iDreamPost

PAK vs USA: బాబర్ ను అమెరికా కావాలనే ఔట్ చేయలేదా? ఇది కదా మాస్టర్ ప్లాన్..

పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అమెరికా టీమ్ మాస్టర్ ప్లాన్ తో విజయం సాధించిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ను కావాలనే అవుట్ చేయలేదని కొందరు వాదిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అమెరికా టీమ్ మాస్టర్ ప్లాన్ తో విజయం సాధించిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ను కావాలనే అవుట్ చేయలేదని కొందరు వాదిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

PAK vs USA: బాబర్ ను అమెరికా కావాలనే ఔట్ చేయలేదా? ఇది కదా మాస్టర్ ప్లాన్..

టీ20 వరల్డ్ కప్ 2024లో గుర్తుంచుకునే మ్యాచ్ ఏదైనా ఉందంటే అది.. పాకిస్తాన్ వర్సెస్ అమెరికా మ్యాచే. ఉప్పు, కారం లేని కూరలాగా చప్పగా సాగుతున్న టోర్నీకి పాక్-యూఎస్ఏ మ్యాచ్ ఊపు తెచ్చిందనే చెప్పాలి. అందరూ ఊహించినట్లుగానే పొట్టి వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ లోనే అమెరికా చేతిలో దారుణంగా ఓడిపోయి విమర్శలపాలైంది పాక్. సూపర్ ఓవర్ లో పాక్ ను చిత్తుగా ఓడించి.. చరిత్ర సృష్టించింది యూఎస్ఏ. ఇక ఈ మ్యాచ్ లో అమెరికా మాస్టర్ ప్లాన్ తో బాబర్ ను అవుట్ చేయకుండా.. విజయం సాధించిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్2024లో సంచలనం నమోదు అయ్యింది. ఇప్పుడిప్పుడే క్రికెట్ లో ఓనమాలు నేర్చుకుంటున్న అమెరికా చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది పాకిస్తాన్. సూపర్ ఓవర్ కు దారితీసిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. జట్టులో 44 రన్స్ చేసిన కెప్టెన్ బాబర్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. అనంతరం అమెరికా సైతం 3 వికెట్లు కోల్పోయి సరిగ్గా 159 రన్సే చేసింది. దాంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీసింది. ఇక సూపర్ ఓవర్లో యూఎస్ఏ 18 రన్స్ చేయగా.. పాక్ 13 పరుగులకే పరితం అయ్యి.. ఓడిపోయింది.

అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోవడానికి ప్రధాన కారణం పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ అని విమర్శిస్తున్నారు నెటిజన్లు. ఎందుకంటే? ఈ మ్యాచ్ లో బాబర్ 43 బంతుల్లో 44 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. 26 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన దశలో అతి జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాడు. దాంతో స్కోర్ బోర్డ్ నెమ్మదించింది. దాంతో జట్టు స్కోర్ నెమ్మెదించింది. అయితే ఇక్కడ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని ఎత్తిచూపుతున్నారు నెటిజన్లు. అమెరికా కావాలనే బాబర్ అజామ్ అవుట్ చేయలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా.. చాలా స్లో గా ఆడుతున్న బాబర్ అవుట్ అయితే.. తర్వాత స్కోర్ వేగం పెరుగుతుందని భావించిన అమెరికా అతడిని పెవిలియన్ చేర్చలేదట.  అందుకే బాబర్ ను ఆలస్యంగా ఔట్ చేశారని వారు వాదిస్తున్నారు. ఇది తెలిసిన కొందరు నెటిజన్లు వాట్ ఏ థాట్.. వాట్ ఏ విజన్ అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఓపెనర్ గా బరిలోకి దిగిన బాబర్ అజామ్.. 43 బంతుల్లో 44 రన్స్ చేసి 16వ ఓవర్ ఐదవ బంతికి పెవిలియన్ చేరాడు. మరి బాబర్ ను అమెరికా టీమ్ కావాలనే అవుట్ చేయలేదన్న వాదనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి