iDreamPost
android-app
ios-app

VIDEO: ఇలాంటి విన్యాసాలు పాకిస్థాన్‌కే సాధ్యం! నవ్వకండి ప్లీజ్‌..

  • Published Sep 10, 2023 | 4:51 PM Updated Updated Sep 10, 2023 | 4:51 PM
  • Published Sep 10, 2023 | 4:51 PMUpdated Sep 10, 2023 | 4:51 PM
VIDEO: ఇలాంటి విన్యాసాలు పాకిస్థాన్‌కే సాధ్యం! నవ్వకండి ప్లీజ్‌..

ఆసియా కప్‌ 2023లో భాగంగా సూపర్‌ 4 తొలి మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు దుమ్మురేపుతున్నారు. పాక్‌ బౌలర్లు ఊతికి ఆరేశారు. బౌలింగ్‌కి వచ్చిన ప్రతి బౌలర్‌ను టీమిండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ-శుబ్‌మన్‌ గిల్‌ టార్గెట్‌ చేసి మరీ కొట్టారు. ముందుగా గిల్‌.. అఫ్రదీని టార్గెట్‌ చేసి రెండు ఓవర్లలో 25 రన్స్‌ కొట్టగా.. రోహిత్‌ వర్మ షాదాబాను దారుణంగా టార్గెట్‌ చేశాడు. రెండు వరుస సిక్సర్లు, ఒక ఫోర్‌తో ఆ ఓవర్‌లో మొత్తం 19 పరుగులు పిండుకున్నాడు. ఇలా ఇద్దరు ఓపెనర్లు చెలరేగడంతో టీమిండియా స్కోర్‌ బోర్డు పరుగులు పెట్టింది.

అయితే.. టీమిండియా ఓపెనర్ల దూకుడుకి పాకిస్థాన్‌ ఫీల్డింగ్‌ కూడా కాస్త తోడైయింది. ముఖ్యంగా ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌లో అయితే.. పాక్‌ ఫీల్డింగ్‌ అందరికీ నవ్వు తెప్పించేలా ఉంది. నసీమ్‌ షా వేసిన ఆ ఓవర్‌ మూడో బంతిని శుబ్‌మన్‌ గిల్‌ కవర్స్‌లోకి ఆడే ప్రయత్నంలో బాల్‌ ఎడ్జ్‌ తీసుకుని కీపర్‌ పక్కగా వెళ్లింది. ఆ టైమ్‌లో స్లిప్‌లో ఇద్దరు ఫీల్డర్లు ఉండటంతో గిల్‌ పెవిలియన్‌ చేరినట్లే అనుకున్నారు. నిజానికి గిల్‌ అక్కడే అవుట్‌ కూడా అవ్వాల్సింది. కానీ.. పాకిస్థాన్‌ చెత్త ఫీల్డింగ్‌తో గిల్‌ బతికిపోయాడు. ఇద్దరు స్లిప్‌ ఫీల్డర్ల మధ్య నుంచి బాల్‌ బౌండరీ దూసుకెళ్లింది. బాల్‌ను క్యాచ్‌ పట్టుకోకుండా ఇద్దరు స్లిప్‌ ఫీల్డర్లు బాల్‌ వెళ్తుంటే.. అలా చూస్తూ నిల్చుండిపోయారు.

ఇలాంటి చెత్త ఫీల్డింగ్‌తో గతంలో కూడా పాకిస్థాన్‌ నవ్వులపాలైంది. వెస్టిండీస్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో క్రిస్‌ గేల్‌ గాల్లో ఆడిన బాల్‌ను సింపుల్‌ క్యాచ్‌ అందుకోవాల్సిన చోట.. సయీద్‌ అజ్మల్‌, సోయబ్‌ మాలిక్‌ కలిసి చాలా ఫన్నీగా నేలపాలు చేశారు. ఇప్పుడు ఆ క్యాచ్‌ డ్రాప్‌తో ఇప్పుడు వికెట్‌ కీపర్‌ రిజ్వాన్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌, ఇమామ్‌ ఉల్‌ హక్‌ కలిసి వదిలేసిన క్యాచ్‌తో కంప్యార్‌ చేస్తూ.. సోషల్‌ మీడియా వేదికగా పాక్‌ పరువుతీసి పారేస్తున్నారు. ‘ఇలాంటి ఫీల్డింగ్‌ విన్యాసాలు వీళ్లకే సాధ్యం.. పాకిస్థానోళ్లు అంటార్రా బాబు’ అంటూ సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: అఫ్రిదీని టార్గెట్‌ చేసిన టీమిండియా ఓపెనర్లు! చెప్పి మరీ..