రోహిత్ శర్మ విరాట్‌ కోహ్లీ బుమ్రా లేకుంటే.. ఇండియాను ఓడిస్తాం: తన్వీర్‌ అహ్మద్‌

రోహిత్ శర్మ విరాట్‌ కోహ్లీ బుమ్రా లేకుంటే.. ఇండియాను ఓడిస్తాం: తన్వీర్‌ అహ్మద్‌

Tanvir Ahmed, IND vs PAK, Rohit Sharma, Virat Kohli: పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌.. టీమిండియాపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. రోహిత్‌, కోహ్లీతో పాటు ఆ క్రికెటర్‌ లేకుండా టీమిండియా ఆడితే చిత్తుగా ఓడిస్తామన్నాడు. అతనెవరో? ఎందుకలా అన్నాడో ఇప్పుడు చూద్దాం..

Tanvir Ahmed, IND vs PAK, Rohit Sharma, Virat Kohli: పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌.. టీమిండియాపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. రోహిత్‌, కోహ్లీతో పాటు ఆ క్రికెటర్‌ లేకుండా టీమిండియా ఆడితే చిత్తుగా ఓడిస్తామన్నాడు. అతనెవరో? ఎందుకలా అన్నాడో ఇప్పుడు చూద్దాం..

ఆట తక్కువ మాటలెక్కువ అంటే అది పాకిస్థాన్‌ క్రికెటర్లే. వాళ్ల విజయం కంటే.. టీమిండియా ఓటమినే ఎక్కువ సెలబ్రేట్‌ చేసుకునే అల్ప సంతోషులు పాపం. తాజాగా టీమిండియా శ్రీలంకపై మూడు వన్డేల సిరీస్‌ ఓడిపోవడంతో.. కొంతమంది పాకిస్థాన్‌ క్రికెట్‌ అభిమానులు, మాజీ క్రికెటర్లు తెగ సంబరపడి పోతున్నారు. ఓ పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ అయితే.. ఒక అడుగుముందుకేసి.. ముందు మీ ప్రదర్శన చూసుకోండి తర్వాత పాకిస్థాన్‌ గురించి మాట్లాడండి అంటూ కాస్త ఘాటు విమర్శలే చేశాడు. ఇప్పుడు పాకిస్థాన్‌ క్రికెట్‌ గురించి ఇండియాలో ఎవరు పట్టింకుంటున్నారు? మీ గురించి మాట్లాడేందుకు అంటూ భారత క్రికెట్‌ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు.

ఇంతకీ.. శ్రీలంకపై టీమిండియా సిరీస్‌ ఓటమిని ఆసరాగా చేసుకుని వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ ఎవరంటే.. మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ తన్వీర్‌ అహ్మద్‌. ఆట నుంచి దూరమైనా.. ఇలాంటి అనవసరపు కామెంట్స్‌తో వార్తల్లో నిలుస్తున్నాడు. పైగా.. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, జస్ప్రీత్‌ బుమ్రా.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఆడకుంటే.. వాళ్లు లేని టీమిండియాను పాకిస్థాన్‌ చిత్తుగా ఓడిస్తుందంటూ భారత యువ క్రికెటర్లను అవమానిస్తూ మాట్లాడాడు. ఒక వేళ వాళ్లు ముగ్గురు ఆడితే.. టీమిండియా ముందు పాకిస్థాన్‌ నిలవలేదని పరోక్షంగా తన కామెంట్స్‌ ఒప్పుకున్నాడు.

అయితే.. వచ్చే ఏడాది పాకిస్థాన్‌ వేదికగా ప్రతిష్టాత్మక ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 జరగనుంది. ఈ టోర్నీ కోసం టీమిండియా పాకిస్థాన్‌కు వెళ్తుందా? లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. బహుషా వెళ్లకపోవచ్చు. టీమిండియా ఆడే మ్యాచ్‌లను పాక్‌లో కాకుండా.. యూఏఈ లేదా శ్రీలంకలో నిర్వహించాలని ఇప్పటికే బీసీసీఐ, ఐసీసీని కోరింది. కానీ, పాక్‌ క్రికెట్‌ అభిమానులు టీమిండియా తన దేశానికి రావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన్వీర్‌ అహ్మద్‌ చీప్‌ కామెంట్స్‌తో హైలెట్‌ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. మరి అతను చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments