Nidhan
పాకిస్థాన్ జట్టు పరువు మళ్లీ పోయింది. టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రాతో పోల్చుకున్న బాబర్ సేనకు తగిన శాస్తి జరిగింది.
పాకిస్థాన్ జట్టు పరువు మళ్లీ పోయింది. టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రాతో పోల్చుకున్న బాబర్ సేనకు తగిన శాస్తి జరిగింది.
Nidhan
ప్రతి విషయంలోనూ భారత జట్టుతో పోల్చుకోవడం పాకిస్థాన్‌కు అలవాటుగా మారింది. టీమిండియా కంటే అన్నింటా తామే తోపు అంటూ ఎప్పుడూ బడాయికి పోతూ ఉంటుంది దాయాది. ఆ దేశ అభిమానులు కూడా విరాట్ కోహ్లీ కంటే బాబర్ ఆజం గొప్పోడు అని, భారత్ కంటే పాక్ పెద్ద టీమ్ అని, పాకిస్థాన్ సూపర్ లీగ్ ముందు ఐపీఎల్ దేనికీ పనికి రాదంటూ ఇష్టం వచ్చినట్లు వాగుతుండటం తెలిసిందే. అయితే కోహ్లీ రికార్డుల ముందు బాబర్ జూజూబీ అని కొత్తగా చెప్పనవసరం లేదు. వేలాది కోట్లతో నిర్వహించే ఐపీఎల్ ముందు పీఎస్ఎల్ చాలా చిన్న టోర్నీ. ప్రతి విషయంలో కంపేర్ చేసుకోవడం ఆ తర్వాత ఫ్యాక్ట్స్ తెలిసి పాక్‌ను క్రికెట్ ఫ్యాన్స్ తిట్టడం పరిపాటిగా మారింది. ఇప్పుడు ఆ జట్టు మరోమారు పరువు పోగొట్టుకుంది.
ఈ మధ్య ఓ సందర్భంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం మాట్లాడుతూ టీమిండియా స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బుమ్రా కంటే తమ జట్టు పేసర్ నసీమ్ షానే గ్రేట్ అన్నాడు. డెత్ బౌలింగ్‌లో నసీంను మించినోళ్లు లేరంటూ ఆకాశానికి ఎత్తేశాడు. డెత్ ఓవర్స్‌లో టార్గెట్‌ను డిఫెండ్ చేయడంలో బుమ్రా కంటే నసీం తోపు అంటూ ప్రశంసించాడు. దీనిపై సోషల్ మీడియాలో భారత జట్టు అభిమానులతో పాటు ఇతర క్రికెట్ కంట్రీస్ ఫ్యాన్స్ నుంచి కూడా బాబర్ విమర్శలు ఎదుర్కొన్నాడు. వరల్డ్ క్రికెట్లో ఇప్పుడు బుమ్రాను మించినోళ్లు లేరని, అన్ని ఫార్మాట్లలోనూ అతడే బెస్ట్ అని.. అలాంటోడ్ని నసీం లాంటి బచ్చా ప్లేయర్‌తో పోల్చడం ఏంటంటూ ట్రోల్ చేశారు. అయితే బుమ్రాతో కంపేరిజన్కు వచ్చిన నసీం తాజాగా న్యూజిలాండ్ బీ టీమ్ మీద చెత్తగా బౌలింగ్ చేయడం గమనార్హం.
నసీం షా బౌలింగ్‌లో కివీస్ బ్యాటర్లు చితగ్గొట్టారు. పాక్‌తో ఆ టీమ్‌కు మధ్య జరిగిన మూడో టీ20లో నసీం బౌలింగ్‌ను న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ఓ ఆటాడుకున్నారు. 16వ ఓవర్లో బౌలింగ్‌కు దిగిన పాక్ పేసర్‌కు చుక్కలు చూపించారు. వరుసగా 6, 4, 6, 4, 1, 2 బాదారు. ఓవరాల్‌గా ఆ ఓవర్లో 23 పరుగులు పిండుకున్నారు. నసీం బౌలింగ్‌లో వచ్చిన బాల్‌ను వచ్చినట్లు పిచ్చకొట్టుడు కొడుతుంటే అతడితోపాటు బాబర్ ఆజంకు కూడా ఏమీ పాలుపోలేదు. పాక్ ఓడిన ఈ మ్యాచ్‌లో నసీం 3 ఓవర్లలో ఏకంగా 44 పరుగులు ఇచ్చుకున్నాడు. దీంతో ట్రోలర్స్ మళ్లీ విరుచుకుపడుతున్నారు. బుమ్రా కంటే తోపు అన్నారుగా.. మీకు తగిన శాస్తి జరిగిందని కామెంట్స్ చేస్తున్నారు. విలియమ్సన్, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ లేనప్పుడే ఇంతలా బాదారంటే.. వాళ్లే గనుక ఉంటే నసీం దుకాణం మూసుకోవాల్సి వచ్చేదంటూ ఎగతాళి చేస్తున్నారు. మరి.. పాక్ మళ్లీ పరువు పోగొట్టుకోవడంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Shaheen Afridi 3.2 over 37 runs
Naseem shah 3.0 over 44 runs
Iftkahar Ahmed 4.0 over 31 runs
Abbe Afridi 3.0 over 27 runs
Shadab Khan 3.0 over 24 runs
Ibrar Ahmed 2.0 over 16
Pakistan bowling 🤦🤦#PAKvNZ #BabarAzam𓃵 pic.twitter.com/oTxskuWAYN— Rafeeq Ahmed 🇵🇰 (@Rafeeq0122) April 21, 2024