iDreamPost
android-app
ios-app

IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్‌కు డేంజరస్ పిచ్! ఇక మనకి కోహ్లీనే దిక్కు!

  • Published May 28, 2024 | 1:40 PM Updated Updated May 28, 2024 | 1:40 PM

New York, Nassau Cricket Stadium, Virat Kohli, T20 World Cup 2024: ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసం డేంజరస్‌ పిచ్‌ను రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియాకు విరాట్‌ కోహ్లీనే దిక్కు కానున్నాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

New York, Nassau Cricket Stadium, Virat Kohli, T20 World Cup 2024: ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసం డేంజరస్‌ పిచ్‌ను రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియాకు విరాట్‌ కోహ్లీనే దిక్కు కానున్నాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

  • Published May 28, 2024 | 1:40 PMUpdated May 28, 2024 | 1:40 PM
IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్‌కు డేంజరస్ పిచ్! ఇక మనకి కోహ్లీనే దిక్కు!

క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్‌ కప్‌ 2024 మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. జూన్‌ 2 నుంచి ఈ మెగా టోర్నీ మొదలుకానుంది. అమెరికా, వెస్టిండీస్‌ సంయుక్త వేదికగా టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే.. ఈ టోర్నీకే హైలెట్‌గా నిలిచే మ్యాచ్‌ ఒకటుంది. అదే ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు ఎదురుచూస్తోంది ఈ మ్యాచ్‌ కోసమే. క్రికెట్‌లో భారత్‌-పాక్‌ జట్లు ఎప్పుడు తలపడినా.. చూసేందుకు క్రికెట్‌ లోకం ఎగబడుతోంది. ఈ దాయాది పోరుకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జూన్‌ 5న ఐర్లాండ్‌తో తమ వరల్డ్‌ కప్‌ వేట మొదలుపెట్టనున్న టీమిండియా.. జూన్‌ 9న పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌ న్యూయార్క్‌లోని నసావు స్టేడియంలో జరగనుంది.

అయితే.. ఈ నసావు క్రికెట్‌ స్టేడియంలోని పిచ్‌ను ఆస్ట్రేలియాకు చెందిన క్యూరేటర్లు తయారు చేశారు. ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లోని ఓవల్‌ గ్రౌండ్‌ క్యూరేటర్లే న్యూయార్క్‌లోని పిచ్‌ను రెడీ చేశారు. అడిలైడ్‌లో సిద్ధం చేసి పిచ్‌ను భారీ నౌకల ద్వారా అమెరికాకు ఎక్స్‌పోర్ట్‌ చేసి.. న్యూయార్క్‌ గ్రౌండ్‌లో ఇన్‌స్టాల్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఆస్ట్రేలియా క్యూరేటర్లు తయారు చేయడంతో.. ఈ పిచ్ కూడా పేస్‌కు అనుకూలంగా ఉంటూ.. బౌన్స్‌ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ పిచ్‌ గురించి ఓవల్‌ పిచ్‌ క్యూరేటర్‌ డామియన్‌ హోవే మాట్లాడుతూ.. ‘వేగం, బౌన్స్‌తో కూడిన పిచ్‌లను నిర్మించడమే మా టార్గెట్‌. అందుకే తగ్గట్లుగానే న్యూయార్క్‌ పిచ్‌ను కూడా నిర్మించాం. ఈ పిచ్‌పై బ్యాటర్లు, బౌలర్ల మధ్య పోటీ మంచి రసవత్తరంగా ఉంటుంది. న్యూయార్క్‌ పిచ్‌లో బౌన్స్‌, స్పీడ్‌ ఉన్నప్పటికీ.. బ్యాటర్లు కూడా మంచి షాట్లు ఆడే అవకాశం ఉంటుంది.

ఇదే పిచ్‌పై ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఉండటంతో.. పాకిస్థాన్‌ బౌలింగ్‌కు, ఇండియా బ్యాటింగ్‌కు పోటీలా మ్యాచ్‌ మారొచ్చు. ఎందుకంటే.. పాకిస్థాన్‌ వద్ద షాహీన్‌ షా అఫ్రిదీ, నసీమ్‌ షా, మొహమ్మద్‌ ఆమీర్‌, హరిస్‌ రౌఫ్‌ లాంటి స్టార్‌ బౌలర్లు ఉన్నారు.. వారి బౌలింగ్‌ శైలికి ఈ పిచ్‌ సరిగ్గా సరిపోతుంది. ఈ పిచ్‌పై వారిని ఎదుర్కొవడం అంతా సులువైన పనికాదు. అలా అని టీమిండియా బ్యాటింగ్‌ పవర్‌ను తక్కువ అంచనా వేయాల్సిన పనిలేదు. బౌన్స్‌ ఉంటే రోహిత్‌ పుల్‌ షాట్లతో రెచ్చిపోతాడు. అలాగే ఎంత స్పీడ్‌గా బాల్‌ వస్తే విరాట్‌ కోహ్లీ అంత అద్భుతంగా బ్యాటింగ్‌ చేస్తాడు. పైగా కోహ్లీకి ఆస్ట్రేలియాలో, ఆస్ట్రేలియాపై మంచి రికార్డ్‌ ఉంది. మరి న్యూయార్క్‌ పిచ్‌ బౌన్స్‌ ఇంక స్పీడ్‌కు అనుకూలంగా ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.