వీడియో: కోహ్లీ వారసుడితో పెట్టుకున్న బెయిర్‌స్టో! మాటల యుద్ధం

ఇంగ్లండ్ తో జరుగుతున్న చివరి టెస్ట్ లో బెయిర్ స్టోకు గిల్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో విరాట్ కోహ్లీ వారసత్వన్ని శుబ్ మన్ గిల్ కొనసాగిస్తున్నాడు అంటూ నెటిజన్లు కితాబిస్తున్నారు. అసలేం జరిగిందంటే?

ఇంగ్లండ్ తో జరుగుతున్న చివరి టెస్ట్ లో బెయిర్ స్టోకు గిల్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో విరాట్ కోహ్లీ వారసత్వన్ని శుబ్ మన్ గిల్ కొనసాగిస్తున్నాడు అంటూ నెటిజన్లు కితాబిస్తున్నారు. అసలేం జరిగిందంటే?

ప్రపంచ క్రికెట్ లో అగ్రెసివ్ ఆటకు పెట్టింది పేరు టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ. మైదానంలో ఎంత రఫ్ అండ్ టఫ్ గా ఉంటాడో మనందరికి తెలిసిందే. మంచికి మంచి.. చెడుకు చెడు అన్నది కోహ్లీ సమాధానం. ఇక బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తనను ఎవరైనా స్లెడ్జింగ్ చేస్తే.. బ్యాట్ తోనే కౌంటర్ ఇస్తుంటాడు కింగ్ కోహ్లీ. ప్రత్యర్థి టీమ్ ఆటగాళ్లందరిని ఒక్కడే ఎదుర్కొగల గుండె ధైర్యం విరాట్ సొంతం. అయితే విరాట్ లేని లోటును టీమిండియా యువ క్రికెటర్ శుబ్ మన్ గిల్ తీరుస్తున్నాడు అంటూ సోషల్ మీడియా వేదికగా కితాబిస్తున్నారు నెటిజన్లు. ఇంగ్లండ్ తో జరుగుతున్న చివరి టెస్ట్ లో బెయిర్ స్టోకు గిల్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో అప్పుడు విరాట్ కోహ్లీ, ఇప్పుడు గిల్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు క్రికెట్ లవర్స్.

అది 2022 జులై.. ఇంగ్లండ్ తో ఐదో టెస్ట్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఇంగ్లండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టోకి మధ్య మాటల యుద్ధం జరిగింది. అంపైర్ల జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగిందని అందరూ అనుకున్నారు. కానీ కోహ్లీపై కోపంతో రెచ్చిపోయి ఆడిన బెయిర్ స్టో సెంచరీ చేశాడు. అయితే ఆ వెంటనే 106 పరుగుల వద్ద షమీ బౌలింగ్ లో కోహ్లీకే క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. మరి కోహ్లీ ఊరుకుంటాడా? క్యాచ్ అందుకున్న వెంటనే ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ఆ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఇప్పుడు కోహ్లీ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు యంగ్ ప్లేయర్ శుభ్ మన్ గిల్. వందో టెస్ట్ ఆడుతున్న బెయిర్ స్టో భారత యువ క్రికెటర్లు అయిన జురెల్, గిల్ పై స్లెడ్జింగ్ కు దిగాడు. మరి మన కుర్రాళ్లు ఊరుకుంటారా? బెయిర్ స్టోకు గట్టిగానే ఇచ్చిపడేశాడు శుబ్ మన్ గిల్. నువ్వు ఇక్కడ ఎన్ని సెంచరీలు కొట్టావ్? అంటూ అతడికి దీటైన జవాబు ఇచ్చాడు గిల్. ఈ మాటకు బెయిర్ స్టో బిక్కమెుఖం వేశాడు. నోట్లో నుంచి ఒక్క మాటకూడా బయటకిరాలేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో.. అభిమానులు కోహ్లీని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు గిల్ నీ దూల తీర్చారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

కోహ్లీకి నిజమైన వారసుడివి నువ్వే.. అతడు లేని లోటును తీరుస్తున్నావు అంటూ గిల్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టీమిండియా ఇన్నింగ్స్ 64 పరుగులతేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 218, రెండో ఇన్నింగ్స్ లో 195 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 477 రన్స్ చేసింది. మరి గిల్-బెయిర్ స్టో మధ్య జరిగిన మాటల యుద్ధంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: హ్యాట్సాఫ్ కుల్దీప్.. ఆ విషయంలో ఇంగ్లండ్ బ్యాటర్లు సిగ్గుపడాలి!

Show comments