SNP
Ollie Pope, ENG vs SL: ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్, తాత్కాలిక కెప్టెన్ ఓలీ పోప్ సెంచరీతో అదరగొట్టాడు. సెంచరీ కంటే కూడా ఓ అరుదైన రికార్డుతో చరిత్ర పుటల్లోకెక్కాడు. ఆ అరుదైన రికార్డు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Ollie Pope, ENG vs SL: ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్, తాత్కాలిక కెప్టెన్ ఓలీ పోప్ సెంచరీతో అదరగొట్టాడు. సెంచరీ కంటే కూడా ఓ అరుదైన రికార్డుతో చరిత్ర పుటల్లోకెక్కాడు. ఆ అరుదైన రికార్డు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
ఇంగ్లండ్ ఆటగాడు ఓలీ పోప్ సూపర్ సెంచరీతో అదురగొట్టాడు. టెస్టు మ్యాచ్‌లో వన్డే తరహా ఇన్నింగ్స్ ఆడి.. 103 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సులతో 103 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ స్టన్నింగ్ సెంచరీతో పాటు ఓ అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అది అలాంటి ఇలాంటి రికార్డు కాదండోయ్.. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు సాధించలేని, ఎవరి పేరిట లేని రికార్డు అది. అందుకే.. బెన్ స్టోక్స్, జో రూట్ లాంటి ఇంగ్లండ్ మోడ్రన్ గ్రేట్ ప్లేయర్లు కూడా.. ఓలీ పోప్ సెంచరీ కి డ్రెస్సింగ్ రూమ్‌లో నిల్చోని మరి చప్పట్లు కొడుతూ.. అభినందించడంతో పాటు వాళ్లు కూడా సెలబ్రేట్ చేసుకున్నారు.
కేవలం ఓలీ పోప్‌కే కాదు.. ఇంగ్లండ్ క్రికెట్‌కు కూడా ఇది అరుదైన సెంచరీ అనే చెప్పాలి. క్రికెట్ చరిత్రలోనే ఎవరు సాధించలేని రికార్డును ఇప్పుడు పోప్ సాధించి.. తమ దేశం కీర్తిని మరింత పెంచడం నిజంగా గొప్ప విషయమే కదా.. ఇంతకీ పోప్ సాధించిన రికార్డు ఏంటంటే.. టెస్టుల్లో పోప్ ఇప్పటి వరకు 7 సెంచరీలు సాధించాడు. అయితే.. ఈ 7 సెంచరీలు సైతం 7 డిఫరెంట్ దేశాలపై చేశాడు. ఫస్ట్ సెంచరీ సౌతాఫ్రికాపై చేసిన పోప్.. తర్వాత వరుసగా న్యూజిలాండ్, పాకిస్థాన్, ఐర్లాండ్, ఇండియా, వెస్టిండీస్.. ఇప్పుడు శ్రీలంకపై చేశాడు. ఇలా కెరీర్లో తొలి 7 సెంచరీలను ఏడు వేర్వేరు దేశాలపై చేసిన క్రికెటర్ ఒకే ఒక్కడు ఉన్నాడు అతనే ఓలీ పోప్.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా శుక్రవారం లండన్‌లోని ఓవెల్ మైదానంలో ఇంగ్లండ్-శ్రీలంక మధ్య మూడో టెస్ట్ ప్రారంభం అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఓపెనర్ డానియల్ లారెన్స్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. బెన్ స్టోక్స్ లేకపోవడంతో కెప్టెన్‌గా బరిలోకి దిగిన ఓలీ పోప్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చి అద్భుతమైన సెంచరీ సాధించాడు. అలాగే ఓపెనర్ బెన్ డకెట్ 79 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో 86 పరుగులు చేసి అదరగొట్టాడు. డకెట్, పోప్ అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడటంతో స్కోర్‌బోర్డు పరుగులు పెట్టింది. డకెట్ 86 పరుగుల తర్వాత అవుట్ అయ్యాడు. జో రూట్ సైతం 13 రన్స్ మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఓలి పోప్ 103, హ్యారీ బ్రూక్ 8 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. మరి ఈ మ్యాచ్లో పోప్ సెంచరీతో పాటు.. 7 సెంచరీలు 7 వేర్వేరు టీమ్స్‌పై సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ollie Pope – The first batter in history to score his first seven Test hundreds against different opposition.
Take a bow, Ollie 🤝 pic.twitter.com/37hYVSfiN2
— England Cricket (@englandcricket) September 6, 2024