పాక్ పరువు తీసిన కామెంటేటర్ హర్షా భోగ్లే.. మళ్లీ నోరెత్తకుండా స్ట్రాంగ్ కౌంటర్!

  • Author singhj Published - 09:00 AM, Fri - 8 December 23

పాకిస్తాన్ పరువు తీసేశాడు స్టార్ కామెంటేటర్ హర్షా భోగ్లే. మళ్లీ నోరెత్తకుండా గట్టిగా ఇచ్చి పడేశాడు.

పాకిస్తాన్ పరువు తీసేశాడు స్టార్ కామెంటేటర్ హర్షా భోగ్లే. మళ్లీ నోరెత్తకుండా గట్టిగా ఇచ్చి పడేశాడు.

  • Author singhj Published - 09:00 AM, Fri - 8 December 23

సొంతగడ్డపై గెలవడం ఏ జట్టుకైనా సులువే. కానీ విదేశాల్లో వెళ్లి ఆడి నెగ్గడం అంత ఈజీ కాదు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ లాంటి టీమ్స్ ఆసియా దేశాల్లో ఆడేందుకు చాలా ఇబ్బంది పడతాయి. ముఖ్యంగా టెస్టులు అంటేనే భయపడతాయి. స్పిన్ పిచ్ మీద గింగిరాలు తిరుగుతున్న బాల్​ను ఫేస్ చేసేందుకు ఫారెన్ బ్యాటర్స్ వణుకుతారు. ఇక్కడి ఉక్కపోతను తట్టుకొని బ్యాటింగ్ చేయడం చాలా కష్టం అనేది తెలిసిందే. అదే సమయంలో భారత ఉపఖండ జట్లు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్​లో ఆడటానికి అంతే స్థాయిలో ఇబ్బంది పడతాయి. అక్కడి బౌన్సీ, ఫాస్ట్ ట్రాక్​లపై రివ్వున దూసుకొచ్చే బంతులను ఆడటం పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి.

భారత్, పాకిస్థాన్, శ్రీలంక లాంటి ఆసియా టీమ్స్​కు ఫారెన్ కంట్రీస్​లో గొప్ప రికార్డు లేదు. టెస్ట్ సిరీస్​లను పక్కనబెడితే కనీసం ఒక్క మ్యాచ్ గెలవకుండానే వైట్ వాష్ అయి వచ్చిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అయితే టీమిండియా మాత్రం ఈ చరిత్రను తిరగరాస్తోంది. గత కొన్నేళ్లలో విదేశాల్లో మన ఆటతీరు గణనీయంగా మారింది. ఇంగ్లండ్​తో టెస్ట్ సిరీస్​ను సమం చేయడం, ఆసీస్​ను వాళ్ల దేశంలోనే ఓడించడం లాంటి అరుదైన ఘనతలను సాధించింది భారత్. ఒకసారి కంగారూలతో సిరీస్​లో స్టార్ ప్లేయర్లు లేకపోయినా రిషబ్ పంత్ లాంటి యంగ్​స్టర్స్ అందరూ సమష్టిగా ఆడి ఆసీస్​ను చిత్తు చేశారు. 2020లో జరిగిన ఆ సిరీస్​లో పింక్ బాల్ టెస్ట్​లో 36కే కుప్పకూలింది టీమిండియా.

పింక్ బాల్ టెస్ట్​లో ఓడినా ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్న భారత్.. ఆ సిరీస్​ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. అయితే అప్పటి మన జట్టు ప్రదర్శనను చులకన చేస్తూ కొందరు పాకిస్థాన్ అభిమానులు నెట్టింట అడ్డగోలుగా పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం పాక్ టీమ్ ఆసీస్ పర్యటనలో ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఆ సిరీస్​లో ఫెయిలైతే భారత్ 36కే ఆలౌట్ అవ్వడాన్ని గుర్తుచేసుకోవాలని ఓ పాక్ ఫ్యాన్ ఒక వీడియో పెట్టాడు. టీమిండియాను ఆస్ట్రేలియా చిత్తు చేయడాన్ని చూసి ఎంజాయ్ చేయాలంటూ ఆ మ్యాచ్​కు సంబంధించిన వీడియోను నెట్టింట షేర్ చేశాడు. ఇది చూసిన ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే అతడికి స్ట్రాంగ్​ కౌంటర్ ఇచ్చాడు. మళ్లీ ఇండియా పేరెత్తకుండా ఇచ్చిపడేశాడు.

భారత్​ పింక్ బాల్ టెస్ట్ వీడియోను మళ్లీ బయటకు తీసినందకు సంతోషంగా ఉందన్నాడు హర్షా భోగ్లే. ఎందుకంటే ఆ మ్యాచ్​లో ఓటమి తర్వాత టీమిండియా అసలైన సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసిందన్నాడు. అద్భుతమైన కెప్టెన్సీ, పట్టుదల, కసి ఉంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలమనే కాన్ఫిడెన్స్ భారత్​కు కలిగిందన్నాడు. ఇలాంటి విషయాలను నెమరు వేసుకున్నప్పుడే మళ్లీ జోష్​తో ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంటుందని హర్షా భోగ్లే కౌంటర్ ఇచ్చాడు. మెచ్యూర్డ్​గా ఆలోచించు.. మీది కురచ బుద్ధి అంటూ పాక్ పరువు తీసేశాడు. మరి.. పాక్​కు హర్షా భోగ్లే స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: AB De Villiers: షాకింగ్ విషయం బయటపెట్టిన డివిలియర్స్.. ఆ సమస్యతోనే రెండేళ్లు ఆడానంటూ..!

Show comments