Mohammed Siraj: క్రికెటర్‌ సిరాజ్‌కు HYD కాస్ట్లీ ఏరియాలో కోట్లు విలువచేసే స్థలం కేటాయింపు! జీవో జారీ

క్రికెటర్‌ సిరాజ్‌కు HYD కాస్ట్లీ ఏరియాలో కోట్లు విలువచేసే స్థలం కేటాయింపు! జీవో జారీ

Mohammed Siraj: టీమ్ ఇండియా దాదాపు 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీ20 ప్రపంచ కప్ గెల్చుకుంది. టీమ్ ఇండియా విశ్వ విజేతగా నిలవడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు క్రీడాభిమానులు. టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ జట్టులో ఒకరైన మహ్మద్ సిరాజ్ తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది.

Mohammed Siraj: టీమ్ ఇండియా దాదాపు 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీ20 ప్రపంచ కప్ గెల్చుకుంది. టీమ్ ఇండియా విశ్వ విజేతగా నిలవడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు క్రీడాభిమానులు. టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ జట్టులో ఒకరైన మహ్మద్ సిరాజ్ తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది.

ఎంతోమంది క్రికెట్‌లో రాణించాలని అహర్శిశలూ కష్టపడతారు. కానీ ఆ అదృష్టం కొందరినే వరిస్తుంది. ఎన్నో అడ్డంకులు దాటుకొని దేశవాళీ క్రికెట్‌లో తన సత్తా చాటుతూ ఐపీఎల్‌లో అడే అవకాశం దక్కించుకున్నాడు హైదరాబాదీ కుర్రోడు మహ్మద్ సిరాజ్. ఆటో నడిపితేనే కానీ ఇళ్లు గడవని స్థితి.. అయినా క్రికెట్ పై అభిమానంతో కొడుకును ప్రోత్సహిస్తూ వచ్చాడు సిరాజ్ తండ్రి.ఒక్కో మెట్టు ఎక్కుతూ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని అధిష్టించాడు సిరాజ్.ఇటీవల టీ20 ప్రపంచ కప్ గెల్చుకుంది టీమ్ ఇండియా. ఈ విజయంలో సిరాజ్ కీలక పాత్ర పోషించాడు.ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం సిరాజ్‌ని ఘనంగా సత్కరించి గొప్ప నజరానా ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..

సుదీర్ఘ విరామం తీసుకొని టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ గెల్చుకొని విశ్వవిజేతగా నిలిచింది టీమ్ ఇండియా. ఈ గెలుపులో హైదరాబాద్ గల్లీ కుర్రోడు మహమ్మద్ సిరార్ తన వంతు పాత్ర పోషించాడు. మెరుపు వేగంతో బాల్ విసురుతూ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించాడు.  ప్రపంచ కప్ ముగిసిన తర్వాత హైదరాబాద్ కి వచ్చిన సిరాజ్ కి ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ కి చేరుకున్న సిరాజ్.. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.  టీమ్ ఇండియా జెర్సీని రేవంత్ రెడ్డికి బహుకరించారు.  సీఎం రేవంత్ రెడ్డి.. సిరాజ్‌ని అభినందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా సిరాజ్ కు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మహ్మద్ సిరాజ్ కి జూబ్లీ హిల్స్‌లో 600 చదరపు గజాల ఇంటి స్థలానికి సంబంధించి ఉత్వర్వులు జారీ చేసింది తెలంగాణ రెవెన్యూశాఖ.  చిన్నప్పటి నుంచి హైదరాబాద్ గల్లీ క్రికెటర్ గా రాణిస్తూ ఇప్పుడు టీమ్ ఇండియాలో గొప్ప స్థానం సంపాదించిన సిరాజ్‌కి గొప్ప నజరానా దక్కిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు హైదరాబాద్ లో కాస్ట్లీ ఏరియాలో కోట్లు విలువచేసే స్థలం కేటాయించడంపై తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Show comments