iDreamPost
android-app
ios-app

Saumy Kumar Pandey: అండర్ 19లో Jr. జడేజా.. అచ్చుగుద్దినట్లు అలానే! వీడియో వైరల్

  • Published Feb 05, 2024 | 3:09 PM Updated Updated Feb 05, 2024 | 3:09 PM

అండర్ 19 ప్రపంచ కప్ టీమిండియా జట్టులో జూనియర్ రవీంద్ర జడేజా వెలుగులోకి వచ్చాడు. ఈ యంగ్ ప్లేయర్ సైతం అచ్చుగుద్దినట్లు జడ్డూ భాయ్ లానే బంతులు వేస్తూ.. వికెట్లు పడగొడుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ తన సోషల్ మీడియాలో పంచుకుంది.

అండర్ 19 ప్రపంచ కప్ టీమిండియా జట్టులో జూనియర్ రవీంద్ర జడేజా వెలుగులోకి వచ్చాడు. ఈ యంగ్ ప్లేయర్ సైతం అచ్చుగుద్దినట్లు జడ్డూ భాయ్ లానే బంతులు వేస్తూ.. వికెట్లు పడగొడుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ తన సోషల్ మీడియాలో పంచుకుంది.

  • Published Feb 05, 2024 | 3:09 PMUpdated Feb 05, 2024 | 3:09 PM
Saumy Kumar Pandey: అండర్ 19లో Jr. జడేజా.. అచ్చుగుద్దినట్లు అలానే! వీడియో వైరల్

అండర్ 19 ప్రపంచ కప్ లో యువ టీమిండియా దుమ్మురేపుతోంది. వరుసగా అన్ని మ్యాచ్ ల్లో గెలిచి.. సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇక మంగళవారం(ఫిబ్రవరి 6)న సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్ లో యువ ఆటగాళ్లు సత్తాచాటుతున్నారు. అయితే అండర్ 19 జట్టులో జూనియర్ జడేజా వెలుగులోకి వచ్చాడు. అచ్చం రవీంద్ర జడేజాలనే బంతులను సంధిస్తూ.. వికెట్లు పడగొడుతున్నాడు ఈ చిచ్చర పిడుగు. ఆ జూనియర్ జడేజా పేరు ‘సౌమీ కుమార్ పాండే’. ఇటు జడేజా, అటు సౌమీ కుమార్ పాండే వికెట్లు తీసిన వీడియోను పక్కపక్కన పెట్టి ఐసీసీ ఓ వీడియోను రిలీజ్ చేసింది. దీంతో ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది.

రవీంద్ర జడేజా.. టీమిండియాలో స్టార్ ఆల్ రౌండర్ గా జట్టుకు తిరుగులేని విజయాలను అందించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో గాయపడటంతో.. రెండో టెస్ట్ కు దూరం అయ్యాడు. అయితే మూడో టెస్ట్ కు అందుబాటులోకి వస్తాడా? రాడా? అన్న విషయం తేలాల్సి ఉంది. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. అండర్ 19 వరల్డ్ కప్ లో జూనియర్ రవీంద్ర జడేజా వెలుగులోకి వచ్చాడు. అచ్చుగుద్దినట్లు అదే బౌలింగ్ స్టైల్లో.. అవే బంతులు సంధిస్తూ.. వికెట్లు తీశాడు. జడేజా గతంలో ఎలా వికెట్లు తీశాడో.. సేమ్ అలానే వికెట్లు పడగొట్టాడు సౌమీ కుమార్ పాండే.

ప్రస్తుతం జరుగుతున్న అండర్ 19 వరల్డ్ కప్ లో అద్భుతమైన బౌలింగ్ తో అదరగొడుతూ వికెట్లు తీస్తున్నాడు సౌమీ కుమార్. వీరిద్దరు వికెట్లు తీసిన వీడియోను ఐసీసీ తన సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ వీడియోను చూస్తే.. కచ్చితంగా షాక్ కు గురికావాల్సిందే. సౌమీ కుమార్ డిట్టో జడేజాలాగే బౌలింగ్ చేస్తున్నాడు. బౌలింగ్ స్టైలే కాదు.. జడేజా బంతులు ఎక్కడ వేశాడో.. అక్కడే వేసి సేమ్ టు సేమ్ వికెట్లు కూల్చాడు ఈ కుర్ర బౌలర్. దీంతో అండర్ 19లో జూనియర్ జడేజా అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు నెటిజన్లు. ఫ్యూచర్ లో టీమిండియాకు ఆడటం పక్కా అని, ఇది నమ్మశక్యంగా లేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక అండర్ 19 వరల్డ్ కప్ లో చెలరేగుతున్నాడు సౌమీ కుమార్. బంగ్లాదేశ్ పై 4/19, ఐర్లాండ్ పై 3/21, న్యూజిలాండ్ పై 4/19 వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉండగా.. సౌమీ కుమార్ కోచ్ మాత్రం జడేజాతో పోల్చడాన్ని అంగీకరించడం లేదు. “చాలా మంది సౌమీ కుమార్ ను రవీంద్ర జడేజాతో పోల్చుతున్నారు. దాన్ని నేను అంగీకరించను. ఎందుకంటే? సౌమీ భవిష్యత్ లో ఎంతో సాధించాల్సి ఉంది. పైగా జడేజా లాంటి ఉన్నత స్థాయి ఆటగాడితో పోలిస్తే.. ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉంది. అందుకే దాన్ని నేను సమర్థించను” అంటూ చెప్పుకొచ్చాడు కోచ్. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

ఇదికూడా చదవండి: Shubman Gill: మా నాన్న సెంచరీ చేసినా తిడతాడు, ఎందుకంటే? గిల్ షాకింగ్ కామెంట్స్!

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetgit girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom