iDreamPost

ఆ పెను విధ్వంసానికి 8 ఏళ్లు! కోహ్లీ, ఏబీడీ రికార్డ్ ఇప్పటికీ చెక్కుచెదరలేదు!

సరిగ్గా ఇదే రోజు ఐపీఎల్ 2016 సీజన్ లో పెను విధ్వంసం సృష్టించారు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్. ఆ ఊచకోతకు నేటితో 8 ఏళ్లు. ఇప్పటికీ ఆ రికార్డ్ చెక్కుచెదరలేదు. ఆ తుఫాన్ మ్యాచ్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

సరిగ్గా ఇదే రోజు ఐపీఎల్ 2016 సీజన్ లో పెను విధ్వంసం సృష్టించారు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్. ఆ ఊచకోతకు నేటితో 8 ఏళ్లు. ఇప్పటికీ ఆ రికార్డ్ చెక్కుచెదరలేదు. ఆ తుఫాన్ మ్యాచ్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆ పెను విధ్వంసానికి 8 ఏళ్లు! కోహ్లీ, ఏబీడీ రికార్డ్ ఇప్పటికీ చెక్కుచెదరలేదు!

అది 2016, మే 14 సరిగ్గా ఇదే రోజు.. ఓ రెండు సింహాలు క్రికెట్ మైదానంలో వేట మెుదలుపెట్టాయి. ఆ వేట ఎలా సాగిందో చెప్పడానికి మాటలు కూడా సరిపోవు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అలాంటి విధ్వంసం మీరింతవరకు చూసుండరు. ఆ రెండు సింహాల్లో ఒకరు విరాట్ కోహ్లీ అయితే.. మరొకరు ఏబీ డివిలియర్స్. గుజరాత్ లయన్స్ బౌలర్లను జింకలను చేసి ఆడుకున్న రోజది. వీరిద్దరు ఆ మ్యాచ్ లో సృష్టించిన రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదంటేనే అర్దం చేసుకోవచ్చు.. వీరి ఊచకోత ఎలా సాగిందో. ఆ విధ్వంసానికి నేటితో సరిగ్గా 8 ఏళ్లు పూర్తైన సందర్భంగా మరొక్కసారి ఆ మ్యాచ్ ను గుర్తుచేసుకుందాం.

విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్.. పెను విధ్వంసానికి మారుపేర్లుగా నిలిచే క్రికెటర్లు. వరల్డ్ క్రికెట్ లో వీరు ఎంత డేంజరస్ ప్లేయర్లో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మరి అలాంటి ఆటగాళ్లకు తమదైన రోజు వచ్చి చెలరేగితే ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది కదా? అలాంటి ఓ రోజు రానే వచ్చింది. సరిగ్గా ఇదే రోజు మే 14, 2016న బెంగళూరులో పరుగుల సునామీ వచ్చింది. ఆ సునామీని సృష్టించింది కోహ్లీ, ఏబీడీ. గుజరాత్ లయన్స్ తో జరిగిన ఆ మ్యాచ్ లో అసాధారణ రీతిలో చెలరేగారు ఈ దిగ్గజాలు.

గుజరాత్ లయన్స్ తో జరిగిన ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ కు దిగింది ఆర్సీబీ. డేంజరస్ బ్యాటర్ క్రిస్ గేల్(6) తక్కువ పరుగులకే ఔట్ చేసి గుజరాత్ కు ఆదిలోనే బ్రేక్ త్రూ అందించాడు ధవళ్ కులకర్ణి. అయితే ఆ సంతోషాన్ని వారికి లేకుండా చేశారు కోహ్లీ-డివిలియర్స్. వచ్చిన బంతుల్ని వచ్చినట్లు దంచికొడుతూ.. ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై ఓ యుద్ధాన్ని ప్రకటించారు. వీరిద్దరి ధాటికి తట్టుకోలేని బౌలర్లు గ్రౌండ్ లోనే ప్రేక్షకపాత్ర వహించక తప్పలేదు. ఈ జోడీని విడదీయడానికి ఏకంగా 7 బౌలర్లను రంగంలోకి దించింది గుజరాత్. కానీ.. వారి థండర్ బ్యాటింగ్ ను మాత్రం అడ్డుకోలేకపోయింది.

ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 55 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 8 సిక్సులతో 109 పరుగులు చేసి, ప్రవీణ్ కుమార్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. మరోవైపు ఏబీడీ 52 బంతుల్లో 10 ఫోర్లు, 12 సిక్సులతో 129 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. వీరిద్దరు రెండో వికెట్ కు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.  కోహ్లీ-ఏబీడీ కలిసి 229 పరుగుల భారీ పార్ట్ నర్ షిప్ ను నెలకొల్పారు. ఐపీఎల్ చరిత్రలో ఏ వికెట్ కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యాం కావడం విశేషం. ఇప్పటి వరకు ఈ రికార్డ్ ను ఎవ్వరూ బ్రేక్ చేయలేదు. చెక్కు చెదరకుండా ఆ రికార్డ్ అలాగే ఉంది. ఇక ఈ మ్యాచ్ లో 20 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 248 పరుగుల భారీ స్కోర్ చేసింది ఆర్సీబీ. కానీ 249 రన్స్ టార్గెట్ తో బరిలోకి  దిగిన గుజరాత్ లయన్స్ కేవలం 104 పరుగులకే ఆలౌట్ అయ్యింది. గుజరాత్ బౌలర్లకు పీడకలను మిగిల్చి నేటికి 8 ఏళ్ల సందర్భంగా క్రికెట్ ఫ్యాన్స్ మరొక్కసారి ఈ మ్యాచ్ ను గుర్తుచేసుకుంటున్నారు. మరి కోహ్లీ-ఏబీడీ విధ్వంసంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Middle stump Cricket (@middle.stump.cric)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి