iDreamPost
android-app
ios-app

Pakistan: నవ్వుల పాలవుతున్న పాకిస్థాన్‌ ఫీల్డింగ్‌! ఇది కొత్తేం కాదంటూ..

  • Published Dec 14, 2023 | 1:57 PM Updated Updated Dec 18, 2023 | 1:02 PM

క్రికెట్‌లో చెత్త ఫీల్డింగ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ లాంటి పాకిస్థాన్‌ జట్టు మరోసారి తమకు మాత్రమే సాధ్యమైన టాలెంట్‌ను బయటపెట్టింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో పాక్‌ ఫీల్డింగ్‌ విన్యాసాలు నవ్వు తెప్పిస్తున్నాయి.

క్రికెట్‌లో చెత్త ఫీల్డింగ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ లాంటి పాకిస్థాన్‌ జట్టు మరోసారి తమకు మాత్రమే సాధ్యమైన టాలెంట్‌ను బయటపెట్టింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో పాక్‌ ఫీల్డింగ్‌ విన్యాసాలు నవ్వు తెప్పిస్తున్నాయి.

  • Published Dec 14, 2023 | 1:57 PMUpdated Dec 18, 2023 | 1:02 PM
Pakistan: నవ్వుల పాలవుతున్న పాకిస్థాన్‌ ఫీల్డింగ్‌! ఇది కొత్తేం కాదంటూ..

క్రికెట్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌ ఎంత ముఖ్యమో.. ఫీల్డింగ్‌ కూడా అంతే ఇంపార్టెంట్‌. మంచి ఫీల్డింగ్‌తో మ్యాచ్‌ల స్వరూపమే మారిపోతుంది. క్యాచెస్‌ మిన్స్‌ మ్యాచెస్‌ అని కూడా అంటూ ఉంటారు. అందుకే మ్యాచ్‌లు గెలవాలంటే ఫీల్డింగ్‌ ఎంతో కీలకం. అయితే.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఫీల్డింగ్‌ గురించి మాట్లాడుకుంటే.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇండియా జట్లు గురించి మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఆ జట్టు ఫీల్డింగ్‌ను ఎంతో మెరుగ్గా చేస్తాయి. ఆ జట్లలో మెరికల్లాంటి ఫీల్డర్లు ఉంటారు. పెద్ద జట్లుగా చెలామణి అయ్యేందుకు ఫీల్డింగ్‌ వారికి అదనపు అర్హత. అలాగే చెత్త ఫీల్డింగ్‌ అనగానే అందరికీ గుర్తొంచేది మాత్రం ఒక్కటే జట్టు. అదే పాకిస్థాన్‌.

చెత్త ఫీల్డింగ్‌తో పాకిస్థాన్‌ టీమ్‌ కొన్ని తరాలుగా నవ్వులపాలవుతూ వస్తున్నారు. ఒకే క్యాచ్‌ ​కోసం ఇద్దరు ఫీల్డర్లు పరిగెత్తి.. ఇద్దరు క్యాచ్‌ వదిలేసి, ఒకరి ముఖం ఒకళ్లు చూసుకోవడం లాంటి మోస్ట్‌ ఫన్నీ థింగ్స్‌ పాకిస్థాన్‌ జట్టుకే సాధ్యం. అది ఏదో ఒక్కసారి జరిగింది అనుకుంటే పొరపాటే.. ఇంతకంటే చెత్త ఫీల్డింగ్‌ చేయలేరు అన్న ప్రతిసారీ.. అంతకంటే దారుణమైన ఫీల్డింగ్‌ చేస్తూ.. చెత్త ఫీల్డింగ్‌కు తామే బ్రాండ్‌ అంబాసిడర్స్‌లా ఆడుతుంటారు. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో కూడా పాకిస్థాన్‌ ఆటగాళ్లు తమ చెత్త ఫీల్డింగ్‌తో మరోసారి టాక్‌ ఆఫ్‌ ది ఫన్నీ క్రికెట్‌ వరల్డ్‌గా మారిపోయారు. ఆస్ట్రేలియాలోని పెర్త్‌ వేదికగా పాకిస్థాన్‌-ఆసీస్‌ మధ్య తొలి టెస్ట్‌ మొదలైంది. తొలి రోజు ఆటలో పాకిస్థాన్‌ బౌలర్లపై ఆస్ట్రేలియా డామినేట్‌ చేస్తోంది. ముఖ్యంగా ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అయితే పాక్‌ బౌలర్లను చీల్చి చెండాడుతున్నాడు. ఇన్నింగ్స్‌ ఆరంభంలో అయితే.. మరీ టీ20 స్టైల్లో బ్యాటింగ్‌ చేసి పాక్‌ బౌలర్లను బెంబేలెత్తించాడు. ప్రస్తుతం సెంచరీ బాదేసి.. అదే ఊపులో దూసుకెళ్తున్నాడు.

pakistan mis fielding

అయితే.. పాక్‌ బౌలర్‌ అఘా సల్మాన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 48వ ఓవర్‌లో వార్నర్‌, పాకిస్థాన్‌కు ఓ గోల్డెన్‌ ఛాన్స్‌ ఇచ్చాడు. అప్పటికే సెంచరీ పూర్తి చేసుకుని మరింత డేంజరస్‌గా మారిన వార్నర్‌.. సల్మాన్‌ వేసిన మూడో బంతిని మిడ్‌ఆన్‌ పై నుంచి ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ, బాల్‌ సరిగా టైమ్‌ కాకపోవడంతో బాల్‌ నేరుగా ఫీల్డర్‌ ఖుర్రమ్‌ షాహజాద్‌ చేతుల్లోకి వెళ్లింది. ఇక్కడితో వార్నర్‌ దండయాత్రకు బ్రేక్‌ పడినట్లే అని అంతా భావించారు. కానీ, ఇక్కడే పాకిస్థాన్‌ ఫీల్డర్‌ షాహజాద్‌ తమ వారసత్వం కొనసాగించాడు. చేతుల్లో పడిన సులవైన క్యాచ్‌ను నేలపాలు చేసి.. వార్నర్‌కు లైఫ్‌ ఇచ్చాడు. ఆ మిస్‌ అయిన క్యాచ్‌ ఫోర్‌ వెళ్లడం విశేషం. ఇలా చెత్త ఫీల్డింగ్‌కు పెట్టింది పేరైన పాకిస్థాన్‌ మరోసారి ఆ పేరును సార్థకం చేసుకుందని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.