Jasprit Bumrah: బుమ్రా, బ్రెట్​లీ కాదు.. నేను చూసిన బెస్ట్ బౌలర్ అతడే: స్టెయిన్

Dala Steyn: ఈతరంలో బెస్ట్ బౌలర్ ఎవరంటే అందరూ ఠక్కున పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా పేరే చెబుతారు. కానీ సౌతాఫ్రికా లెజెండ్ డేల్ స్టెయిన్ మాత్రం తాను చూసిన బెస్ట్ బౌలర్ ఇంకొకరు ఉన్నారని అన్నాడు.

Dala Steyn: ఈతరంలో బెస్ట్ బౌలర్ ఎవరంటే అందరూ ఠక్కున పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా పేరే చెబుతారు. కానీ సౌతాఫ్రికా లెజెండ్ డేల్ స్టెయిన్ మాత్రం తాను చూసిన బెస్ట్ బౌలర్ ఇంకొకరు ఉన్నారని అన్నాడు.

జస్​ప్రీత్ బుమ్రా.. ప్రస్తుత క్రికెట్​లో బెస్ట్ బౌలర్​గా పేరు తెచ్చుకున్న క్రికెటర్. అతడి బౌలింగ్​ను ఎదుర్కోవాలంటే తోపు బ్యాటర్లు కూడా భయపడుతుంటారు. ఒకవైపు పరుగులు ఇవ్వకుండా నియంత్రిస్తూ, మరోవైపు బ్యాక్ టు బ్యాక్ వికెట్లు తీస్తూ ప్రత్యర్థులను వణికిస్తుంటాడీ భారత పేసర్. టీ20, వన్డే, టెస్ట్.. ఫార్మాట్ ఏదైనా గానీ ఈ స్పీడ్​స్టర్ బంతితో చేసే మ్యాజిక్​లో ఎలాంటి మార్పూ లేదు. ఫార్మాట్​కు అనుగుణంగా లెంగ్త్​ను కాస్త అడ్జస్ట్ చేసుకొని చెలరేగిపోతాడు. వరుసగా డాట్ బాల్స్ వేస్తూ బ్యాటర్లను అయోమయంలో పడేస్తాడు. షాట్ కొట్టాలన్నా, డిఫెన్స్ చేయాలన్నా బ్యాటర్ జడుసుకునేలా చేస్తుంటాడు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచ కప్​లోనూ బుమ్రా నెక్స్ట్ లెవల్ బౌలింగ్​తో ఆకట్టుకున్నాడు.

పొట్టి వరల్డ్ కప్​లో 15 వికెట్లు తీసిన బుమ్రా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్​గా నిలిచాడు. బ్యాటర్ల డామినేషన్ నడిచే టీ20 క్రికెట్​ టోర్నమెంట్​లో ఓ బౌలర్ ఇలా మ్యాన్ ఆఫ్​ ది సిరీస్ అవార్డును అందుకోవడం అంటే మాటలు కాదు. మెగాటోర్నీలో బుమ్రా ఎకానమీ 4.17గా ఉండటం మరో హైలైట్. పరుగులు ఇవ్వడంలో పిసినారిగా వ్యవహరించాడీ భారత స్పీడ్​స్టర్. కొన్ని సందర్భాల్లో అతడు వికెట్లు తీయకపోయినా ప్రెజర్ బిల్డ్ చేస్తూ పోవడంతో మిగతా బౌలర్లకు వికెట్లు పడ్డాయి. ఫైనల్​​లోనూ ఆఖర్లో వచ్చి అద్భుతమైన స్పెల్​తో మ్యాచ్​ను టీమిండియా వైపు తిప్పాడు. అందుకే ఈతరం అనే కాదు.. క్రికెట్​లో తోపు బౌలర్ అంటే బుమ్రానే అంటూ దిగ్గజ ఆటగాళ్లు కూడా మెచ్చుకుంటున్నారు. అయితే సౌతాఫ్రికా పేస్ లెజెండ్ డేల్ స్టెయిన్ మాత్రం బుమ్రా కాదు.. పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తరే బెస్ట్ బౌలర్ అంటున్నాడు.

యార్కర్ల కింగ్​గా పేరు తెచ్చుకున్న బుమ్రా ఇన్ స్వింగ్, ఔట్ స్వింగ్, రివర్స్ స్వింగ్, బౌన్సర్స్, కట్టర్స్, స్లో డెలివరీస్ వేయడంలో ఆరితేరాడు. అయితే అతడి యార్కర్​ మాత్రం మోస్ట్ డేంజరస్ అనే చెప్పాలి. స్టార్ బ్యాటర్లను కూడా ఈ అస్త్రంతో ఎన్నోమార్లు పెవిలియన్​కు చేర్చాడు. ఆస్ట్రేలియా లెజెండ్ బ్రెట్​లీ తర్వాత అంత కచ్చితమైన యార్కర్లు వేయగల బౌలర్​గా బుమ్రా పేరు తెచ్చుకున్నాడు. అయితే స్టెయిన్ మాత్రం బుమ్రా, బ్రెట్​లీ కాదు.. అక్తర్ వేసే యార్కరే తోపు అన్నాడు. ఇప్పటిదాకా క్రికెట్ హిస్టరీలో బెస్ట్ యార్కర్ ఏదని మీరు భావిస్తున్నారంటూ స్టెయిన్​కు ప్రశ్న ఎదురైంది. దీనికి అతడు వెంటనే 1999 వరల్డ్ కప్​లో అక్తర్ విసిరినదని జవాబిచ్చాడు. ఆ టోర్నీలో పీక్ ఫామ్​లో ఉన్న అక్తర్.. 10 మ్యాచుల్లో 16 వికెట్లు తీశాడు. మరి.. బుమ్రా, అక్తర్​ల్లో ఎవరి యార్కర్ గ్రేట్ అని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

Show comments