T20 World Cup: మొదలైన రెండో రోజే మ్యాచ్‌ టై! ఇది కదా టీ20 క్రికెట్‌ అసలు మజా!

Oman vs Namibia, Super Over, T20 World Cup 2024: పొట్టి ప్రపంచ కప్‌ పోటీలు ప్రారంభమైన రెండో రోజు నుంచే క్రికెట్‌ అభిమానులకు అదిరిపోయే క్రికెట్‌ మజాను అందిస్తున్నాయి. పెద్ద టీమ్స్‌ రంగ ప్రవేశం చేయకముందే నరాలు తెగే ఉత్కంఠ భరిత మ్యాచ్‌లు జరుగుతున్నాయి. తాజాగా ఓ మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు వెళ్లింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం..

Oman vs Namibia, Super Over, T20 World Cup 2024: పొట్టి ప్రపంచ కప్‌ పోటీలు ప్రారంభమైన రెండో రోజు నుంచే క్రికెట్‌ అభిమానులకు అదిరిపోయే క్రికెట్‌ మజాను అందిస్తున్నాయి. పెద్ద టీమ్స్‌ రంగ ప్రవేశం చేయకముందే నరాలు తెగే ఉత్కంఠ భరిత మ్యాచ్‌లు జరుగుతున్నాయి. తాజాగా ఓ మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు వెళ్లింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 సమరం ప్రారంభమైన రెండో రోజు క్రికెట్‌ అభిమానులకు అదిరపోయే క్రికెట్‌ మజాను అందించింది. సోమవారం ఒమన్‌, నమీబియా మధ్య జరిగిన మ్యాచ్‌ టై అయింది. దీంతో.. ఈ టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో తొలి సూపర్‌ ఓవర్‌ మ్యాచ్‌గా ఈ మ్యాచ్‌ నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఒమన్‌కు మంచి స్టార్‌ దక్కలేదు. సున్నా పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. 10 పరుగుల వద్ద 3వ వికెట్‌ పడిపోవడంతో ఒమన్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ జీషాన్‌ మక్సుద్‌ 22, ఖాలిద్‌ కైల్‌ 34 పరుగులు చేసి ఒమన్‌ను ఆదుకున్నారు. మొత్తంగా 110 పరుగుల స్వల్ప టార్గెట్‌ను నమీబియా ముందు ఉంచింది ఒమన్‌. నమీబియా బౌలర్లలో ట్రంపెల్మాన్ 4, డేవిడ్ వైస్ 3 వికెట్లతో రాణించారు.

ఈ 110 టార్గెట్‌తో బరిలోకి దిగిన నమీబియాకు ఆరంభంలోనే షాకిచ్చాడు ఒమన్‌ బౌలర్‌ బిలాల్‌ ఖాన్‌. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ రెండో బంతికి మైఖేక్‌ వాన్‌ను బౌల్డ్‌ చేసి నమీబియాను ఒత్తిడిలోకి నెట్టాడు. జాన్ ఫ్రైలింక్ 45, నికోలాస్ డేవిన్ 24 పరుగులతో రాణించినా.. తర్వాత బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో నమీబియా కూడా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సరిగ్గా 109 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్‌ టై అయింది. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ప్రారంభమైన రెండో రోజే మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీయడంతో.. అసలు సిసలు క్రికెట్‌ మాజా మొదలైందంటూ క్రికెట్‌ అభిమానులు సంతోష పడుతున్నారు.

ఇక సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నమీబియా ఏకంగా 21 పరుగులు చేసింది. బిలాల్‌ ఖాన్‌ వేసిన సూపర్‌ ఓవర్‌లో డేవిడ్‌ వైస్‌ 4, 6, 2తో తొలి మూడు బంతుల్లోనే 12 పరుగులు చేశాడు. నాలుగో బంతికి సింగిల్‌ రావడంతో ఇరాస్‌మస్‌ చివరి రెండు బంతుల్లో రెండు ఫోర్లు బాదాడు దీంతో సూపర్‌ ఓవర్‌లో 21 రన్స్‌ వచ్చాయి. 22 పరుగుల టార్గెట్‌తో సూపర్‌ ఓవర్‌ ఆడేందుకు బరిలోకి దిగిన ఒమన్‌ 10 పరుగులు మాత్రమే చేయగలిగింది. నమీబియా బౌలర్‌ డేవిడ్‌ వైస్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో నమీబియాను గెలిపించాడు. అయితే.. 109 పరుగుల టార్గెట్‌ను కాపాడుకుంటూ.. నమీబియాను కూడా 109కే రెస్టిక్‌ చేసిన ఒమన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. మరి టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో తొలి సూపర్‌ ఓవర్‌ మ్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments