ఆసియా కప్-2023 ఫైనల్‌కు చేరుకుంది శ్రీలంక. గురువారం అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 2 వికెట్ల తేడాతో నెగ్గిన శ్రీలంక తుదిపోరుకు అర్హత సాధించింది. వర్షం వల్ల 45 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌ను తర్వాత డక్‌వర్త్ లూయిస్ విధానంలో 42 ఓవర్లకు సవరించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగగిన పాకిస్థాన్ 7 వికెట్లకు 252 రన్స్ చేసింది. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (86 నాటౌట్) అదిరే ఇన్నింగ్స్‌తో పాక్‌ను అదుకున్నాడు. ఇఫ్తికార్ (47), షఫిక్ (52) కూడా రాణించడంతో పాక్ మంచి స్కోరు చేయగలిగింది. లంక బౌలర్లలో పతిరన మూడు వికెట్లు, ప్రమోద్ మదుశాన్ రెండు వికెట్లు పడగొట్టారు. వెల్లలాగె (1/40), తీక్షణ (1/42) కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంక 42 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 252 రన్స్ చేసి విజయాన్ని అందుకుంది.
లాస్ట్ బాల్‌కు లంక టీమ్ విక్టరీని సాధించింది. ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించిన ఓపెనర్ కుశాల్ పెరీరా (17) రనౌటై వెనుదిరిగాడు. ఆ తర్వాత నిశాంక (29), సమరవిక్రమ (48)లతో కలసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు కుశాల్ మెండిస్. తీవ్ర ఒత్తిడిలోనూ అద్భుతమైన షాట్లు ఆడుతూ లంక జట్టు ఆశలు నిలబెట్టాడు. వీళ్ల జోరుతో ఒక దశలో 177/2తో లంక ఈజీగా గెలిచేస్తుందనిపించింది. కానీ ఇఫ్తికార్ అహ్మద్ (3/50) విజృంభించడంతో స్వల్ప వ్యవధిలో లంక వరుసగా వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ శనక (2) కూడా వెనుదిరగడంతో మ్యాచ్ పాకిస్థాన్ వైపు మొగ్గినట్లు కనిపించింది. అసలంక (49 నాటౌట్) చివరి వరకు పట్టువదలకుండా అద్భుతమైన ఇన్నింగ్స్‌ను ఆడి మ్యాచ్ గెలిపించాడు. పాక్‌పై మ్యాచ్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన అసలంకపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే లంకను అసలంక గెలిపించినా.. అసలైన హీరో మాత్రం మదుషన్ అనే చెప్పాలి.
ఆఖరి ఓవర్లో లంకకు 8 రన్స్ అవసరం కాగా.. తొలి 3 బంతుల్లో 2 పరుగులే వచ్చాయి. నాలుగో బాల్‌కు షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు మదుషన్. కానీ బాల్ తగల్లేదు. బంతి కీపర్ చేతుల్లోకి వెళ్లడంతో నాన్‌స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న అసలంక రన్ కోసం పరిగెత్తాడు. దీంతో తాను ఔట్ అవుతానని తెలిసినా మదుషన్ రన్ కోసం ప్రయత్నించక తప్పలేదు. కానీ మదుషన్ వెంటనే పరిగెత్తలేదు. అసలంక బ్యాటింగ్ క్రీజులోకి చేరుకునే వరకు ఆగి నాన్‌స్ట్రయికింగ్ ఎండ్ వైపునకు వెళ్లాడు. ఒకవేళ మదుషన్ ముందే పరిగెత్తితే కీపర్ త్రోకు అసలంక ఔటయ్యే ఛాన్స్ ఉందని గ్రహించి, తెలివిగా అలా చేశాడు. ఇక, కీపర్ నుంచి బాల్ అందుకున్న బౌలర్ జమాన్ ముదుషన్ను రనౌట్ చేశాడు. అయితే అతడి త్యాగం వృథా పోలేదు. అసలంక తర్వాతి రెండు బంతుల్లో ఫోర్, 2 రన్స్ తీసి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో చేసింది ఒక్క పరుగే అయినా.. అసలంక కోసం ఔటైన మదుషన్ రియల్ హీరో అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు.
ఇదీ చదవండి: లంకతో మ్యాచ్‌లో పాక్ ఓటమి.. ఏడ్చేసిన బాబర్ ఆజమ్!
Well done Madushanka !! Smart and brilliant art of sacrificing the wicket and getting non striker back on strike. Don’t leave the crease until non striker makes it so that even if keeper hits, its not out. #SLvPAK pic.twitter.com/1KRl3Z1mMT
— Aman (@CricketSatire) September 14, 2023