iDreamPost

VIDEO: సెంచరీతో దుమ్ములేపిన పూరన్‌! ఇది కదా బాదుడంటే..

  • Published Sep 07, 2023 | 8:17 AMUpdated Sep 07, 2023 | 8:17 AM
  • Published Sep 07, 2023 | 8:17 AMUpdated Sep 07, 2023 | 8:17 AM
VIDEO: సెంచరీతో దుమ్ములేపిన పూరన్‌! ఇది కదా బాదుడంటే..

కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో విండీస్‌ క్రికెటర్ల విధ్వంసం కొనసాగుతోంది. వారి ధాటికి బౌలర్ల ఊచకోత జరుగుతోంది. తాజాగా బార్బడోస్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ ఆటగాడు నికోలస్‌ పూరన్‌ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. గ్రౌండ్‌లో విలయతాండవం చేస్తూ.. వచ్చిన బౌలర్‌ను వచ్చినట్లే పిచ్చికొట్టుడు కొట్టాడు. నైట్‌ రైడర్స్‌ ఇన్నింగ్స్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన పూరన్‌ చివరి వరకు నాటౌట్‌గా నిలిచి.. బార్బడోస్‌ బౌలర్లను ఊచకోత కోశాడు. పూరన్‌ విధ్వంసం ఎలా సాగిందంటే.. అతని ఇన్నింగ్స్‌లో ఏకంగా 10 సిక్సులు ఉన్నాయి.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నైట్‌ రైడర్స్‌ ఆరంభంలోనే ఓపెనర్‌ మార్క్‌ డియాల్‌ వికెట్‌ను కోల్పోయింది. అయితే అది వారికి మంచి చేసినట్టు ఉంది. ఎందుకంటే.. సునామీ వచ్చే సమయం ఆసన్నమైంది కనుక. వన్‌డౌన్‌లో పూరన్‌ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఏ బౌలర్‌ను కూడా లెక్కచేయకుండా విరుచుకుపడ్డాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా తను మాత్రం జోరు తగ్గించలేదు. భారీ షాట్లతో బార్బడోస్‌పై విరుచుకుపడ్డాడు. పూరన్‌ షాట్లకు గ్రౌండ్‌ చిన్నబోయింది. బౌండరీ లైన్‌ పూరన్‌ బ్యాట్‌ పక్కనే ఉందా అనే రేంజ్‌లో రెచ్చిపోయాడు ఈ కరేబియన్‌ కుర్రాడు. మొత్తం మీద 53 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సులతో 102 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

పూరన్‌ సృష్టించిన సునామీతో నైట్‌ రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ 30 బంతుల్లో 5 ఫోర్లతో 38 పరుగులు చేశాడు. కెప్టెన్‌ పొలార్డ్‌(2), టక్కర్‌(8) దారుణంగా విఫలమయ్యారు. ఇక చివర్లో పూరన్‌తో కలిసి మరో విధ్వంస వీరుడు రస్సెల్‌ ది మస్సెల్‌ కూడా రెచ్చిపోయాడు. కేవలం 22 బంతుల్లో 2 ఫోర్లు, 4 భారీ సిక్సులతో 39 పరుగులు చేసి నైట్‌ రైడర్స్‌కు చివర్లో మంచి స్కోర్‌ అందించాడు. చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన సునీల్‌ నరైన్‌కు బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. మొత్తం మీద పూరన్‌ సెంచరీతో పాటు, రస్సెస్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో నైట్‌రైడర్స్‌కు భారీ స్కోరే లభించింది. మరి ఈ టార్గెట్‌ను బార్బడోస్‌ రాయల్స్‌ ఛేజ్‌ చేస్తుందో లేదో చూడాలి. మరి ఈ మ్యాచ్‌లో పూరన్‌ ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వరల్డ్ కప్ లో నో ఛాన్స్.. చాహల్ కీలక నిర్ణయం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి