iDreamPost

Ishan Kishan: ఇషాన్‌ కిషన్‌ విధ్వంసానికి ఏడాది పూర్తి! ఆ రోజు కోహ్లీ సైతం..

  • Published Dec 10, 2023 | 1:33 PMUpdated Dec 10, 2023 | 1:33 PM

టన్నుల కొద్ది టాలెంట్‌ ఉన్నా.. టీమిండియాలో రెగ్యులర్‌గా ఫిట్‌ అయ్యేందుకు పాపం ఇషాన్‌ కిషన్‌కు చోటు దక్కడం లేదు. కానీ, ఏడాది క్రితం అతను సృష్టించిన విధ్వంసం చూస్తే మాత్రం.. ఎవరినైనా పక్కనపెట్టి అతన్ని ఆడించాలనిపిస్తుంది. ఆ విధ్వంసం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

టన్నుల కొద్ది టాలెంట్‌ ఉన్నా.. టీమిండియాలో రెగ్యులర్‌గా ఫిట్‌ అయ్యేందుకు పాపం ఇషాన్‌ కిషన్‌కు చోటు దక్కడం లేదు. కానీ, ఏడాది క్రితం అతను సృష్టించిన విధ్వంసం చూస్తే మాత్రం.. ఎవరినైనా పక్కనపెట్టి అతన్ని ఆడించాలనిపిస్తుంది. ఆ విధ్వంసం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Dec 10, 2023 | 1:33 PMUpdated Dec 10, 2023 | 1:33 PM
Ishan Kishan: ఇషాన్‌ కిషన్‌ విధ్వంసానికి ఏడాది పూర్తి! ఆ రోజు కోహ్లీ సైతం..

టీమిండియా యువ క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌ టాలెంట్‌ గురించి అందరికీ తెలిసిందే. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ టీమ్‌లో అలాగే దేశవాళీ క్రికెట్‌లో జార్ఖండ్‌ టీమ్‌ తరఫున మంచి ప్రదర్శన కనబర్చి జాతీయ జట్టులోకి వచ్చాడు. టాలెంట్‌కు ఏ మాత్రం కొదవలేకపోయినా.. టీమిండియాలో టాపార్డర్‌ బలంగా ఉండటంతో ప్లేయింగ్‌ ఎలెవన్‌లో రెగ్యులర్‌గా కనిపించడం లేదు. వన్డే వరల్డ్‌ కప్‌ 2023 టీమ్‌లో ఉన్నా.. ఇషాన్‌కు ఆడే అవకాశం రాలేదు. ఆ వెంటనే ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో ఇషాన్‌ అద్భుతంగా రాణించాడు. అయితే.. సరిగ్గా ఏడాది క్రితం అతను సృష్టించిన విధ్వంసం ఇంకా క్రికెట్‌ అభిమానుల కళ్లల్లో అలా మెదులుతూనే ఉంది. ఆ విధ్వంస చోటు చేసుకుని అప్పుడే ఏడాది అయిపోయిందా? అనే అనుమానం కలుగుతోంది. అసలు ఆ రోజు ఇషాన్‌ ఏ విధంగా చెలరేగాడో మరోసారి వివరంగా తెలుసుకుందాం..

2022 డిసెంబర్‌ 10న చట్టోగ్రామ్‌ వేదికగా ఇండియా-బంగ్లాదేశ్‌ మధ్య మూడో వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. కానీ, ఇండియాకు ఆరంభంలోనే షాక్‌ ఇచ్చింది బంగ్లాదేశ్‌. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ను కేవలం 3 పరుగులకే మెహదీ హసన్‌ అవుట్‌ చేశాడు. దీంతో.. టీమిండియా కేవలం 15 పరుగులకే తొలి వికెట్‌ను కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ, వన్‌ డౌన్‌లో వచ్చిన విరాట్‌ కోహ్లీ అండతో యువ క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌ రెచ్చిపోయి ఆడాడు. బంగ్లాదేశ్‌ పిచ్‌లపై బ్యాటింగ్‌ అంత సులువు కాదు. చాలా దేశాలకు బంగ్లాదేశ్‌ పిచ్‌లపై అంత గొప్ప రికార్డు లేదు. ఇండియాకు కూడా బంగ్లాదేశ్‌లో మంచి రికార్డు లేదు. కానీ, ఆ రోజు ఇషాన్‌ కిషన్‌ మాత్రం బంగ్లాదేశ్‌ బౌలర్లను వారి దేశంలో పిచ్చికొట్టుడు కొట్టాడు. అతని బ్యాటింగ్‌ చూస్తుంటే.. ఏదో పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నట్లు కనిపించాడు.

ishan kishan double century

కేవలం 131 బంతుల్లోనే 24 ఫోర్లు, 10 సిక్సులతో 210 పరుగులు చేసి.. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో అత్యంత వేగంగా డబుల్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు ఇషాన్‌ కిషన్‌. ఈ అద్భుత ఘట్టాన్ని మరో ఎండ్‌ నుంచి కింగ్‌ కోహ్లీ చూస్తుండటం ఇషాన్‌కు డబుల్‌ హ్యాపీనెస్‌ ఇచ్చే విషయం. వన్డే క్రికెట్‌లో చాలా తక్కువమంది ఆటగాళ్లు సాధించిన డబుల్‌ సెంచరీని సాధించడంతో పాటు.. క్రికెట్‌లో కింగులాంటోడు కోహ్లీని ఎదురుగా పెట్టుకుని ఆ ఫీటును సాధించడం ఏ ఆటగాడికైనా స్పెషలే. అయితే.. ఇషాన్‌ డబుల్‌ సెంచరీతో పాటు ఆ రోజు విరాట్‌ కోహ్లీ సైతం సెంచరీతో చెలరేగాడు. కోహ్లీ సైతం 91 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సులతో 113 పరుగులు చేశాడు.

ishan kishan double century

వీరిద్దరి దెబ్బకు టీమిండియా 50 ఓవర్లలో 409 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఆ వెంటనే బంగ్లాదేశ్‌ను 182 పరుగులకే కుప్పకూల్చి భారీ విజయాన్ని నమోదు చేసింది.  కాగా, ఇషాన్‌ డబుల్‌ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత విరాట్‌ కోహ్లీ డ్యాన్స్‌ చేస్తూ ఇషాన్‌ను అభినందించడం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఓ దిగ్గజ ఆటగాడు.. యువ క్రికెటర్‌ సాధించిన అరుదైన ఫీట్‌ను ఆలా సెలబ్రేట్‌ చేసుకోవడంతో క్రికెట్‌ అభిమానులు ఉబ్బితబ్బిబయ్యారు. మరి బంగ్లాదేశ్‌పై ఇషాన్‌ సాధించిన డబుల్‌ సెంచరీ రికార్డ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి