iDreamPost
android-app
ios-app

వీడియో: స్టేడియం బయటికి బంతి.. గల్లీ క్రికెట్‌ను తలపించే సీన్‌! చూసి నవ్వుకోండి..

  • Published Jul 30, 2024 | 11:03 AM Updated Updated Jul 30, 2024 | 11:03 AM

TNPL 2024, CSG vs SMP: అచ్చం గల్లీ క్రికెట్‌లో జరిగే ఓ సీన్‌.. తాజాగా ప్రొఫెషనల్‌ క్రికెట్‌ లీగ్‌లో కూడా జరిగింది. ఈ మోస్ట్‌ ఫన్నీ సీన్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

TNPL 2024, CSG vs SMP: అచ్చం గల్లీ క్రికెట్‌లో జరిగే ఓ సీన్‌.. తాజాగా ప్రొఫెషనల్‌ క్రికెట్‌ లీగ్‌లో కూడా జరిగింది. ఈ మోస్ట్‌ ఫన్నీ సీన్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published Jul 30, 2024 | 11:03 AMUpdated Jul 30, 2024 | 11:03 AM
వీడియో: స్టేడియం బయటికి బంతి.. గల్లీ క్రికెట్‌ను తలపించే సీన్‌! చూసి నవ్వుకోండి..

సాధారణంగా ఇలాంటి సీన్స్‌ గల్లీ క్రికెట్‌లో చూసి ఉంటాం. క్రికెట్‌ ఆడుకునేందుకు సరైన గ్రౌండ్‌లేని చోటా. లేదా త​క్కువ మంది ప్లేయర్లు ఉండి.. సరదాగా గల్లీలోనూ, లేదా ఇంటి ముందు రోడ్డుపైనో.. చిన్న స్థలంలోనూ క్రికెట్‌ ఆడుతుంటారు. జనరల్‌ క్రికెట్‌లో ఉండే రూల్స్‌ కంటే.. ఈ గల్లీ క్రికెట్‌లో కొన్ని రూల్స్‌ అదనంగా ఉంటాయి. అవేంటంటే.. ఆ ఇంట్లోకి బాల్‌ కొట్టొద్దు, అలా ఎవరైన కొడితే అవుట్‌, బాల్‌ వాడే తేవాలి. ఎందుకంటే.. ఆ ఇంట్లో బాల్‌ పడితే వాళ్లు ఇవ్వరు. అందుకే ఇలాంటి రూల్స్‌ ఉంటాయి గల్లీ క్రికెట్‌లో. అయినా కూడా ఎవరో ఒకరు బాల్‌ అందులోకి కొట్టడం, ఆ ఇంటి ఓనర్‌ బాల్‌ తీసుకొని ఇవ్వకపోగా.. తిట్లు, అరుపులు ఎక్స్‌ట్రా. ఇలాంటి సీన్‌ ఇప్పుడు ఓ ప్రొఫెషన్‌ లీగ్‌లో కూడా జరిగింది.

మినీ ఐపీఎల్‌గా పేరు తెచ్చుకున్న తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ 2024లో సేమ్‌ గల్లీ క్రికెట్‌ను తలపించే ఒక సీన్‌ చోటు చేసుకుంది. బ్యాటర్‌ కొట్టిన షాట్‌కు.. బాల్‌ ఏకంగా స్టేడియం బయటికి వెళ్లిపడింది. అయితే.. ఆ బాల్‌ ఓ వ్యక్తి పొలంలో పడింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆ స్థలం ఓనర్‌.. బాల్‌ తీసుకొని.. నేను ఇవ్వను, ఎందుక మా స్థలంలో బాల్‌ పడేలా కొట్టారు అంటూ అరుస్తూ.. బాల్‌ తీసుకొని వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలను కెమెరా మెన్‌ బాగా జూమ్‌ చేసి రికార్డ్‌ చేశాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ సీన్‌ చూసి.. చాలా మంది నెటిజన్లు అరె సేమ్‌ మన గల్లీ క్రికెట్‌లో జరిగినట్లే జరిగిందే అంటూ నవ్వుకుంటున్నారు.

తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ 2024లో భాగంగా ఆదివారం చెపాక్ సూపర్ గిల్లీస్, సీచెమ్ మదురై పాంథర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లోనే ఈ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. చెపాక్ సూపర్ గిల్లీస్ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో.. సీచెమ్ మదురై పాంథర్స్ బౌలర్‌ మురగన్‌ అశ్విన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌ నాలుగో బంతికి చెపాక్ సూపర్ గిల్లీస్ బ్యాటర్‌ ప్రదోష్‌ పాల్‌ భారీ సిక్స్‌ కొట్టాడు. అది డీప్‌ మిడ్‌ వికెట్‌ పై నుంచి ఏకంగా స్టేడియం బయటికి వెళ్లి పడింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి బాల్‌ తీసుకొని.. ఏదో చెబుతూ.. బాల్‌ ఇవ్వకుండా వెళ్లి నులక మంచంలో కూర్చోని మరో వ్యక్తిగా సరదాగా కబుర్లు చెప్తున్నాడు. ఈ దృశ్యాలను కెమెరామెన్‌ రికార్డ్‌ చేయడంతో స్టేడియంలో ఉన్న వాళ్లు కూడా సరదాగా నవ్వుకున్నారు. ఇక చేసేదేం లేక అంపైర్లు కొత్త బాల్‌ను తెప్పించారు. మరి ఈ ఫన్నీ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.