iDreamPost
android-app
ios-app

సెమీస్ ఫిక్స్ చేసి.. ఇండియాని గెలిపించారు: పాక్ నటి

  • Author Soma Sekhar Published - 03:04 PM, Thu - 16 November 23

మరోసారి తన కుళ్లు బుద్దిని బయటపెట్టింది పాక్ నటి సెహర్ షిన్వారీ. టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్లోకి వెళ్లడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నానని పోస్ట్ చేసింది. మరిన్ని ఆరోపణలు టీమిండియాపై గుప్పించింది.

మరోసారి తన కుళ్లు బుద్దిని బయటపెట్టింది పాక్ నటి సెహర్ షిన్వారీ. టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్లోకి వెళ్లడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నానని పోస్ట్ చేసింది. మరిన్ని ఆరోపణలు టీమిండియాపై గుప్పించింది.

  • Author Soma Sekhar Published - 03:04 PM, Thu - 16 November 23
సెమీస్ ఫిక్స్ చేసి.. ఇండియాని గెలిపించారు: పాక్ నటి

వరల్డ్ కప్ 2023లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. లీగ్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీస్ కు చేరిన భారత్ జట్టు.. అదే జోరును కివీస్ పైనా చూపించింది. వాంఖడే వేదికగా జరిగిన తొలి నాకౌట్ పోరులో న్యూజిలాండ్ ను 70 రన్స్ తో చిత్తు చేసి వరల్డ్ కప్ ఫైనల్లోకి అడుగుపెట్టింది టీమిండియా. కాగా.. భారత జట్టు ఫైనల్ కు ప్రవేశించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు పాక్ మాజీ క్రికెటర్లు, ఓ పాక్ నటి. ఈ వరల్డ్ కప్ లీగ్ దశలో బంగ్లాదేశ్ జట్టు టీమిండియాను ఓడిస్తే.. బంగ్లా ఆటగాడితో డేట్ కు వెళ్తానంటూ ప్రకటన చేసింది పాక్ నటి సెహర్ షిన్వారీ. తాజాగా మరోసారి తన కుళ్లు బుద్దిని చూపిస్తూ.. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ షేర్ చేసింది.

ప్రపంచ కప్ ఫైనల్లోకి అడుగుపెట్టిన టీమిండియాపై వరల్డ్ వైడ్ గా ప్రశంసలు కురుస్తున్నాయి. కానీ పాకిస్థాన్ అభిమానులు మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పాక్ ఫ్యాన్స్ కంటే ఎక్కువగా పాక్ మాజీ ఆటగాళ్లు తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. తాజాగా మరోసారి తన కుళ్లు బుద్దిని బయటపెట్టింది పాక్ నటి సెహర్ షిన్వారీ. టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్లోకి వెళ్లడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నానని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసింది.

“భారత్ అన్నింటిలో పాక్ కంటే ఎలా ముందుందో నాకు అర్ధం కావడం లేదని, త్వరలోనే బీసీసీఐ, బీజేపీలు సర్వనాశం అవుతాయి. న్యూజిలాండ్ తో మ్యాచ్ ఫిక్స్ అయిందని టీమిండియా ఆటగాళ్లకు ముందే తెలుసు. కానీ వారు ఏమీ తెలియనట్లు గ్రౌండ్ లో నటించారు. వాళ్లంతా మంచి నటులు” అంటూ తన వక్రబుద్దిని చాటుకుంది. కాగా.. కొన్ని రోజుల క్రితమే టీమిండియాను బంగ్లాదేశ్ ఓడిస్తే.. బంగ్లా క్రికెటర్ తో డేట్ కు వెళ్తానని సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ ట్విట్ వైరల్ కావడంతో.. టీమిండియా ఫ్యాన్స్ పాక్ నటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఇలాగే శాపనార్థాలు పెడుతూ ఉండండి.. మేం వరల్డ్ కప్ ముద్దాడుతాం అంటూ ఇండియన్ ఫ్యాన్స్ రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet