SNP
Virat Kohli, Rohit Sharma, Jay Shah: టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బానిసలు కాదంటూ.. జైషా పేర్కొన్నాడు. అలాగే అయ్యర్, ఇషాన్ తమ దెబ్బకు సెట్ అయ్యారని అన్నాడు. ఆయన అలా ఎందుకన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..
Virat Kohli, Rohit Sharma, Jay Shah: టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బానిసలు కాదంటూ.. జైషా పేర్కొన్నాడు. అలాగే అయ్యర్, ఇషాన్ తమ దెబ్బకు సెట్ అయ్యారని అన్నాడు. ఆయన అలా ఎందుకన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
టీమిండియా ఫ్యూచర్ స్టార్స్‌గా గుర్తింపు పొంది.. వన్డే వరల్డ్ కప్ 2023లో ఆడిన యువ క్రికెటర్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్.. కొన్ని నెలల క్రితం బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన విషయం తెలిసిందే. ఇషాన్ కిషన్ అయితే.. ఏకంగా టీమిండియాకు పూర్తిగా దూరం అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ శ్రీలంకతో వన్డే సిరీస్‌తో ఈ మధ్యనే టీమ్‌లోకి తిరిగి వచ్చాడు. ఇక వీరిద్దరు సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీలో ఆడనున్నారు. టీమిండియాకు ఆడే క్రికెటర్లు.. అంతర్జాతీయ మ్యాచ్‌లు లేనప్పుడు ఎక్కువ సమయంలో ఖాళీగా ఉంటే.. దేశవాళి క్రికెట్‌లో ఆడాలని బీసీసీఐ కండీషన్ పెట్టింది. ఆ రూల్‌ను ఫాలో కాలేదని.. రెస్ట్, గాయం, ఫిట్‌గా లేమంటూ.. కుంటిసాకులు చెప్పి.. డొమెస్టిక్ క్రికెట్‌కు దూరంగా ఉన్న అయ్యర్, ఇషాన్‌లపై బీసీసీఐ క్రమశిక్షణా చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.
వారిద్దరిపై తీసుకున్న చర్యల కారణం.. వచ్చే దులీప్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా మినహా మిగతా టీమిండియా క్రికెటర్లంతా బరిలోకి దిగుతున్నారు. తాము తీసుకున్న కఠిన నిర్ణయాల వల్లే ఇది సాధ్యమైందని బీసీసీఐ సెక్రటరీ జైషా వెల్లడించారు. గాయపడి.. చాలా రోజులు టీమిండియాకు దూరమై.. గాయం నుంచి కోలుకున్న తర్వాత.. డొమెస్టిక్ క్రికెట్‌లో ఫిట్‌నెస్ నిరూపించుకున్న తర్వాతే.. టీమిండియాలోకి రావాలనే కఠినమైన రూల్ పెట్టడంతోనే ఈ రోజు చాలా మంది క్రికెటర్లు దేశవాళి క్రికెట్ ఆడుతున్నారంటూ జైషా పేర్కొన్నాడు.
ఇక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజ క్రికెటర్లను దేశవాళి క్రికెట్ ఆడమనడంలో అర్థం లేదని, టీమిండియా మరో నెల రోజుల్లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడనుంది. వాళ్లిద్దరూ డొమెస్టిక్ క్రికెట్ ఆడి గాయపడితే.. అది ఇండియాకే నష్టం, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి దేశాల్లో కూడా టాప్ ప్లేయర్లు డొమెస్టిక్ క్రికెట్ ఆడరు. కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్లను మనం గౌరవించాలి, వాళ్లేం బానిసలు కాదు అంటూ జైషా స్పష్టం చేశారు. అయితే.. కొన్ని మ్యాచ్‌లు ఆడి, ఇక డొమెస్టిక్ క్రికెట్‌తో పనిలేదని భావించే యువ క్రికెటర్లు ఇలాంటి రూల్ కచ్చితంగా ఉండాలని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
It doesn’t make sense to add to Virat, Rohit’s load by asking them to play domestic. They run the risk of getting injured. We must treat our players respectfully and not treat them like servants,” said the BCCI secretary Jay Shah#ViratKohli𓃵 #RohitSharma pic.twitter.com/6feVJy1RN5
— Sayyad Nag Pasha (@nag_pasha) August 17, 2024