IND vs USA: అమెరికాపై ఇండియా గెలవాలని పాకిస్థాన్‌ ప్రార్థనలు! ఎందుకో తెలుసా?

IND vs USA, T20 World Cup 2024: అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియానే గెలవాలని పాకిస్థాన్‌ మొత్తం ప్రార్థనలు చేస్తోంది. టీమిండియాపై వారికి అంత ప్రేమ ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..

IND vs USA, T20 World Cup 2024: అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియానే గెలవాలని పాకిస్థాన్‌ మొత్తం ప్రార్థనలు చేస్తోంది. టీమిండియాపై వారికి అంత ప్రేమ ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా టీమిండియా తమ మూడో మ్యాచ్‌కు సిద్ధం అవుతుంది. ఇప్పటికే ఐర్లాండ్‌, పాకిస్థాన్‌పై విజయం సాధించి.. గ్రూప్‌-ఏలో టేబుల్‌ టాపర్‌గా ఉన్న రోహిత్‌ సేన.. ఇప్పుడు యూఎస్‌ఏపై కూడా గెలిచి.. సూపర్‌ 8కు అధికారికంగా అర్హత సాధించాలని చూస్తోంది. అది ఇండియాకు పెద్ద కష్టమేమి కాదు కానీ, పాకిస్థాన్‌ను ఓడించిన యూఎస్‌ఏ జట్టును తక్కువ అంచనా వేయకూడదని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. ఇక్కడ యూఎస్‌ఏ టీమ్‌ను హైప్‌ చేయడం కాదు కానీ, మ్యాచ్‌ జరగబోయే పిచ్‌కు భయపడాల్సి వస్తోంది. హేమాహేమీ బ్యాటర్లు ఉన్న టీమిండియా కూడా న్యూయార్క​్‌లోని నసావు పిచ్‌పై 120 పరుగులు చేయలేకపోయింది. పాకిస్థాన్‌ కూడా అంతే. అయితే.. అమెరికాపై ఇండియానే కచ్చితంగా విజయం సాధించాలని భారత క్రికెట్‌ అభిమానుల కంటే ఎక్కువ పాకిస్థాన్‌ క్రికెట్‌ అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. వారికి అంత ప్రేమ ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇండియా పాకిస్థాన్‌ రైవల్రీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఈ రెండు శత్రుదేశాలు. క్రికెట్‌లో ఇండియా-పాకిస్థాన్‌ తలపడుతున్నాయంటే.. అదో మినీ యుద్ధంలా భావించేవాళ్లు కొన్ని కోట్ల మంది ఉన్నారు. కలలో కూడా ఇండియా గెలవాలని పాకిస్థానీయులు, పాకిస్థాన్‌ గెలవాలని భారతీయులు అనుకోరు. కానీ, ఇప్పుడు పాకిస్థాన్‌కు టీమిండియా అవసరం వచ్చింది. అందుకే అమెరికాపై ఎలాగైనా టీమిండియానే గెలవాలని పాకిస్థాన్‌ క్రికెట్‌ అభిమానులు కోరుకుంటున్నారు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో పాకిస్థాన్‌ సూపర్‌ 8 ఆశలు సజీవంగా ఉండాలంటే అమెరికాపై ఇండియా గెలవాలి. అందుకే ఇప్పుడు పాకిస్థాన్‌ క్రికెట్‌ అభిమానులతో పాటు, పాకిస్థాన్‌ క్రికెటర్లు కూడా ఇండియా గెలవాలని కోరుకుంటున్నారు.

ఒక వేళ ఇండియాపై అమెరికా గెలిస్తే పాకిస్థాన్‌ దాదాపు ఇంటికి వెళ్లిపోయినట్లే లెక్క. ఎందుకంటే.. ఇండియాకు అమెరికా తర్వాత కెనడాతో మ్యాచ్‌ ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఈ ఒక్కటి గెలిచినా టీమిండియా సూపర్‌ 8కు వెళ్లిపోతుంది. మరోవైపు యూఎస్‌ఏ కూడా రెండు విజయాలతో ఉంది. ఇండియాతో తర్వాత ఐర్లాండ్‌తో యూఎస్‌ఏ మ్యాచ్ ఆడనుంది. ఇండియాపై అమెరికా ఓడితే.. చివరి మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో కూడా అమెరికా ఓడిపోతే.. పాకిస్థాన్‌ తమ మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తే.. అప్పుడు పాక్‌, అమెరికా రెండూ.. రెండేసి విజయాలతో సమంగా ఉంటాయి. రన్‌రేట్‌ ఆధారంగా ఒక జట్టు సూపర్‌ 8కు చేరుతుంది. ఇండియా ఎలాగో కెనడాపై గెలుస్తుంది, ఇప్పుడు అమెరికాపై కూడా గెలిస్తే.. ఐర్లాండ్‌ వర్సెస్‌ అమెరికా మ్యాచ్‌పై పాక్‌ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. పరిస్థితి అక్కడి వరకు వెళ్లాలంటే.. ఇప్పుడు ఇండియా గెలవాలి, అదే పాకిస్థాన్‌ కోరుకుంటుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments