iDreamPost
android-app
ios-app

Ashes 2023: నాథన్ లియాన్ నయా రికార్డు.. ఈ జాబితాలో ఉన్న ఏకైక భారత ఆటగాడు ఎవరంటే?

  • Author Soma Sekhar Published - 01:57 PM, Thu - 29 June 23
  • Author Soma Sekhar Published - 01:57 PM, Thu - 29 June 23
Ashes 2023: నాథన్ లియాన్ నయా రికార్డు.. ఈ జాబితాలో ఉన్న ఏకైక భారత ఆటగాడు ఎవరంటే?

ప్రపంచ క్రికెట్లో ఎన్నో రికార్డులు నమోదు అవుతూ ఉంటాయి. కానీ కొన్ని రికార్డులు మాత్రం చాలా అరుదుగా నెలకొల్పబడుతుంటాయి. అలాంటి అరుదైన ఘనతనే సాధించాడు ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్. యాషెస్ సిరీస్ లో భాగంగా.. ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు స్టార్ స్పిన్నర్. ఇక లియాన్ సాధించిన రికార్డు జాబితాలో టీమిండియా నుంచి ఒకే ఒక్క బ్యాటర్ ఉండటం విశేషం. మరి లియాన్ సాధించిన రికార్డు ఏంటి? ఈ లిస్ట్ లో ఉన్న ఒకేఒక్క టీమిండియా బ్యాటర్ ఎవరో? ఇప్పుడు తెలుసుకుందాం.

యాషెస్ సమరంలో భాగంగా.. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ ప్రారంభం అయ్యింది. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ తో ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్ అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఈ రికార్డుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. అంతర్జాతీయ క్రికెట్ లో వరుసగా 100 టెస్టులు ఆడిన ఏకైక బౌలర్ గా లియాన్ రికార్డు నెలకొల్పాడు. మెుత్తంగా ఇలా వరుసగా 100 టెస్టులు ఆడిన ప్లేయర్ల జాబితాలో ఆరో ఆటగాడిగా లియాన్ నిలిచాడు.

అయితే తొలుత ఈ ఘనత సాధించిన ఐదుగురు బ్యాటర్లు కావడం విశేషం. ఇక ఈ జాబితాలో వరుసగా 159 టెస్టులు ఆడి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్. రెండో స్థానంలో 153 టెస్టులతో అలన్ బోర్డర్, 107 టెస్టులతో మార్క్ వా, 106 టెస్టులతో టీమిండియా నుంచి ఏకైక ప్లేయర్ గా సునీల్ గవాస్కర్ ఉన్నాడు. ఐదవ స్థానంలో 101 టెస్ట్ మ్యాచ్ లు వరుసగా ఆడిన బ్రెండన్ మెకల్లమ్ ఉన్నాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. జట్టులో వార్నర్ (66), లబూషేన్ (47), స్టీవ్ స్మిత్ (85*) ట్రావిస్ హెడ్ (77) పరుగులతో రాణించారు. అలెక్స్ కేరి 11 పరుగులతో స్మిత్ తో క్రీజ్ లో ఉన్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్, జో రూట్ చెరో రెండు వికెట్లు తీశారు. స్టీవ్ స్మిత్ క్రీజ్ లో ఉండటంతో.. ఆసీస్ భారీ స్కోర్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.