iDreamPost
android-app
ios-app

BCCIని బెదిరించేందుకు చూస్తున్న పాకిస్థాన్‌! మా దేశానికి రాకుంటే..!

  • Published Jul 15, 2024 | 8:49 AM Updated Updated Jul 15, 2024 | 8:49 AM

BCCI, PCB, Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం ఇండియా, పాకిస్థాన్‌కు రావాలని పీసీబీ గట్టిగా కోరుకుంటోంది. బీసీసీఐ కుదరదు అంటే.. బ్లాక్‌ మెయిలింగ్‌కు దిగేందుకు సిద్ధం అవుతోంది. మరి ఏం చెప్పి బెదిరిస్తోందో ఇప్పుడు చూద్దాం..

BCCI, PCB, Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం ఇండియా, పాకిస్థాన్‌కు రావాలని పీసీబీ గట్టిగా కోరుకుంటోంది. బీసీసీఐ కుదరదు అంటే.. బ్లాక్‌ మెయిలింగ్‌కు దిగేందుకు సిద్ధం అవుతోంది. మరి ఏం చెప్పి బెదిరిస్తోందో ఇప్పుడు చూద్దాం..

  • Published Jul 15, 2024 | 8:49 AMUpdated Jul 15, 2024 | 8:49 AM
BCCIని బెదిరించేందుకు చూస్తున్న పాకిస్థాన్‌! మా దేశానికి రాకుంటే..!

బీసీసీఐ, పీసీబీ(పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు) ప్రస్తుతం ఓల్డ్‌ వార్‌ సాగుతోంది. ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ఆడేందుకు టీమిండియా తమ దేశానికి రావాలని పీసీబీ, తమ టీమ్‌ను అక్కడికి పంపేది లేదు.. కావాలంటే టోర్నీని హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించాలని బీసీసీఐ పట్టుబట్టి కూర్చున్నాయి. ఈ నెల 19, 22 మధ్య ఐసీసీ(ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సింగ్‌) వార్షిక సమావేశం శ్రీలంకలోని కొలంబో వేదికగా జరగనుంది. ఈ సమావేశంలోనే టీమిండియా పాకిస్థాన్‌ వెళ్తుందా? లేదా? ఛాంపియన్స్‌ ట్రోఫీని హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహిస్తారా? లేదా? అనేది తేలిపోనుంది.

భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్థాన్‌కు పంపేందుకు భారత క్రికెట్‌ బోర్డు సిద్ధంగా లేదు. 2008 నుంచి భారత జట్టు పాక్‌లో పర్యటించడం లేదు. ఈ రెండు దేశాల మధ్య కేవలం ఐసీసీ ఈవెంట్స్‌లో మాత్రమే మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అయితే.. ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు కచ్చితంగా తమ దేశానికి రావాల్సిందేనని పాక్‌ క్రికెట్‌ బోర్డు బలంగా డిమాండ్‌ చేస్తోంది. బీసీసీఐ కుదరదు అంటే.. 2026లో భారత్‌, శ్రీలంక వేదికగా జరిగే టీ20 వరల్డ్‌ కప్‌ నుంచి తాము తప్పుకుంటామంటూ బెదిరింపులకు దిగుతోంది.

అయినా కూడా బీసీసీఐ.. భారత జట్టును ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం పాకిస్థాన్‌కు పంపేందుకు సిద్ధంగా లేదు. అందుకు బదులుగా టీమిండియా ఆడే మ్యాచ్‌లను దుబాయ్‌ లేదా శ్రీలంకలో నిర్వహించాలని కోరుతోంది. దీన్నే హైబ్రిడ్‌ మోడల్‌ అంటారు. ఛాంపియన్స్‌ ట్రోఫీలోని అన్ని మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో, భారత్‌ ఆడే మ్యాచ్‌లు పాకిస్థాన్‌ బయట ఆడాలని బీసీసీఐ ప్రతిపాదిస్తోంది. దీన్ని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు అస్సలు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే.. టీమిండియా పాకిస్థాన్‌కు వచ్చి ఆడితే.. వారికి ఆర్థికంగా చాలా లాభం జరుగుతుంది. అందుకే పీసీబీ అంత పట్టుబడుతోంది. టీమిండియాను తమ దేశానికి రప్పించేందుకు పీసీబీ చివరికి బ్లాక్‌ మెయిలింగ్‌కు దిగడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.