SNP
Mitchell Starc, MI vs KKR, IPL 2024: ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ సెలబ్రేషన్స్ హైలెట్‌గా నిలిచాయి. అయితే.. ఆ సంతోషం వెనుకున్న బాధ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Mitchell Starc, MI vs KKR, IPL 2024: ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ సెలబ్రేషన్స్ హైలెట్‌గా నిలిచాయి. అయితే.. ఆ సంతోషం వెనుకున్న బాధ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 24 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంలో ఆ జట్టు స్టార్ బౌలర్, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బౌలర్ మిచెల్ స్టార్క్ కీలక పాత్ర పోషించాడు. ఏకంగా 4 వికెట్లతో చెలరేగి.. ముంబై ఇండియన్స్‌ను వాళ్ల సొంతగడ్డపైనే వాళ్లను ఓడించి.. తన పవరేంటో చూపించాడు. అయితే.. ఐపీఎల్ సగానికి పైగా పూర్తి అయిపోయిన తర్వాత.. స్టార్క్ తన స్టామినా ఏంటో, తాను ఏం చేయగలడో చూపించాడు. ముంబైపై తన పదునైన యార్కర్లు వేస్తూ వికెట్లను గాల్లో గింగిరాలు కొట్టించాడు. అయితే.. చాలా కాలం తర్వాత మిచెల్ స్టార్క్ వికెట్ తీసి.. చాలా కసిగా సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే.. అతని సెలబ్రేషన్స్ వెనుక చాలా బాధ ఉన్న విషయం ఎవరికీ తెలియదు. ఆ బాధ నుంచి వచ్చిన కసిని.. స్టార్క్ తన సెలబ్రేషన్‌లో చూపించాడు. అసలు స్టార్క్ సెలబ్రేషన్ వెనకున్న బాధ ఏంటో వివరంగా తెలుసుకుందాం..
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ ధర పలికిన ఆటగాడు మిచెల్ స్టార్క్. ఐపీఎల్ 2024 కోసం.. 2023 ఏడాది చివర్లో జరిగిన ఐపీఎల్ వేలంలో స్టార్క్‌ను కోల్‌కత్తా నైట్ రైడర్స్ ఏకంగా 24.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. స్టార్క్‌కు దక్కిన ఈ ధర చూసి.. క్రికెట్ లోకం నివ్వెరపోయింది. ఆస్ట్రేలియా టాప్ బౌలర్, చెలరేగితే.. మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించేయగల సత్తా ఉన్న బౌలర్ కావడంతో.. కాస్త ధర ఎక్కువైనా పెట్టొచ్చులే అని క్రికెట్ అభిమానులు కూడా భావించారు. కానీ, గ్రౌండ్‌లోకి దిగిన తర్వాత సీన్ వేరేలా ఉంది. స్టార్క్ దారుణంగా తేలిపోయాడు. ఒక అనామక బౌలర్ పరుగులు సమర్పించుకున్నట్లు భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. వికెట్లు తీయకపోగా.. భారీ రన్స్ ఇస్తూ.. జట్టుకు భారంగా మారాడు.
24.75 కోట్లు పెట్టి కొన్న ప్లేయర్‌ను.. గాయం నెపంతో పక్కనపెట్టారు అంటే స్టార్క్ ఏ రేంజ్‌లో టీమ్‌కు భారంగా మారాడో అర్థం చేసుకోవచ్చు. చెత్త ప్రదర్శనతో స్టార్క్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అంత డబ్బు తీసుకుంటూ.. ఇంత చెత్త బౌలింగ్ చేస్తున్నాడంటూ.. క్రికెట్ అభిమానులు విమర్శలు గుప్పించారు. తనపై వస్తున్న విమర్శలను మౌనంగా భరిస్తున్న స్టార్క్.. తాజాగా ముంబైపై చెలరేగిపోయాడు. ఇన్ని రోజులు తనపై వచ్చిన విమర్శలకు తన ప్రదర్శనతోనే సమాధానం చెప్పాడు. 9 మ్యాచ్‌ల్లో కేవలం 7 వికెట్లు తీసిన స్టార్క్.. నిన్న ఒక్క మ్యాచ్‌లోనే 4 వికెట్లు పడగొట్టాడు. అవి కూడా ఎంతో కీలకమైన వికెట్లు. అందుకే.. ఇన్ని రోజుల తాను పడ్డ బాధను ఈ సెలబ్రేషన్స్‌తో తీర్చుకున్నాడు స్టార్క్. మరి ముంబైపై స్టార్క్ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
It’s 4:33 AM and we’re still here 💜pic.twitter.com/ZjsV8MzA8W
— KolkataKnightRiders (@KKRiders) May 3, 2024