SNP
Nikhat Zareen, Paris Olympics 2024, Yu Wu: భారత స్టార్ బాక్సర్, మన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్.. పారిస్ ఒలింపిక్స్ 2024లో తన ప్రస్థానం ముగించింది. ఎలిమినేటర్‌కి ముందు రెండు రోజులు పస్తులుండి రింగులోకి దిగింది. పూర్తి స్టోరీ ఇలా ఉండి..
Nikhat Zareen, Paris Olympics 2024, Yu Wu: భారత స్టార్ బాక్సర్, మన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్.. పారిస్ ఒలింపిక్స్ 2024లో తన ప్రస్థానం ముగించింది. ఎలిమినేటర్‌కి ముందు రెండు రోజులు పస్తులుండి రింగులోకి దిగింది. పూర్తి స్టోరీ ఇలా ఉండి..
SNP
రెండు సార్లు బాక్సింగ్‌లో వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచి.. తెలుగు జాతి ఖ్యాతి ఖండాంతరాలు దాటించి, దేశం కీర్తిని నలుదిశలా చాటిన తెలంగాణ బిడ్డ, తెలుగు తేజం.. నిఖత్ జరీన్. ఈ ప్రముఖ బాక్సర్ తాజాగా ప్రతిష్టాత్మక పారిస్ ఒలింపిక్స్ 2024లో పాల్గొంది. గురువారం 50 కేజీల ఈవెంట్‌లో చైనా బాక్సర్ వరల్డ్ నంబర్ వన్ ‘యూ వూ’తో తలపడింది. ఈ మ్యాచ్ కోసం నిఖత్ జరీన్ పడిన కష్టం గురించి తెలుసుకుంటూ.. గుండె తరక్కుపోయేలా ఉంది. ఒలింపిక్స్ లాంటి ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో మెడల్ గెలిచి, భారతదేశ ప్రతిష్ట పెంచాలనే సంకల్పంతో నిఖత్ ఏం చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..
చైనా బాక్సర్ యూ వూతో ఎలిమినేటర్ మ్యాచ్‌కి 48 గంటల ముందు నుంచి అంటే రెండు రోజుల పాటు నిఖత్ జరీన్ ఏం తినకుండా తాగకుండా ఉంది. కనీసం పచ్చిమంచి నీళ్లు కూడా ముట్టుకోలేదు. పస్తులుంటూనే.. బాక్సింగ్ ప్రాక్టీస్‌తో పాటు.. ప్రతి రోజు గంట సేపు ఆగకుండా రన్నింగ్ కూడా చేసింది. కీలక మ్యాచ్‌కి ముందు ఇంత కష్టం దేనికంటే?.. పారిస్ ఒలింపిక్స్ రూల్సే అందుకు కారణం. సాధారణంగా నిఖత్ జరీన్ 52 కేజీల ఈవెంట్‌లో పాల్గొంటూ ఉంటుంది. కానీ, పారిస్ ఒలింపిక్స్‌లో ఆ ఈవెంట్ లేదు.
దీంతో ఆమె 50 కీజీల ఈవెంట్‌లో పాల్గొనాల్సి వచ్చింది. 52 కేజీల నుంచి 50 కేజీల బరువు తగ్గేందుకు నిఖత్.. రెండు రోజులు పస్తులుండింది. మ్యాచ్ కోసం బరువు కొలిచిన తర్వాతనే.. నీళ్లు తాకింది. రెండు రోజులు పస్తులు ఉండటంతో నిఖత్ శక్తిని కోల్పోయింది.. మ్యాచ్ సమయానికి పూర్తి స్థాయిలో రికవరీ కాలేకపోయింది. రెండు రోజుల పాటు ఏం తినకపోవడంతో వరల్డ్ నంబర్ వన్ యూ వూ చేతిలో 5-0 తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమితో ఆమె ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్ మొదలై.. తొలి రౌండ్ ముగిసిన తర్వాత.. నిఖత్ జరీన్ తన కోచ్‌కి చెప్పిన మాట.. ‘నాకు కొన్ని నీళ్లు ఇస్తారా’ అని అడిగింది. ఈ మ్యాచ్ గెలిచి ఉంటే.. తన కష్టానికి ఫలితం దక్కేదంటే బరువెక్కిన హృదయంతో నిఖత్ జరీన్ పేర్కొంది. అయినా కూడా తాను స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తానంటూ ఒక ఛాంపియన్‌లా బదులిచ్చింది. మ్యాచ్ ఓడినా.. నిఖత్‌పై భారత క్రీడాభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. నీ తెగువకు సెల్యూట్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#Paris2024 #Olympics #Boxing And it is all over in Paris for Nikhat Zareen 🥲
Tough bout. Gave herself a little bit of hope with three judges on a tie after Round 2 but Wu Yu too good.
Just a nightmare draw, that is all. pic.twitter.com/EvYq4uLiyb
— AMIT YADAV (@AMITYAD27593197) August 1, 2024