iDreamPost
android-app
ios-app

Arshad Nadeem: వీడియో: టెర్రరిస్ట్​తో అర్షద్ నదీమ్.. కొత్త కాంట్రవర్సీలో పాక్ అథ్లెట్!

  • Published Aug 13, 2024 | 5:48 PM Updated Updated Aug 13, 2024 | 5:48 PM

పాకిస్థాన్ స్టార్ అథ్లెట్ అర్షద్ నదీమ్ పారిస్ ఒలింపిక్స్​లో గోల్డ్ మెడల్​తో మెరిసిన సంగతి తెలిసిందే. అతడు తాజాగా ఓ కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు.

పాకిస్థాన్ స్టార్ అథ్లెట్ అర్షద్ నదీమ్ పారిస్ ఒలింపిక్స్​లో గోల్డ్ మెడల్​తో మెరిసిన సంగతి తెలిసిందే. అతడు తాజాగా ఓ కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు.

  • Published Aug 13, 2024 | 5:48 PMUpdated Aug 13, 2024 | 5:48 PM
Arshad Nadeem: వీడియో: టెర్రరిస్ట్​తో అర్షద్ నదీమ్.. కొత్త కాంట్రవర్సీలో పాక్ అథ్లెట్!

ఒక్క పతకంతో హీరో అయిపోయాడు అర్షద్ నదీమ్. పారిస్ ఒలింపిక్స్​లో గోల్డ్ మెడల్ సాధించి పాకిస్థాన్​లో ఓవర్​నైట్ స్టార్ అయిపోయాడు. స్వర్ణం సాధించి స్వదేశానికి వచ్చిన నదీమ్​ అవార్డులు, రివార్డులు దక్కించుకుంటున్నాడు. ఈసారి ఒలింపిక్స్​లో పాక్​ ఒకే పతకం సాధించగా.. అది కూడా నదీమ్​కు వచ్చిన గోల్డే కావడం గమనార్హం. దీంతో అతడి టాలెంట్​కు గుర్తింపుగా అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించాలని పాక్ నేషనల్ అసెంబ్లీ సర్కారుకు సిఫార్సు చేసింది. గోల్డ్ మెడల్ సాధించిన నదీమ్​ను ఇతర దేశాల క్రీడాభిమానులు కూడా మెచ్చుకుంటున్నారు. ఎలాంటి సౌకర్యాలు లేని చోట నుంచి కష్టాన్ని నమ్ముకొని ఈ స్థాయికి రావడం, ఒలింపిక్స్​లో విజేతగా నిలవడం అంటే మాటలు కాదని మెచ్చుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ ఛాంపియన్ ఇప్పుడో కాంట్రవర్సీలో చిక్కుకున్నాడు.

ఒలింపిక్స్ ముగించుకొని స్వదేశానికి వచ్చిన అర్షద్ నదీమ్​ను చాలా మంది ప్రముఖులు కలుస్తున్నారు. ఈ స్టార్ అథ్లెట్ పలు ఈవెంట్స్​లోనూ మెరుస్తున్నాడు. ఈ క్రమంలో టెర్రరిస్టులతో అతడు కనిపించడం వివాదాస్పదంగా మారింది. భారత్​పై దాడులకు తెగబడే లష్కర్-ఏ-తొయిబా ఉగ్రవాద సంస్థ లీడర్ హారిస్ దార్​తో కలసి కనిపించాడు నదీమ్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నదీప్​ భుజంపై చేయి వేసి అతడ్ని మెచ్చుకున్నాడు హారిస్ దార్. బాగా ఆడావని, గర్వించేలా చేశావంటూ ప్రశంసించడం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ అతడిపై సీరియస్ అవుతున్నారు. మెడల్ గెలిచావని మెచ్చుకుంటే.. ఇలా టెర్రరిస్ట్​ను కలవడం ఏంటని ఫైర్ అవుతున్నారు.

నదీమ్ నుంచి ఇది ఆశించలేదని, భారత్​కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ, దాడులకు తెగబడే ఉగ్రవాదులను కలవడం కరెక్ట్ కాదని విమర్శలు వస్తున్నాయి. అయితే నదీమ్ లష్కర్ నేతల్ని ఎందుకు కలిశాడు? అనేది క్లారిటీ లేదు. కానీ మెడల్ గెలిచినందుకు ఆ ఉగ్రవాదులు అతడ్ని మెచ్చుకోవడం మాత్రం వీడియోలో చూడొచ్చు. ఈ విషయంపై పూర్తి క్లారిటీ వచ్చే వరకు నిజానిజాలు ఏంటనేది చెప్పలేం. అయితే ఒలింపిక్స్​లో అద్భుతమైన ఆటతీరుతో అందరి మనసులు గెలుచుకున్న అథ్లెట్ ఒక్క పనితో విమర్శల పాలవడం గమనార్హం. కాగా, గోల్డ్ మెడల్ నెగ్గిన నదీమ్​కు అతడి మామ మహ్మద్ నవాజ్ స్పెషల్​గా ఓ గిఫ్ట్ ఇచ్చాడు. ఓ గేదెను అతడికి ఇచ్చాడు. మరి.. టెర్రరిస్ట్​ను నదీమ్ కలసిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.