T20 World Cup: రేపే తొలి మ్యాచ్‌ ఆడనున్న టీమిండియా! అదొక్కటే భయం

T20 World Cup 2024, IND vs IRE: టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో తమ తొలి మ్యాచ్‌ ఆడేందుకు టీమిండియా రెడీ అవుతోంది. అయితే.. తొలి మ్యాచ్‌కి ముందు టీమిండియాను ఓ ప్రధాన సమస్య భయపెడుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

T20 World Cup 2024, IND vs IRE: టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో తమ తొలి మ్యాచ్‌ ఆడేందుకు టీమిండియా రెడీ అవుతోంది. అయితే.. తొలి మ్యాచ్‌కి ముందు టీమిండియాను ఓ ప్రధాన సమస్య భయపెడుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

క్రికెట్‌ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీ ప్రారంభమై ఊహించని ఫలితాలో దూసుకెళ్తోంది. అయితే.. ఈ మెగా టోర్నీలో టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను బుధవారం ఆడనుంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ క్రికెట్‌ స్టేడియంలో మ్యాచ్‌ ఆడుతుంది. మ్యాచ్‌ ఆడేది ఐర్లాండ్‌ లాంటి పసికూన జట్టులోనే అయినా.. టీమిండియాలో ఏదో తెలియని కలవరపాటు కనిపిస్తోంది. అందుకు కారణం.. జట్టు ఇంకా అక్కడి పరిస్థితులకు అలవాటు పడినట్లు కనిపిసంచడం లేదు. పైగా రాహుల్‌ ద్రవిడ్‌ చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు బలం చేకూర్చేలా ఉన్నాయి.

టీమిండియాలోని చాలా మంది ఆటగాళ్లకు అమెరికా కండీషన్స్‌ కొత్త. పైగా ఇక్కడ అనుభవం కూడా తక్కువే. నసావులోని పిచ్‌ ఎలా బిహేవ్‌ చేస్తుందో అనే అనుమానం ఆటగాళ్ల​ందరిలో ఉంది. ఇదే పిచ్‌పై టీమిండియా ఒకే ఒక్క వామప్‌ మ్యాచ్‌ ఆడింది. బంగ్లాదేశ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించినా.. ఐర్లాండ్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పిచ్‌ విషయం పక్కనపెడితే.. టీమిండియాలో కూడా సెట్‌ రైట్‌ అవ్వాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఓపెనింగ్‌ జోడీ విషయంలో భారత జట్టు కాస్త ఇబ్బంది పడుతుందనే విషయం తెలిసిందే. రోహిత్‌ శర్మతో పాటే యశస్వి జైస్వాల్‌ ఇద్దరూ ఫామ్‌లో లేరు.

బంగ్లాదేశ్‌తో జరిగిన వామప్‌ మ్యాచ్‌లో సంజు శాంసన్‌ను ఓపెనర్‌గా దింపి.. రోహిత్‌ శర్మ ప్రయోగం చేశాడు. కానీ, అది ఫలితం ఇవ్వలేదు. ఓపెనర్‌గా శాంసన్‌ ప్రభావం చూపలేకపోయాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్‌ అయ్యాడు. అయితే.. కేవలం ఒక్క మ్యాచ్‌తో శాంసన్‌ సత్తాను అంచనా వేయడం సరికాదు. కానీ, ఓపెనర్లు రోహిత్‌ శర్మ, జైస్వాల్‌లో ఒకరు కచ్చితంగా ఫామ్‌లోకి తిరిగి రావడం చాలా అవసరం లేదంటే.. ఒత్తిడి మొత్తం విరాట్‌ కోహ్లీపైనే పడుతుంది. పొరపాటున కోహ్లీ కనుక విఫలం అయితే.. ఇక టీమిండియా బ్యాటింగ్‌ లైనప్‌ సైకిల్‌ స్టాండ్‌ను తలపించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మరి టీమిండియాకు ఒక్క సమస్యపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments