iDreamPost
android-app
ios-app

గెలిపించింది అసలంక అయినా.. హీరో మాత్రం మదుషన్!

  • Author singhj Updated - 12:54 PM, Fri - 15 September 23
  • Author singhj Updated - 12:54 PM, Fri - 15 September 23
గెలిపించింది అసలంక అయినా.. హీరో మాత్రం మదుషన్!

ఆసియా కప్-2023 ఫైనల్​కు చేరుకుంది శ్రీలంక. గురువారం అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్​లో పాకిస్థాన్​పై 2 వికెట్ల తేడాతో నెగ్గిన శ్రీలంక తుదిపోరుకు అర్హత సాధించింది. వర్షం వల్ల 45 ఓవర్లకు కుదించిన మ్యాచ్​ను తర్వాత డక్​వర్త్ లూయిస్ విధానంలో 42 ఓవర్లకు సవరించారు. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగగిన పాకిస్థాన్ 7 వికెట్లకు 252 రన్స్ చేసింది. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (86 నాటౌట్) అదిరే ఇన్నింగ్స్​తో పాక్​ను అదుకున్నాడు. ఇఫ్తికార్ (47), షఫిక్ (52) కూడా రాణించడంతో పాక్ మంచి స్కోరు చేయగలిగింది. లంక బౌలర్లలో పతిరన మూడు వికెట్లు, ప్రమోద్ మదుశాన్ రెండు వికెట్లు పడగొట్టారు. వెల్లలాగె (1/40), తీక్షణ (1/42) కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన లంక 42 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 252 రన్స్ చేసి విజయాన్ని అందుకుంది.

లాస్ట్​ బాల్​కు లంక టీమ్ విక్టరీని సాధించింది. ఇన్నింగ్స్​ను ధాటిగా ఆరంభించిన ఓపెనర్ కుశాల్ పెరీరా (17) రనౌటై వెనుదిరిగాడు. ఆ తర్వాత నిశాంక (29), సమరవిక్రమ (48)లతో కలసి ఇన్నింగ్స్​ను ముందుకు నడిపించాడు కుశాల్ మెండిస్. తీవ్ర ఒత్తిడిలోనూ అద్భుతమైన షాట్లు ఆడుతూ లంక జట్టు ఆశలు నిలబెట్టాడు. వీళ్ల జోరుతో ఒక దశలో 177/2తో లంక ఈజీగా గెలిచేస్తుందనిపించింది. కానీ ఇఫ్తికార్ అహ్మద్ (3/50) విజృంభించడంతో స్వల్ప వ్యవధిలో లంక వరుసగా వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ శనక (2) కూడా వెనుదిరగడంతో మ్యాచ్ పాకిస్థాన్ వైపు మొగ్గినట్లు కనిపించింది. అసలంక (49 నాటౌట్) చివరి వరకు పట్టువదలకుండా అద్భుతమైన ఇన్నింగ్స్​ను ఆడి మ్యాచ్ గెలిపించాడు. పాక్​పై మ్యాచ్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన అసలంకపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే లంకను అసలంక గెలిపించినా.. అసలైన హీరో మాత్రం మదుషన్ అనే చెప్పాలి.

ఆఖరి ఓవర్లో లంకకు 8 రన్స్ అవసరం కాగా.. తొలి 3 బంతుల్లో 2 పరుగులే వచ్చాయి. నాలుగో బాల్​కు షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు మదుషన్. కానీ బాల్ తగల్లేదు. బంతి కీపర్ చేతుల్లోకి వెళ్లడంతో నాన్​స్ట్రయికింగ్ ఎండ్​లో ఉన్న అసలంక రన్ కోసం పరిగెత్తాడు. దీంతో తాను ఔట్ అవుతానని తెలిసినా మదుషన్ రన్ కోసం ప్రయత్నించక తప్పలేదు. కానీ మదుషన్ వెంటనే పరిగెత్తలేదు. అసలంక బ్యాటింగ్​ క్రీజులోకి చేరుకునే వరకు ఆగి నాన్​స్ట్రయికింగ్ ఎండ్ వైపునకు వెళ్లాడు. ఒకవేళ మదుషన్ ముందే పరిగెత్తితే కీపర్ త్రోకు అసలంక ఔటయ్యే ఛాన్స్ ఉందని గ్రహించి, తెలివిగా అలా చేశాడు. ఇక, కీపర్ నుంచి బాల్ అందుకున్న బౌలర్ జమాన్ ముదుషన్​ను రనౌట్ చేశాడు. అయితే అతడి త్యాగం వృథా పోలేదు. అసలంక తర్వాతి రెండు బంతుల్లో ఫోర్, 2 రన్స్ తీసి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో చేసింది ఒక్క పరుగే అయినా.. అసలంక కోసం ఔటైన మదుషన్ రియల్ హీరో అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు.

ఇదీ చదవండి: లంకతో మ్యాచ్​లో పాక్ ఓటమి.. ఏడ్చేసిన బాబర్ ఆజమ్!