వరల్డ్ కప్-2023కి అంతా రెడీ అవుతోంది. మెగాటోర్నీ ఆరంభానికి మరో రెండ్రోజుల సమయమే మిగిలి ఉంది. ఈసారి కప్ కొట్టాలని మెయిన్ టీమ్స్ బలంగా ఫిక్స్ అయ్యాయి. భారత గడ్డపై తమ ప్రతాపం చూపేందుకు పసికూన జట్లు కూడా సిద్ధమవుతున్నాయి. కప్ కోసం భారత్‌కు అన్ని జట్లు వచ్చేశాయి. ఇప్పటికే కొన్ని టీమ్స్ వార్మప్ మ్యాచ్ కూడా ఆడేశాయి. భారత్ తన తొలి సన్నాహక మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడాల్సింది. కానీ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయింది. వరల్డ్ కప్ ముంగిట తన ఆఖరి వార్మప్ మ్యాచ్‌కు టీమిండియా సిద్ధమైంది.
రెండో వార్మప్ మ్యాచ్‌లో భాగంగా పసికూన నెదర్లాండ్స్‌ను భారత్ ఢీకొనబోతోంది. ఇదిలా ఉంటే.. ఈసారి వరల్డ్ కప్ టికెట్స్‌కు ఎప్పటిలాగే ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మామూలు క్రికెట్ మ్యాచులకే ఒక రేంజ్లో గిరాకీ ఉంటుంది. అలాంటి ప్రపంచ కప్ అంటే డిమాండ్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మెటా టోర్నికి సంబంధించిన టికెట్స్ బుకింగ్స్ తెరవగానే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇప్పటికీ టికెట్ల కోసం కొందరు ఫ్యాన్స్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. అలాంటి వారికి గుడ్ న్యూస్. మహిళలకు బీజేపీ బంపరాఫర్ ప్రకటించింది.
లాస్ట్ టైమ్ కప్ గెలుచుకున్న ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో వరల్డ్ కప్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 5వ తేదీన జరగనున్న ఈ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో మహిళలకు బీజేపీ అద్భుతమైన ఆఫర్ ఇస్తోందని తెలుస్తోంది. ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్‌ను ఉచితంగా చూసే అవకాశాన్ని కల్పిస్తోందట బీజేపీ. 40 వేల మంది స్త్రీలకు ఈ మ్యాచ్ టికెట్లను బీజేపీ ఫ్రీగా అందిస్తోందని సమాచారం. మహిళలకు ఫ్రీ టికెట్లతో పాటు బ్రేక్‌ఫాస్ట్ సౌకర్యాన్ని కూడా ఇస్తున్నట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి.. బీజేపీ ఇలా ఉచితంగా మ్యాచ్ టికెట్లు ఇవ్వడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: భారత్‌దే వరల్డ్ కప్.. రాసిపెట్టుకోండి అంటున్న ప్రముఖ జ్యోతిష్యుడు!
The BJP set to gather more than 40,000 women for the England Vs New Zealand World Cup match at the Narendra Modi Stadium.
They’ll get free tickets and also breakfast. (Dainik Bhaskar). pic.twitter.com/0pc29YXFuh
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 3, 2023