iDreamPost
android-app
ios-app

Naveen Ul Haq: పాపం.. కోహ్లీ లేకపోయినా కుర్రాళ్లు వదల్లేదు! నవీన్‌ని ఊతికి ఆరేశారుగా..

  • Published Jan 12, 2024 | 12:22 PM Updated Updated Jan 12, 2024 | 12:22 PM

ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ ఆడలేదు. ఆడి ఉంటే.. నవీన్‌ ఉల్‌ హక్‌-కోహ్లీ మధ్య ఫ్రెండ్లీ వార్‌ను చేసే అవకాశం దక్కేది. అయితే.. కోహ్లీ లేకపోయినా నవీన్‌ను కుర్రాళ్లు కుమ్మేశారు.

ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ ఆడలేదు. ఆడి ఉంటే.. నవీన్‌ ఉల్‌ హక్‌-కోహ్లీ మధ్య ఫ్రెండ్లీ వార్‌ను చేసే అవకాశం దక్కేది. అయితే.. కోహ్లీ లేకపోయినా నవీన్‌ను కుర్రాళ్లు కుమ్మేశారు.

  • Published Jan 12, 2024 | 12:22 PMUpdated Jan 12, 2024 | 12:22 PM
Naveen Ul Haq: పాపం.. కోహ్లీ లేకపోయినా కుర్రాళ్లు వదల్లేదు! నవీన్‌ని ఊతికి ఆరేశారుగా..

మొహాలీ వేదికగా గురువారం ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. చాలా కాలం తర్వాత రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ టీ20 క్రికెట్‌ ఆడుతుండటంతో ఈ సిరీస్‌పై క్రికెట్‌ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో అద్భుత ప్రదర్శన కనబర్చిన టీమిండియా.. ఒక్క మ్యాచ్‌ ఓటమితో కప్పును చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఆ ఓటమి తర్వాత.. జట్టులోని సీనియర్‌ స్టార్‌ ఆటగాళ్లు రోహిత్‌, కోహ్లీ టీ20 క్రికెట్‌లో కొనసాగుతారా? లేదా? టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ఆడతారా లేదా అనే అనుమానాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఆఫ్ఘాన్‌తో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు రోహిత్‌, కోహ్లీని ఎంపిక చేయడంతో క్రికెట్‌ అభిమానులు ఎంతో సంతోషించారు.
అయితే.. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బరిలోకి దిగినా.. విరాట్‌ కోహ్లీ మాత్రం వ్యక్తిగత కారణాలతో తొలి మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. కానీ, రెండో టీ20లో కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ ఆటను చూద్దాం అనుకున్న క్రికెట్‌ ఫ్యాన్స్‌కు నిరాశ మిగిలింది. రోహిత్‌-గిల్‌ మధ్య మిస్‌ అండర్‌స్టాండింగ్‌తో రోహిత్‌ రనౌట్‌ అయ్యాడు. పరుగులేమీ చేయకుండా అవుట్‌ కావడంతో రోహిత్‌ తీవ్ర అసహనానికి గురయ్యాడు. గ్రౌండ్‌లోనే గిల్‌పై కోపం వ్యక్తం చేశాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఆడి ఉంటే.. ఆఫ్ఘాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ నవీన్‌ ఉల్‌ హక్‌ మధ్య వార్‌ను క్రికెట్‌ అభిమానులు ఎంజాయ్‌ చేసేవారు. ఐపీఎల్‌ 2023లో కోహ్లీ-నవీన్‌ మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే.
Even without Kohli, the boys did not give up
ఆ తర్వాత వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో వీరిద్దరూ ఫ్రెండ్స్‌ కూడా అయిపోయారు. అయినా కూడా నవీన్‌ బౌలింగ్‌లో కోహ్లీ పరుగులు చేస్తే ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతారు. కానీ, కోహ్లీ ఆడకపోవడంతో ఫ్యాన్స్‌ ఆ ఫీస్ట్‌ను మిస్‌ అయ్యారు. కానీ, కోహ్లీ లేకపోయినా టీమిండియా యంగస్టర్స్‌ మాత్రం నవీన్‌ ఉల్‌ హక్‌ను ఉతికి ఆరేశాడు. ముఖ్యంగా శివమ్‌ దూబే అయితే నవీన్‌ బౌలింగ్‌లో 98 మీటర్ల భారీ సిక్స్‌ బాదాడు. ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన నవీన్‌ను తిలక్‌ వర్మ ఓ ఆటాడుకున్నాడు. రెండో బాల్‌కే భారీ సిక్స్‌ కొట్టాడు. ఓవర్‌ చివరి బాల్‌కు శివమ్‌ ఫోర్‌ బాదాడు. మొత్తం నవీన్‌ తన తొలి ఓవర్‌లో 14 పరుగులు సమర్పించుకున్నాడు. తన రెండో ఓవర్‌లో జితేష్‌ శర్మ ఒక ఫోర్‌కొట్టి మొత్తం 9 పరుగులు రాబట్టాడు.
మళ్లీ తిరిగి 16వ ఓవర్‌ వేసిన నవీన్‌ మళ్లీ 9 పరుగులు సమర్పించుకున్నాడు. మళ్లీ శివమ్‌ దూబే తొలి బంతికే ఫోర్‌ బాదాడు. ఇక చివరగా ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ వేసేందుకు వచ్చిన నవీన్‌ను దూబే చితక్కొట్టాడు. టీమిండియా విజయానికి 11 రన్స్ కావాల్సిన టైమ్‌లో రింకూ సింగ్‌ తొలి బంతికి సింగిల్‌ తీసి ఇచ్చాడు.. రెండో బంతికి శివమ్‌ దూబే స్ట్రైట్‌గా భారీ సిక్స్‌ బాదాడు. ఆ సిక్స్‌ ఏకంగా 98 మీటర్ల దూరం వెళ్లి పడింది. మూడో బంతికి ఇంకో ఫోర్‌ బాది మ్యాచ్‌ను ముగించాడు. ఇలా నవీన్‌ను టీమిండియా కుర్రాళ్లు పిచ్చికొట్టాడు కొట్టారు. 3.3 ఓవర్లలో నవీన్‌ ఏకంగా 43 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్కటంటే ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేకపోయాడు. ఇలా కోహ్లీ లేకపోయినా.. నవీన్‌ను టీమిండియా కుర్రాళ్లు  కుమ్మేశారంటూ క్రికెట్‌ అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.