iDreamPost
android-app
ios-app

ఆసియా కప్ లో పాక్ ని వణికిస్తున్న నేపాల్! బాబర్ సెంచరీతో..!

  • Author Soma Sekhar Updated - 06:10 PM, Wed - 30 August 23
  • Author Soma Sekhar Updated - 06:10 PM, Wed - 30 August 23
ఆసియా కప్ లో పాక్ ని వణికిస్తున్న నేపాల్! బాబర్ సెంచరీతో..!

ఆసియా కప్ టైటిల్ ఫేవరెట్ పాకిస్థాన్ అంటూ గాంభీరాలు పలికిన పాక్ మాజీ ప్లేయర్లకు తొలి మ్యాచ్ లోనే దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తున్నారు నేపాల్ ప్లేయర్లు. పసికూనగా ఆసియా కప్ బరిలోకి దిగిన నేపాల్.. తొలి మ్యాచ్ లోనే పటిష్టమైన పాక్ జట్టును వణికిస్తోంది. కట్టుదిట్టంగా బంతులు సంధిస్తూ.. పాక్ టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చారు నేపాల్ బౌలర్లు. ఇటు బౌలింగ్ లో, అటు ఫీల్డింగ్ లో దుమ్మురేపుతున్నారు పసికూన ఆటగాళ్లు. నేపాల్ బౌలర్ల ధాటికి 124 పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయింది పాక్.

ఆసియా కప్ లో భాగంగా ముల్తాన్ వేదికగా.. జరుగుతున్న తొలి మ్యాచ్ లో పాక్-నేపాల్ జట్లు తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో నేపాల్ జట్టు సమష్టిగా దుమ్మురేపుతోంది. పటిష్టమైన పాక్ బ్యాటింగ్ లైనప్ ను పేకమేడలా కుప్పకూల్చి మ్యాచ్ పై పట్టు సాధించింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే తొలి ఓవర్ నుంచే నేపాల్ బౌలర్లు పాక్ ఓపెనర్లపై ఆధిపత్యం చెలాయించారు. నేపాల్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు సంధిస్తుండటంతో.. పరుగులు రావడం కూడా కష్టంగా మారింది.

కాగా.. ఇన్నింగ్స్ 5వ ఓవర్ లోనే ఓపెనర్ ఫఖర్ జమాన్(14) ధాటిగా ఆడే ప్రయత్నంలో వెనుదిరిగాడు. దీంతో పాక్ వికెట్ల పతనం మెుదలైంది. ఆ తర్వాత ఓవర్ లోనే ఇమామ్ ఉల్ హక్(5) రనౌట్ గా అవుట్ కాగా.. రిజ్వాన్ తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కబెట్టే ప్రయత్నం చేశాడు కెప్టెన్ బాబర్. ఈ క్రమంలోనే అర్దశతకం వైపు దూసుకెళ్తున్న రిజ్వాన్ ను 44 పరుగుల వద్ద అద్భుతమైన త్రోతో రనౌట్ చేశాడు దీపేంద్ర సింగ్. ఆ తర్వాత వచ్చిన ఆఘ సల్మాన్(5) కూడా నిరాశ పరిచాడు. దీంతో కేవలం 124 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది పాక్. 27 ఓవర్లకే పాకిస్తాన్ జట్టు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిపోయింది.

అయితే కష్టాల్లో ఉన్న పాక్ ను కెప్టెన్ బాబర్ అజామ్ గట్టెక్కించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు. అతను తన కెప్టెన్ ఇన్నింగ్స్ తో టీమ్ ను ఆదుకున్నాడనే చెప్పాలి. అవసరమైన సమయంలో సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. 10 ఫోర్ల సాయంతో శతకం బాదడు. ఇఫ్తిఖర్ అహ్మద్(51) కూడా అర్ధశతకంతో దూసుకుపోతున్నాడు. వీళ్లు రాణించడంతో తక్కువ స్కోర్ కు పరిమితం అవుతుంది అనుకున్న పాక్ జట్టు 42 ఓవర్లకు 230 పరుగులతో రాణిస్తోంది. ఏది ఏమైనప్పటికే పసికూన అనుకున్న నేపాల్ జట్టు పాక్ టాపార్డర్ ను కుప్పకూల్చి తన సత్తా ఏంటో రుచి చూపించింది. మరి టోర్నీ ప్రారంభానికి ముందు గాంభీరాలు పలికిన పాక్ ను నేపాల్ వణికించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.