Somesekhar
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ లో పాక్ స్టార్ బౌలర్ హసన్ అలీ బౌండరీ లైన్ దగ్గర ప్రేక్షకులతో కలిసి చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ లో పాక్ స్టార్ బౌలర్ హసన్ అలీ బౌండరీ లైన్ దగ్గర ప్రేక్షకులతో కలిసి చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Somesekhar
క్రికెట్ లో ఎప్పుడూ గొడవలే కాదు.. అప్పుడప్పుడు ఫన్నీ మూమెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సన్నివేశాలు కొన్ని గ్యాలరీలోని ప్రేక్షకులు చేస్తే.. మరికొన్ని గ్రౌండ్ లో ఆటగాళ్లు చేస్తారు. ఇక ఇంకొన్ని అటు ప్రేక్షకులు, ఇటు ప్లేయర్లు కలిసిచేస్తుంటారు. తాజాగా ఇలాంటి ఫన్నీ డ్యాన్స్ మూమెంటే బాక్సింగ్ డే టెస్ట్ లో జరిగింది. మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో పాక్ స్టార్ బౌలర్ హసన్ అలీ బౌండరీ లైన్ దగ్గర ప్రేక్షకులతో కలిసి చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మెల్బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్ట్ లో పాక్-ఆసీస్ జట్లు తలపడుతున్నాయి. మూడో రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా టీమ్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఓ ఫన్నీ మూమెంట్ చోటుచేసుకుంది. అదేంటంటే? స్టీవ్ స్మిత్, అలెక్స్ కేరీ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో పాకిస్తాన్ స్టార్ బౌలర్ హసన్ అలీ ప్రేక్షకులతో కలిసి బౌండరీ లైన్ దగ్గర డ్యాన్స్ చేశాడు. ఎంతో సరదాగా అతడు మ్యూజిక్ కు తగ్గట్లుగా డ్యాన్స్ చేశాడు. అతడిని అనుకరిస్తూ.. ప్రేక్షకులు సైతం డ్యాన్స్ చేశారు. దీంతో స్టేడియం మెుత్తం ఒక్కసారిగా హోరెత్తింది. ప్రస్తుతం హసన్ అలీ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దీంతో నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. మీలాంటి ఎంటర్ టైనర్లు కావాలి అని కొందరు అంటే.. మరికొందరు ప్రేక్షకులను దగ్గర చేసుకోవడానికి ఇది సరైన మార్గం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. అలీ ఇలా గ్రౌండ్ లో డ్యాన్స్ చేయడం ఇదే మెుదటిసారి కాదు. గతంలోనూ ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో మైదానంలో డ్యాన్స్ చేసి ప్రేక్షకులను అలరించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 318 పరుగులు చేసింది. ఇక పాక్ తొలి ఇన్నింగ్స్ లో 264 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మూడో రోజు ఆటముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసింది. దీంతో కంగారూ టీమ్ కు 241 రన్స్ ఆధిక్యం లభించింది.