Nidhan
Shaheen Afridi, PAK vs BAN: ఓ స్టార్ క్రికెటర్ తొలిసారి తండ్రి అయ్యాడు. అయినా ఆ ప్లేయర్ ఇప్పుడు సెలబ్రేట్ చేసుకునే పరిస్థితుల్లో లేడు. ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Shaheen Afridi, PAK vs BAN: ఓ స్టార్ క్రికెటర్ తొలిసారి తండ్రి అయ్యాడు. అయినా ఆ ప్లేయర్ ఇప్పుడు సెలబ్రేట్ చేసుకునే పరిస్థితుల్లో లేడు. ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Nidhan
ఎవరి లైఫ్‌లో అయినా పెళ్లి ఎలా ఎప్పటికీ గుర్తుండిపోతుందో అలాగే ఫస్ట్ టైమ్ పేరెంట్స్ అయిన ఫీలింగ్ కూడా అలాగే గుర్తుండిపోతుంది. సంతానం కలిగినప్పుడు బిడ్డను చేతుల్లో ఎత్తుకొని మురిసిపోయిన క్షణాలు మెమరబుల్‌గా ఉంటాయి. ఆ క్షణాలను అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. వారసులు వచ్చారని అందరికీ కాల్స్ చేసి చెబుతారు, స్వీట్లు పంచుతారు. చాన్నాళ్ల వరకు హ్యాపీ మూడ్‌లోనే ఉంటారు. అయితే కొందరి విషయంలో మాత్రం ఇది కుదరదు. అనుకోని సమస్యలు, అపజయాలు వారిని ఆ ఆనందానికి దూరం చేస్తాయి. ఇప్పుడో స్టార్ క్రికెటర్ పరిస్థితి అలాగే ఉంది. తొలిసారి తండ్రయ్యాడో ఫాస్ట్ బౌలర్. అతడికి పండంటి మగబిడ్డ పుట్టాడు. అయినా అతడు సెలబ్రేట్ చేసుకునే పరిస్థితుల్లో లేడు. ఎవరా ప్లేయర్? అతడు ఎందుకు సెలబ్రేట్ చేసుకోవడం లేదనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పాకిస్థాన్ టాప్ పేసర్ షాహిన్ అఫ్రిదీ మొదటిసారి తండ్రి అయ్యాడు. షాహిన్-అన్షా దంపతులకు మగబిడ్డ పుట్టాడు. అతడికి అలీ యార్ అనే పేరు పెట్టారు. అయితే బిడ్డ పుట్టిన సంతోషం ఉన్నా పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు షాహిన్. ఎందుకంటే బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. ఏకంగా 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓటమిపాలైంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 448 పరుగులు చేసింది పాక్. ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన బంగ్లా 565 రన్స్ చేసింది. అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన పాకిస్థాన్ 146 పరుగులకే కుప్పకూలింది. 30 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించింది బంగ్లా. ఈ ఓటమితో పాక్ ప్లేయర్లంతా నిరాశలో కూరుకుపోయారు. షాహిన్ కూడా బిడ్డ పుట్టినా ఓటమి బాధతో పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు.
ఫస్ట్ టెస్ట్‌లో ఓటమితో పాకిస్థాన్‌పై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. అందరు ఆటగాళ్లతో పాటు షాహిన్‌ను కూడా టార్గెట్ చేసుకొని ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు, ఎక్స్పర్ట్స్ విమర్శలు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో 32 ఓవర్లు వేసిన ఈ స్టార్ పేసర్ 96 పరుగులు ఇచ్చి 2 వికెట్లు మాత్రమే తీశాడు. దీంతో టీమ్ వైఫల్యానికి అతడు కూడా కారణమేనని అంటున్నారు. పాక్ జట్టును ప్రక్షాళన చేయాల్సిందేనని లేకపోతే మరిన్ని అవమానకర ఓటములు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంత చెత్తాటనా? సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతుల్లో ఓడటం ఏంటని అక్కడి ఫ్యాన్స్ నిలదీస్తున్నారు. చేతగాకపోతే టీమ్‌లో నుంచి బయటకు వెళ్లండి.. ప్రతిభ కలిగిన యువకులు జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్నారని అంటున్నారు. ఇలా అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండటం, ఓటమి బాధతో షాహిన్ సెలబ్రేషన్స్‌కు దూరంగా ఉండిపోయాడని తెలస్తోంది. మరి.. బంగ్లా చేతుల్లో చిత్తయిన పాక్ కమ్‌బ్యాక్ ఇస్తుందా? లేదా సిరీస్‌లో వైట్‌వాష్ అవుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Shaheen Shah Afridi & his wife Ansha Afridi are blessed with a baby boy ❤️
Welcome, Aliyaar 👶. Congratulations to the couple! #ShaheenShahAfridi #AnshaAfridi #CricketTwitter pic.twitter.com/KfTheUHcgL
— InsideSport (@InsideSportIND) August 26, 2024