డూ ఆర్‌ డై మ్యాచ్‌లో పాక్‌ ఓటమి! బాబర్‌ అజమ్‌ కన్నీళ్లు?

ఇండియాతో ఫైనల్‌ ఆడాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌.. టీమ్‌ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. పైగా ప్రస్తుతం వాళ్లే వరల్డ్‌ నంబర్‌ వన్‌ వన్డే టీమ్‌.. అయినా కూడా డూ ఆర్‌ డై మ్యాచ్‌లో పాకిస్థాన్‌ చివరి క్షణంలో చేతులెత్తేసింది. దీంతో వరల్డ్‌ కప్‌కు ముందు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్‌ 2023 ఫైనల్స్‌ మిస్‌ అయిన బాధలో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ దాదాపు కన్నీళ్లు పెట్టుకున్నంత పనిచేశాడు. ఉబికివస్తున్న బాధను లోలోపల అణుచుకుంటూ.. కన్నీళ్లు ఆపుకున్నాడు. ప్రస్తుతం బాబర్‌ బాధపడుతున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఎంతో కీలకమైన మ్యాచ్‌లో శ్రీలంక అద్భుతంగా ఆడి.. పాక్‌ను ఓడించింది. ఈ విజయంతో ఆదివారం ఇండియాతో ఫైనల్‌లో తలపడేందుకు సిద్ధమైంది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత పాకిస్థాన్‌ బ్యాటింగ్‌ చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభం కావడంతో మ్యాచ్‌ను 45 ఓవర్లకు కుదించారు. పాక్‌ ఇన్నింగ్స్‌లో మళ్లీ వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 42 ఓవర్లకు కుదించారు. ఆ ఓవర్లు పూర్తి అయ్యేసరికి పాక్‌.. 7 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. రిజ్వాన్‌(82), ఇఫ్తికార్‌(47) పరుగులతో రాణించారు.

పాక్‌ 252 పరుగులు చేసినా.. డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం శ్రీలంకకు సైతం 252 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించారు. ఈ టార్గెట్‌ను ఛేదించేందుకు లంక ఆరంభంలో తడబడింది. ఓపెనర్లు విఫలమైనా.. కుశాల్‌ మెండిస్‌(92) అద్భుతంగా రాణించడం.. సదీర్ సమరవిక్రమ(48), చరిత్ అసలంక (49 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడటంతో శ్రీలంక విజయం సాధించింది. ముఖ్యంగా చరిత్‌ అసలంక జట్టును విజయతీరాలకు చేర్చాడు. 42 ఓవర్లలో శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి సరిగ్గా 253 పరుగులు చేసింది. విజయ లక్ష్యం 252 పరుగులు నిర్దేశించినా.. చివరి బాల్‌కు 2 పరుగులు చేయాల్సి ఉండగా.. 3 పరుగులు చేసి విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్‌ ఫలితంతో పాటు బాబర్‌ అజమ్‌ ఎమోషనల్‌ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రెండు జట్లు సేమ్‌ ఓవర్స్‌లో సేమ్‌ స్కోర్‌ చేసినా.. లంక ఎలా గెలిచింది?

Show comments