iDreamPost

4.4 ఓవర్లలోనే 90 పరుగులు కొట్టేసిన గంభీర్ టీమ్!

  • Author singhj Published - 09:48 PM, Mon - 21 August 23
  • Author singhj Published - 09:48 PM, Mon - 21 August 23
4.4 ఓవర్లలోనే 90 పరుగులు కొట్టేసిన గంభీర్ టీమ్!

టీ20, టీ10 ఫార్మాట్లు వచ్చాక భారీ స్కోర్లు అనేవి సర్వసాధారణంగా మారిపోయాయి. ఒకప్పుడు 50 ఓవర్లలో 250 పరుగులు కొడితే గొప్ప అనేలా పరిస్థితి ఉండేది. కానీ పొట్టి ఫార్మాట్ వల్ల భారీ స్కోర్లను అలవోకగా బాదేస్తున్నారు బ్యాటర్లు. 20 ఓవర్లలో 200 రన్స్ చేయడం కూడా కామన్​ అయిపోయింది. పిచ్​లు బ్యాటింగ్ ఫ్రెండ్లీగా మారడం, ఒకప్పటిలా భీకర పేసర్లు లేకపోవడం, అధునాతన బ్యాట్లు వచ్చేయడంతో పెద్ద స్కోర్లను ఈజీగా కొట్టేస్తున్నారు. అయితే ఎంత బాదినా పవర్​ప్లేలో 60 నుంచి 70 రన్స్ కొడితే గొప్ప అనే చెప్పాలి. కానీ ఓ మ్యాచ్​లో ఒక జట్టు మాత్రం కేవలం 4.4 ఓవర్లలోనే 90 రన్స్ బాదేసింది.

యూఎస్​ మాస్టర్స్ టీ10 లీగ్​లో న్యూజెర్సీ లెజెండ్స్ టీమ్ కేవలం 4.4 ఓవర్లలోనే 90 రన్స్ చేసి అందర్నీ షాక్​కు గురిచేసింది. వెటరన్ క్రికెటర్లు ఈ టోర్నీలో రెచ్చిపోయి ఆడుతున్నారు. ఆదివారం న్యూయార్క్ వారియర్స్-న్యూజెర్సీ లెజెండ్స్ మధ్య జరిగిన మ్యాచ్​లో ఇరు టీమ్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. వాన కారణంగా ఈ మ్యాచ్​ను 5 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్​కు దిగిన న్యూయార్క్ టీమ్ 2 వికెట్ల నష్టానికి 84 రన్స్ చేసింది. కమ్రాన్ అక్మల్ (27 నాటౌట్), రిచర్డ్ లెవి (16), షాహిద్ అఫ్రిది (37) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో ప్లంకెట్ 2 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత న్యూజెర్సీ లెజెండ్స్ బ్యాటింగ్ చేసింది.

85 పరుగుల భారీ లక్ష్యాన్ని న్యూజెర్సీ బ్యాటర్లు ఉఫ్​మని ఊదేశారు. కేవలం 4.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 90 రన్స్ చేసిందా టీమ్. ఓపెనర్లు జెస్సీ రైడర్​ (38), యూసుఫ్ పఠాన్ (16 నాటౌట్), క్రిస్ బార్న్​వెల్ (28 నాటౌట్) అద్భుతమైన బ్యాటింగ్​తో అదరగొట్టారు. జెస్సీ రైడర్, బార్న్​వెల్ తలో 4 సిక్సులతో ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించారు. ఈ మ్యాచ్​లో గెలిచిన న్యూజెర్సీని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్​ కెప్టెన్​గా ముందుండి నడిపించాడు. ప్రత్యర్థి జట్టు న్యూయార్క్​కు పాక్ మాజీ సారథి మిస్బా ఉల్ హక్ నాయకత్వం వహించాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి