SNP
AFG vs NZ, T20 World Cup 2024: ఆఫ్ఘనిస్థాన్‌పై న్యూజిలాండ్ ఎలా ఓడిపోయింది అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.. అయితే న్యూజిలాండ్ ఓటమికి కారణం ఏంటి? అసలు ఈ మ్యాచ్‌లో కివీస్ చేసిన పొరపాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
AFG vs NZ, T20 World Cup 2024: ఆఫ్ఘనిస్థాన్‌పై న్యూజిలాండ్ ఎలా ఓడిపోయింది అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.. అయితే న్యూజిలాండ్ ఓటమికి కారణం ఏంటి? అసలు ఈ మ్యాచ్‌లో కివీస్ చేసిన పొరపాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
టీ20 క్రికెట్‌లో ఎంతో పటిష్టమైన జట్టు న్యూజిలాండ్‌ను ఆఫ్ఘనిస్థాన్ ఓడించి టీ20 వరల్డ్ కప్‌లో సంచలనం సృష్టించింది. ఏ ఫార్మాట్‌లోనైనా ఇప్పటి వరకు న్యూజిలాండ్‌పై ఆఫ్ఘనిస్థాన్‌కు ఇదే తొలి విజయం. పైగా టీ20 వరల్డ్ కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో కివీస్ లాంటి పెద్ద టీమ్‌ను ఓడించిన ఆఫ్ఘాన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘాన్ ఆటను ఎంతో మెచ్చుకోవచ్చో.. మరోవైపు న్యూజిలాండ్ ఆటను అంత విమర్శించినా తప్పులేదు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేసిన తప్పిదాలు కూడా ఆ జట్టు ఓటమికి కారణం అయ్యాయి. అసలు మ్యాచ్ చూస్తుంటే.. ఇది తప్పులు చేసేంది న్యూజిలాండ్ జట్టేనా? అసలు న్యూజిలాండ్ ఆట ఇలా ఉంటుందా? అని అనిపించక మానదు.
క్రికెట్‌లోని ఏ ఫార్మాట్‌లోనైనా.. న్యూజిలాండ్ జట్టు కచ్చితంగా గట్టి పోటీ ఇస్తుంది. సంచలనాలకు తావు ఇవ్వని జట్టుగా న్యూజిలాండ్‌కు పేరుంది. ముఖ్యంగా వరల్డ్ కప్ లాంటి ఈవెంట్స్‌లో న్యూజిలాండ్ ఎప్పుడూ స్ట్రాంగెస్ట్ టీమ్‌గానే ఉంటుంది. కనీసం సెమీ ఫైనల్‌కైనా వెళ్తుంది. కానీ, ఈ సారి తొలి మ్యాచ్‌లోనే ఆఫ్ఘనిస్థాన్ చేతిలో ఓటమి పాలైంది. ఈ ఓటమికి న్యూజిలాండ్ చెత్త ఫీల్డింగ్ ప్రధాన కారణం అంటున్నారు క్రికెట్ నిపుణులు. ఆఫ్ఘనిస్థాన్ బ్యాటింగ్‌లో ఓపెనర్లు బాగా ఆడారు. అయితే.. వారిని అవుట్ చేసే అవకాశాన్ని కివీస్ జారవిడిచింది. మ్యాట్ హెన్రీ వేసిన ఇన్నింగ్స్ 2వ ఓవర్ ఐదో బంతికి ఇబ్రహీం జద్రాన్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను కావ్వె నేలపాలు చేశాడు. మళ్లీ మ్యాట్ హెన్రీ వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్ మూడో బంతికి మళ్లీ ఇబ్రహీం జద్రాన్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను బౌండరీ లైన్ వద్ద ఫిన్ అలెన్ వదిలేశాడు. దీని వెంటనే నెక్ట్స్ ఓవర్ తొలి బంతికే అద్భుతంగా ఆడుతున్న రహమనుల్లా గుర్బాజ్‌ను రనౌట్ చేసే అవకాశం చేతులారా వదిలేశాడు వికెట్ కీపర్ డెవాన్ కాన్వె.
ఆ రెండు క్యాచ్‌ల్లో ఏ ఒక్క క్యాచ్ పట్టి ఉన్నా.. అలాగే గుర్బాజ్‌ను రనౌట్ చేసి ఉన్నా.. మ్యాచ్‌లో ఫలితం వేరేలా ఉండేది. ఎందుకంటే.. ఆఫ్ఘనిస్థాన్ చేసిన 159 పరుగుల్లో 122 రన్స్ ఓపెనర్లు ఇద్దరే కొట్టారు. వారిద్దరి త్వరగా అవుట్ చేసే అవకాశం వదిలేశారు న్యూజిలాండ్ ఆటగాళ్లు. అలాగే ఇన్నింగ్స్ 10వ ఓవర్ ఐదో బంతికి కేన్ విలియమ్సన్ ఒక టఫ్ క్యాచ్‌ను పట్టడంలో విఫలం అయ్యాడు. లూకీ ఫెర్గుసన్ వేసిన ఓవర్‌లో ఇబ్రహీం జద్రాన్ గాల్లోకి షాట్ ఆడాడు.. ఆ బాల్‌ను విలియమ్సన్ గాల్లోకి అమాంతం ఎగురుతూ.. ఆల్‌మోస్ట్ బంతిని అందుకున్నాడు కానీ, క్యాచ్‌ను పూర్తి చేయలేకపోయాడు. ఇలా న్యూజిలాండ్ చెత్త ఫీల్డింగ్‌తో ఆఫ్ఘనిస్థాన్‌పై ఓడిపోయింది. న్యూజిలాండ్ చేసిన ఈ చెత్త ఫీల్డింగ్ చూపి.. పాకిస్థాన్ కంటే దారుణంగా తయారు అయ్యారుగా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేసిన తప్పిదాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Is it really the New Zealand we know?
so many missed chances and poor fielding🤯#AFGvsNZ
📷 credit: @Cricketracker pic.twitter.com/GY7PIKbfAc
— Cricket Adda (@Aslicricketer23) June 7, 2024