సెర్బియన్ యోధుడు నొవాక్ జకోవిచ్ తన 24వ గ్రాండ్ స్లామ్ సాధించాలన్న కలకు చెక్ పెట్టాడు.. స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాస్. ఇటీవలే జరిగిన వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ ఫైనల్లో ఇద్దరూ గెలుపు కోసం హోరాహోరిగా పోరాడారు. ఓడిపోయేందుకు ఇద్దరిలో ఎవ్వరూ ఒప్పుకోలేనంతగా.. తమ పోరాటాన్ని సాధించారు. కానీ చివరికి విజయం అల్కరాస్ నే వరించింది. అల్కరాస్ దూకుడు ముందు టెన్నిస్ దిగ్గజం జకోవిచ్ అనుభవం పనికిరాలేదు. కాగా.. ఫైనల్ మ్యాచ్ లో నొవాక్ జకోవిచ్ చేసిన పనికి భారీ జరిమానాను విధించారు వింబుల్డన్ టోర్నీ నిర్వాహకులు.
సెర్బియన్ యోధుడు, టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే వింబుల్డన్ ఫైనల్లో ఓడిపోయిన బాధలో ఉన్న అతడికి టోర్నీ నిర్వాహకులు షాకిచ్చారు. అందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. మ్యాచ్ లో భాగంగా ఐదో సెట్ లో అల్కరాస్ సర్వీస్ ను బ్రేక్ చేసిన జకోవిచ్.. కొద్దిసేపటికే తన సర్వీస్ ను కోల్పోయాడు. దాంతో సహనం కోల్పోయి రాకెన్ ను నెట్ పోస్ట్ కు బలంగా విసిరికొట్టాడు. ఆ ఫోర్స్ దెబ్బకు రాకెట్ రెండు ముక్కలైంది. అదీకాక అంపైర్ పై కోపాన్ని ప్రదర్శించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఇదంతా గమనించిన ఫెర్గూస్ మూర్ఫీ జకోవిచ్ కు ఫీల్డ్ లోనే వార్నింగ్ ఇచ్చాడు. క్రమ శిక్షణ చర్యల్లో భాగంగా.. వింబుల్డన్ టోర్నీ నిర్వాహకులు జకోవిచ్ కు 8వేల అమెరికన్ డాలర్లు జరిమానా విధించారు. భారత కరెన్సీలో దాదాపు రూ. 6.50 లక్షలు అన్నమాట. ఇదంతా ఒకలెక్క అయితే.. 2023లో ఈ సెర్బియన్ యోధుడు జకోవిచ్ కు ఇప్పటి వరకు విధించిన జరిమానాలు అత్యధికమని చెప్పొచ్చు.
Novak Djokovic….#novak pic.twitter.com/WCIM7BWshp
— RVCJ Sports (@RVCJ_Sports) July 18, 2023
ఇదికూడా చదవండి: చరిత్ర సృష్టించిన పాక్ బ్యాట్స్మన్.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో..!