iDreamPost
android-app
ios-app

Mushfiqur Rahim: బంగ్లాదేశ్​ ను వెంటాడుతున్న కర్మ.. చేసిన తప్పుకు అనుభవించాల్సిందే..!

  • Author Soma Sekhar Published - 09:03 AM, Thu - 7 December 23

న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టులో బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్ రహీం అవుటైన తీరు చూస్తే.. బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ ను కర్మ వెంటాడుతోందన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది.

న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టులో బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్ రహీం అవుటైన తీరు చూస్తే.. బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ ను కర్మ వెంటాడుతోందన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది.

  • Author Soma Sekhar Published - 09:03 AM, Thu - 7 December 23
Mushfiqur Rahim: బంగ్లాదేశ్​ ను వెంటాడుతున్న కర్మ.. చేసిన తప్పుకు అనుభవించాల్సిందే..!

చేసిన తప్పులకు శిక్ష అనుభవించడమే కర్మ ఫలితం. ఈ కర్మ ఫలితం ఎప్పుడు ఏ విధంగ వస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెట్ ను ఈ కర్మ వెంటాడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బంగ్లా ఆటగాళ్లు గతంలో చేసిన తప్పులే నేడు వారిపాలిట విలన్లుగా మారి శిక్షిస్తున్నాయి. తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టులో బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్ రహీం అవుటైన తీరు చూస్తే.. బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ ను కర్మ వెంటాడుతోందన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. మరి బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ గతంలో చేసిన తప్పులు ఏంటో? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలో ఈ జట్టుకు మంచి పేరుంది. వివాదాలకు వెళ్లకుండా తమ ఆటేదో తాము ఆడుకుని వెళ్లే జట్టుగా ప్రపంచ క్రికెట్ లో గుర్తింపు సంపాదించుకుంది. కానీ గత కొద్దికాలంగా ఆ జట్టు చేస్తున్న తప్పిదాలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. ఇలా విమర్శలకు దారి తీయడమే కాకుండా.. వారు చేసిన తప్పులకు శిక్ష కూడా అనుభవించాల్సి వస్తోంది. ఇదే కర్మ ఫలితం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాస్త వెనక్కి వెళితే.. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఓ మ్యాచ్ లో తాను అప్పీల్ చేసినా.. అంపైర్ ఔట్ ఇవ్వలేదని వికెట్లను తన్ని రచ్చరచ్చ చేసిన విషయం మనందరికి తెలిసిందే.

అదీకాక ఇటీవల ముగిసిన వరల్డ్ కప్ లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో లంక బ్యాటర్ మాథ్యూస్ ను టైమ్డ్ అవుట్ ద్వారా బంగ్లాదేశ్ టీమ్ పెవిలియన్ కు పంపించింది. ఇది ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ రెండు సంఘటనల్లో బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ అత్యుత్సాహం చూపింది. ఇప్పుడు ఇదే కర్మ రూపంలో బంగ్లాను వెంటాడుతోంది. ఆ విషయం తాజాగా న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో స్పష్టంగా కనిపించింది. ఈ మ్యాచ్ లో బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్ రహీం కివీస్ బౌలర్ జెమీసన్ వేసిన బాల్ ను డిఫెన్స్ చేశాడు. బాల్ కింద పడి కాస్త దూరంగా వెళ్తోంది. ఈ క్రమంలోనే ముష్పికర్ బాల్ ఎక్కడ వికెట్లను తాకుతుందోనని చేయితో దాన్ని అడ్డుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ టీమ్ అతడు ఔట్ అంటూ అప్పీల్ చేసింది. రిప్లేలో పరిశీలించిన థర్డ్ అంపైర్ అతడు ఉద్దేశపూర్వకంగానే బాల్ ను అడ్డుకున్నట్లు భావించి అబ్​ స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద అతడిని అవుట్ గా ప్రకటించాడు. ఇక ఈ అవుట్ చూసిన నెటిజన్లు గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటూ.. కర్మ ఫలితం అంటే ఇదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి బంగ్లాదేశ్ ను కర్మ ఫలితం వెంటాడుతోందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.