టీమిండియాలో ఆ ఇద్దరే నా ఫేవరెట్! నేపాల్ నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

  • Author Soma Sekhar Published - 05:18 PM, Mon - 4 September 23
  • Author Soma Sekhar Published - 05:18 PM, Mon - 4 September 23
టీమిండియాలో ఆ ఇద్దరే నా ఫేవరెట్! నేపాల్ నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

టీమిండియా క్రికెటర్లకు ఇండియాతో పాటుగా వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు. తమ అభిమానాన్ని సందర్భం వచ్చినప్పుడు వెల్లడిస్తుంటారు. ప్రస్తుతం టీమిండియా ఆసియా కప్ లో భాగంగా శ్రీలంక లో పర్యటిస్తోంది. ఇక టోర్నీలో తన తొలి మ్యాచ్ ను పాక్ తో ఆడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయినప్పటికీ.. టీమిండియా ఆటగాళ్లపై ఉన్న ప్రేమను తెలియపరిచింది ఓ పాక్ యువతి. కోహ్లీ వీరాభిమాని అయిన ఆ యువతి విరాట్ తక్కువ పరుగులకే ఔట్ కావడంతో గుండెలు పగిలాయి అని చెప్పుకొచ్చింది ఆ యువతి. తాజాగా టీమిండియా ఆటగాళ్లపై ఉన్న అభిమానాన్ని వ్యక్త పరిచింది నేపాల్ నటి. టీమిండియాలో ఆ ఇద్దరంటే ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది నేపాలీ నటి బర్షా శివకోటి.

టీమిండియా ఆటగాళ్లకు వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు. దాయాది దేశమైన పాకిస్థాన్ లో సైతం భారత ఆటగాళ్లకు అభిమానులు ఉన్నారు. మరీ ముఖ్యంగా టీమిండియా రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ లో ముందుంటాడు. పాక్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ 4 పరుగులకే అవుట్ కావడంతో ఓ పాక్ అభిమాని కన్నీరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ఇండియా-నేపాల్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లలో ఆ ఇద్దరంటే ఇష్టమని చెప్పుకొచ్చింది నేపాలీ నటి బర్షా శివకోటి. నేపాలీలో ఈమె ప్రముఖ సినీ నటి. తనదైన నటన, అందంతో అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆసియా కప్ లో భాగంగా నేపాల్ తో టీమిండియా తలపడుతున్న సందర్భంగా ఓ స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడుతూ..”టీమిండియాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ నా ఫేవరెట్ క్రికెటర్లు” అంటూ చెప్పుకొచ్చింది బర్షా శివకోటి. దీంతో విరాట్ ఖాతాలో మరో విదేశీ నటి వచ్చి చేరినట్లు అయ్యింది. ఇప్పటికే వీరిద్దరికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రోహిత్ కు ఫీల్డర్లు షాకిచ్చారు. తొలి 4 ఓవర్లలో 3 క్యాచ్ లు మిస్ చేసి చెత్త ఫీల్డింగ్ అనిపించుకున్నారు. దీంతో రెచ్చిపోయిన ఆడిన నేపాల్ ఓపెనర్లు తొలి వికెట్ కు అర్దశతకం భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. శార్దూల్ ఠాకూర్ టీమిండియాకు బ్రేక్ ఇవ్వడంతో.. కొంత ఉపశమనం లభించింది. ప్రస్తుతం టీమిండియా బౌలర్లు విజృంభిస్తున్నారు. 24 ఓవర్లు ముగిసే సరికి నేపాల్ జట్టు 4 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది.

Show comments