iDreamPost
android-app
ios-app

క్రికెట్ లోకి అడుగుపెట్టి ఏడాది కాకముందే రిటైర్మెంట్ ప్రకటించిన ప్లేయర్!

  • Published Jun 18, 2024 | 8:00 AM Updated Updated Jun 18, 2024 | 8:00 AM

ఓ 35 ఏళ్ల క్రికెటర్ టీ20 వరల్డ్ కప్ లో తమ జట్టు ఓడిపోవడంతో.. క్రికెట్ లోకి అడుగుపెట్టి సంవత్సరం కూడా కాకముందే.. రిటైర్మెంట్ ప్రకటించి అందర్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

ఓ 35 ఏళ్ల క్రికెటర్ టీ20 వరల్డ్ కప్ లో తమ జట్టు ఓడిపోవడంతో.. క్రికెట్ లోకి అడుగుపెట్టి సంవత్సరం కూడా కాకముందే.. రిటైర్మెంట్ ప్రకటించి అందర్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

క్రికెట్ లోకి అడుగుపెట్టి ఏడాది కాకముందే రిటైర్మెంట్ ప్రకటించిన ప్లేయర్!

సాధారణంగా క్రికెటర్లు 10 లేదా 20 సంవత్సరాలు ఆడిన తర్వాత తమ ప్రొఫెషనల్ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతూ ఉంటారు. అయితే కొందరు మాత్రం గాయాలు, పూర్ ఫామ్ తో ఇబ్బందులు పడుతూ.. ఇక ఆటను కొనసాగించడం కష్టమని రిటైర్మెంట్ ప్రకటిస్తారు. మరికొందరు వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో తమ జట్టు ఓడిపోయిన బాధతో కెరీర్ కు గుడ్ బై చెబుతారు. తాజాగా ఓ 35 ఏళ్ల క్రికెటర్ టీ20 వరల్డ్ కప్ లో తమ జట్టు ఓడిపోవడంతో.. క్రికెట్ లోకి అడుగుపెట్టి సంవత్సరం కూడా కాకముందే.. రిటైర్మెంట్ ప్రకటించి అందర్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు నెదర్లాండ్స్ వెటరన్ ప్లేయర్ సిబ్రాండ్ ఎంగెల్ బ్రెచ్. రాయల్ డచ్ క్రికెట్ అసోషియేషన్ ఇందుకు సంబంధించి ఓ ప్రకటనను విడుదల చేసింది. అయితే సిబ్రాండ్ క్రికెట్ లోకి అడుగుపెట్టి పట్టుమని సంవత్సరం కూడా అవ్వట్లేదు. ఇంతలోనే తన కెరీర్ కు ముగింపు పలికి ప్రపంచ క్రికెట్ ను షాక్ కు గురిచేశాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో శ్రీలంక చేతిలో నెదర్లాండ్స్ ఓడిపోయిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తమ టీమ్ వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిందన్న బాధలోనే అతడు ఆటకు వీడ్కోలు పలికినట్లు తెలుస్తోంది.

సౌతాఫ్రికాలో జన్మించిన సిబ్రాండ్.. ఆ దేశం తరఫున అండర్ 19 వరల్డ్ కప్ 2008లో పాల్గొన్నాడు. ఈ టోర్నీలో విరాట్ కోహ్లీ ఇచ్చిన క్యాచ్ ను కళ్లు చెదిరే రీతిలో అందుకుని టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. ఈ తర్వాత ప్రోటీస్ దేశవాళీ క్రికెట్ లో కొన్ని ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించాడు. ఉద్యోగం కోసం 2021లో నెదర్లాండ్స్ కు మకాం మర్చాడు సిబ్రాండ్. అక్కడ క్లబ్ క్రికెట్ ఆడి.. జాతీయ జట్టుకు ఎంపికైయ్యాడు. ఈ క్రమంలోనే 2023 వరల్డ్ కప్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు ఈ ఆల్ రౌండర్. తన కెరీర్ లో 12 వన్డేలు ఆడి 385 పరుగులు, 12 టీ20లు ఆడి 280 రన్స్ చేశాడు. బౌలింగ్ లో టీ20ల్లో 5 వికెట్లు పడగొట్టాడు. మరి క్రికెట్ లోకి అడుగుపెట్టి సంవత్సరం కాకముందే.. నెదర్లాండ్స్ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.