫ్ఘనిస్థాన్ ఛేదించి.. ఆసియా కప్‌కు ముందు పాకిస్థాన్‌కు గట్టి షాక్ ఇస్తుందని క్రికెట్ అభిమానులు భావించారు. కానీ, అసలు కథ పాక్ బౌలింగ్ ప్రారంభించిన తర్వాత షురువైంది. పాక్ పేసర్ల ధాటికి ఆఫ్ఘాన్ బ్యాటింగ్ లైనప్ కుదేలైంది. షాహీన్ షా అఫ్రిదీ లెఫ్టా ఆర్మ్ పేస్ ముందు ఆఫ్ఘాన్ నిలువలేకపోయింది. హరీస్ రౌఫ్ ఏకంగా 5 వికెట్లతో సత్తా చాటాడు. పాక్ బౌలర్ల దెబ్బకు 9 మంది ఆఫ్ఘాన్ బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితం అయ్యారు. మొత్తానికి 19.2 ఓవర్లలో కేవలం 59 పరుగులు మాత్రమే చేసి ఆఫ్ఘాన్ ఆలౌట్ అయింది.
బ్యాటింగ్‌లో 201 పరుగులకే ఆలౌట్ అందరికి షాకిచ్చిన పాకిస్థాన్ బౌలింగ్‌లో మాత్రం దుమ్ములేపింది. రౌఫ్ 5, షాహీన్ అఫ్రిదీ 2, నసీమ్ షా, షాదాబ్ ఖాన్ చెరో వికెట్‌తో చెలరేగి.. ఆఫ్ఘాన్ పతనాన్ని శాసించారు. పాకిస్థాన్ బౌలింగ్ ఎటాక్ బలంగా ఉన్న విషయం తెలిసిందే కానీ, ఈ రేంజ్‌లో పటిష్టంగా ఉందనే విషయం మరోసారి స్పష్టమైంది. ఆసియా కప్‌కు ముందు ఈ ప్రదర్శన పాక్ టీమ్‌లో ఆత్మవిశ్వాసం పెంచే అవకాశం ఉంది. తమ బౌలింగ్ ఎటాక్ స్టామినా ఏంటో ఈ మ్యాచ్‌తో టీమిండియాకు పాక్ హెచ్చరికా జారీ చేసిందని పాక్ అభిమానులు అంటున్నారు. భారత రైట్ హ్యాండర్లు లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌ను ఎందుర్కొవడానికి ఇబ్బంది పడతారనే విషయం తెలిసిందే.
అయితే.. విరాట్ కోహ్లీ ముందు పాక్ ఆటలు సాగవని, గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ ఆడిన 82 పరుగుల ఇన్నింగ్స్‌ను అప్పుడే మర్చిపోయారా? అంటూ ఇండియన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ 2021లోనూ కోహ్లీ పాక్‌పై హాఫ్ సెంచరీతో రాణించాడు, టీ20 వరల్డ్ కప్ 2022లో పాక్‌పై కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ అతని కెరీర్‌లోనే గొప్ప ఇన్నింగ్స్‌గా నిలిచిపోయింది. ముఖ్యంగా హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో కొట్టిన రెండు వరుస సిక్సులు అయితే.. ఆ వరల్డ్ కప్ టోర్నీకే హైలెట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో.. పాక్ బౌలింగ్‌లో ఎంత పటిష్టంగా ఉన్నా.. రౌఫ్, షాహీన్ అఫ్రిదీలో వంద మంది వచ్చినా.. కోహ్లీ ఒక్కడే ఒంటిచేత్తో కొట్టిపడేస్తాడని భారత క్రికెట్ అభిమానులు ధీమాగా ఉన్నారు. మరి పాక్ బౌలింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Pace is pace yaar💥💥🔥🔥#PakvsAfgpic.twitter.com/W4BT31b6sT
— H. (@_Ironstand) August 22, 2023
ఇదీ చదవండి: సచిన్ టెండుల్కర్‌కు కీలక బాధ్యతలు..మూడేళ్ల పాటు..