ఒలింపిక్‌ గోల్డ్‌ మెడల్ గెలిచిన అర్షద్ నదీమ్‌కు గిఫ్ట్‌గా గేదె! పాక్‌లో అంతే మరి!

Arshad Nadeem, Buffalo, Javelin Throw, Paris Olympics 2024: పారిస్‌ ఒలింపిక్స్‌లో పాకిస్థాన్‌కు గోల్డ్‌ మెడల్‌ అందించిన అర్షద్‌ నదీమ్‌కు గిఫ్ట్‌గా గేదె ఇచ్చారు. వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Arshad Nadeem, Buffalo, Javelin Throw, Paris Olympics 2024: పారిస్‌ ఒలింపిక్స్‌లో పాకిస్థాన్‌కు గోల్డ్‌ మెడల్‌ అందించిన అర్షద్‌ నదీమ్‌కు గిఫ్ట్‌గా గేదె ఇచ్చారు. వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

తాజాగా ముగిసిన పారిస్‌ ఒలింపిక్స్‌లో పాకిస్థాన్‌ జావెలిన్‌ త్రోయర్‌ అర్షద్‌ నదీమ్‌ గోల్డె మెడల్‌ గెలిచిన విషయం తెలిసిందే. ఒలింపిక్‌ చరిత్రలోనే అత్యధిక దూరం బల్లెం విసిరి.. అర్షద్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఏకంగా 92.97 మీటర్ల దూరం జావెలిన్‌ విసిరాడు. భారత స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రాను ఫైనల్‌లో ఓడించి మరీ.. అర్షద్‌ పాకిస్థాన్‌కు వ్యక్తిగత విభాగంలో మొట్టమొదటి బంగారు పతకాన్ని అందించాడు. అర్షద్‌ సాధించిన విజయంతో పాక్‌లో ఒక్కసారిగా హీరో అయిపోయాడు. పాకిస్థాన్‌ ప్రజలు, ప్రముఖులు, క్రికెటర్లు అంతా అర్షద్‌ నదీమ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.

ఇటీవల పారిస​్‌ నుంచి పాకిస్థాన్‌లోని తన స్వగ్రామానికి వెళ్లిన అర్షద్‌ నదీమ్‌కు ఊహించని రీతిలో ఘన స్వాగతం లభించింది. ముఖ్యంగా తన స్వగ్రామంలో అయితే.. ప్రజలంతా అర్షద్‌ ఇంటి వద్ద భారీగా జమయ్యారు. గోల్డ్‌ మెడల్‌ గెలిచి, పాకిస్థాన్‌ కీర్తిని పెంచిన అర్షద్‌కు అతని మామ ఎవ్వరూ ఉహించని బహుమతి అందించాడు. గోల్డ్‌ మెడల్‌ విన్నర్‌కు ఒక గేదెను గిఫ్ట్‌గా ఉన్నాడు అర్షద్‌కు పిల్లనిచ్చిన మామ. అదేంటి.. ఒలింపిక్‌ మెడల్‌ సాధించినోడికి.. గేదెను బహుమతిగా ఇవ్వడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? దాని వెనుక ఒక స్టోరీ ఉంది.

అదేంటంటే.. అర్షద్‌ నదీమ్‌ స్వగ్రామం వియాన్‌ చన్ను. ఇది పంజాబ్ ప్రావిన్స్‌లోని ఖనేవాల్ గ్రామీణ ప్రాంతంలో ఒక చిన్న పల్లెటూరు. ఈ ప్రాంతంలో గేదెను బహుమతిగా ఇవ్వడాన్ని ఎంతో గౌరవప్రదంగా, విలువైనదిగా భావిస్తారు. అందుకే అర్షద్‌ మామ కూడా.. తన అల్లుడికి ఎంతో గౌరవప్రదంగా గేదెను బహుమతిగా ఇచ్చి అభినందించాడు. అర్షద్‌ నదీమ్‌ ఒలింపిక్‌ స్థాయిలో తన దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నా.. ఇంకా తన తల్లిదండ్రులు, సోదరులతో కలిసి ఇదే గ్రామంలో ఉండటం విశేషం. మరి అర్షద్‌కు గేదెను గిఫ్ట్‌గా ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments