iDreamPost
android-app
ios-app

నవీన్‌ ఉల్‌ హక్‌.. 24 ఏళ్లకే రిటైర్మెంట్‌ ప్రకటించడానికి కారణం?

  • Published Nov 11, 2023 | 2:37 PM Updated Updated Nov 12, 2023 | 4:13 PM

ఆఫ్ఘనిస్థాన్‌ స్టార్‌ బౌలర్‌ నవీన్‌ ఉల్‌ హక్‌.. తన చివరి వన్డే మ్యాచ్‌ ఆడేశాడు. కేవలం 24 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు అతను రిటైర్మెంట్‌ ప్రకటించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి అతని రిటైర్మెంట్‌ వెనుక ఉన్న అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆఫ్ఘనిస్థాన్‌ స్టార్‌ బౌలర్‌ నవీన్‌ ఉల్‌ హక్‌.. తన చివరి వన్డే మ్యాచ్‌ ఆడేశాడు. కేవలం 24 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు అతను రిటైర్మెంట్‌ ప్రకటించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి అతని రిటైర్మెంట్‌ వెనుక ఉన్న అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Nov 11, 2023 | 2:37 PMUpdated Nov 12, 2023 | 4:13 PM
నవీన్‌ ఉల్‌ హక్‌.. 24 ఏళ్లకే రిటైర్మెంట్‌ ప్రకటించడానికి కారణం?

ఈ వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో ఆఫ్ఘనిస్థాన్‌ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. పసికూనకు ఎంట్రీ ఇచ్చిన ఆఫ్ఘాన్‌.. ఏకంగా ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌, నెదర్లాండ్స్‌, శ్రీలంక జట్లను ఓడించింది. ఆస్ట్రేలియాను సైతం దాదాపు ఓడించే పని చేసింది. మొత్తం మీద 9 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో టోర్నీని ముగించి క్రికెట్‌ అభిమానుల ప్రశంసలు అందుకుంది. అయితే.. ఆ జట్టులో ఏ ఒక్కరో ఇద్దరో కాకుండా జట్టులోని ప్రతి ఆటగాడు మంచి ప్రదర్శన చేయడంతోనే ఇది సాధ్యమైంది. అందులో ఒకడే నవీన్‌ ఉల్‌ హక్‌. అయితే.. వరల్డ్‌ కప్‌లో శుక్రవారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌తో తన కెరీర్‌లో చివరి వన్డే మ్యాచ్‌ ఆడేశాడు. అదేంటి.. 24 ఏళ్ల యంగ్‌ క్రికెటర్‌ అప్పుడు తన కెరీర్‌కు వీడ్కోలు చెప్పడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? నిజం నవీన్‌ ఉల్‌ హక్‌ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. వరల్డ్‌ కప్‌ కంటే ముందే.. ఈ వరల్డ్‌ కప్‌ తర్వాత వన్డే క్రికెట్‌ ఆడనని ప్రకటించాడు.

దీంతో.. ఈ మెగా టోర్నీలో ఆఫ్ఘానిస్థాన్‌ సెమీస్‌ చేరకపోవడంతో సౌతాఫ్రికాతో జరిగిన చివరి లీగ్‌ మ్యాచే నవీన్‌ వన్డే కెరీర్‌కు చివరి మ్యాచ్‌ అయింది. తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని టోర్నీ ఆరంభానికి ముందే నవీన్‌ ప్రకటించినా.. వరల్డ్‌ కప్‌లో ఆఫ్ఘాన్‌ మంచి ప్రదర్శన చేయడం, నవీన్‌ కూడా అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో అతని రిటైర్మెంట్‌పై మరోసారి చర్చ మొదలైంది. కేవలం 24 ఏళ్ల వయసుకే మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో ఎందుకు రిటైర్మెంట్‌ ప్రకటించడం అని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కానీ, నవీన్ మాత్రం వేరేలా ఆలోచిస్తున్నాడు. 2024లో టీ20 వరల్డ్‌ కప్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఆ వరల్డ్‌ కప్‌లో మరింత మంచి ప్రదర్శన ఇవ్వాలని, టీ20 క్రికెట్‌తో పాటు, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న టీ20 లీగ్స్‌కు ఎక్కువ టైమ్‌ కేటాయించేందుకు తాను వన్డే ఫార్మాట్‌ నుంచి రిటైర్‌ అవుతున్నట్లు వెల్లడించాడు. మొత్తం 15 వన్డేలు మాత్రమే ఆడిన నవీన్‌ 22 వికెట్లు తీశాడు. అలాగే 37 రన్స్‌ చేశాడు.

ఆఫ్ఘనిస్థాన్‌ టీమ్‌ వన్డేల్లో కంటే టీ20 క్రికెట్‌లో మరింత డేంజరస్‌ టీమ్‌గా ఉంది. అందుకే రానున్న టీ20 వరల్డ్‌ కప్‌లో మరింత మంచి ప్రదర్శన కనబర్చి.. అద్భుతాలు చేయాలని ఆ జట్టులోని ఆటగాళ్లంతా గట్టి పట్టుదలతో ఉన్నారు. ఆ వరల్డ్‌ కప్‌కు ఇంకా ఏడాది సమయం ఉన్నా. ఇప్పటి నుంచే సన్నాహకాలు మొదలుపెట్టేశారు. నవీన్‌ సైతం అందుకే టీ20 క్రికెట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో.. వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. కానీ, ఐపీఎల్‌ లాంటి టోర్నీల్లో ఎక్కువగా ఆడేందుకు, డబ్బు సంపాదించేందుకే నవీన్‌ వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించాడనే విమర్శ కూడా ఉంది.

కాగా, నవీన్‌ ఉల్‌ హక్‌ అనగానే చాలా మందికి విరాట్‌ కోహ్లీనే గుర్తుకు వస్తాడు. ఐపీఎల్‌ 2023 సందర్భంగా వీళ్లిద్దరి మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. కానీ, ఈ వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో భారత్‌-ఆఫ్ఘాన్‌ మధ్య సందర్భంగా నవీన్‌ వచ్చి కోహ్లీతో నవ్వుతూ మాట్లాడటం, నవీన్‌ను వేధిస్తున్న ఫ్యాన్స్‌కు అలా చేయవద్దని కోహ్లీ చెప్పడంతో వివాదం ముగిసింది. కోహ్లీ వార్నింగ్‌ ఇవ్వడంతో.. అప్పటి వరకు నవీన్‌ను ట్రోల్‌ చేసిన కోహ్లీ ఫ్యాన్స్‌ ఆ తర్వాత అతన్ని సపోర్ట్‌ చేయడం మొదలుపెట్టారు. కోహ్లీ-నవీన్‌ విషయం పక్కనపెడితే.. నవీన్‌ ఉల్‌ హక్‌ 24 ఏళ్ల వయసుకే వన్డే క్రికెట్‌ వదిలేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.