iDreamPost
android-app
ios-app

Hardik Pandya: కొడుకును హార్దిక్ ఇంటికి పంపించిన నటాషా.. ఫొటో వైరల్!

  • Published Sep 04, 2024 | 3:59 PM Updated Updated Sep 04, 2024 | 3:59 PM

Natasha Stankovic drop her son Agastya to Hardik Pandya house: సెర్బియా నుంచి ముంబై చేరుకున్న నటాషా స్టాంకోవిక్.. తన కొడుకు అగస్త్యను హార్దిక్ ఇంటికి పంపించింది. ఇందుకు సంబంధించి ఫోటో వైరల్ గా మారింది.

Natasha Stankovic drop her son Agastya to Hardik Pandya house: సెర్బియా నుంచి ముంబై చేరుకున్న నటాషా స్టాంకోవిక్.. తన కొడుకు అగస్త్యను హార్దిక్ ఇంటికి పంపించింది. ఇందుకు సంబంధించి ఫోటో వైరల్ గా మారింది.

  • Published Sep 04, 2024 | 3:59 PMUpdated Sep 04, 2024 | 3:59 PM
Hardik Pandya: కొడుకును హార్దిక్ ఇంటికి పంపించిన నటాషా.. ఫొటో వైరల్!

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇటీవలే తన భార్య నటాషా స్టాంకోవిక్ కు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఆమె తన కొడుకును తీసుకుని సెర్బియా దేశానికి వెళ్లిపోయింది. తాము ఇద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని, కొడుకు అగస్త్యకి మాత్రం ఇద్దరం తల్లిదండ్రులుగా కొనసాగుతామని విడిపోయే సందర్భంలో ప్రకటించారు. అయితే తాజాగా నటాషా కొడుకుతో కలిసి ముంబై చేరుకుంది. కొడుకును హార్దిక్ ఇంటికి పంపించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పాండ్యా వదిన కృనాల్ పాండ్యా భార్య ఫంఖురి శర్మ తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన స్టోరీ వైరల్ గా మారింది.

హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా కొడుకు అగస్త్యను తండ్రి ఇంటికి పించించినట్లు తెలుస్తోంది. తాజాగా సెర్బియా నుంచి ముంబై చేరుకున్న నటాషా కొడుకును హార్దిక్ ఇంటికి పింపించింది. ఈ మేరకు కృనాల్ పాండ్యా భార్య పంఖురి శర్మ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ ను షేర్ చేసింది. అందులో.. తన కొడుకు కవిర్ తో కలిసి అగస్త్యకు కథలు చెబుతున్నాను అంటూ ఆ పోస్ట్ లో రాసుకొచ్చింది. ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది. అయితే అగస్త్యను ఇక్కడ ఎందుకు  వదిలేసిందా? అని అందరి డౌట్. మళ్లీ కొన్ని రోజుల తర్వాత తనతో పాటుగా తీసుకెళ్తుందేమో అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Hardik pandya

కాగా.. గత కొంత కాలంగా హార్దిక్ పాండ్యా తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. కెరీర్ పరంగానూ, ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. టీ20లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో అందరూ పాండ్యా కెప్టెన్ అవుతాడని భావించారు. కానీ అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్ ను ఈ ఫార్మాట్ కు కెప్టెన్ గా నియమించడంతో పాటుగా పాండ్యాను వైస్ కెప్టెన్ బాధ్యతల నుంచి కూడా తొలగించి షాకిచ్చింది. అదీకాక డేటింగ్ రూమర్లతో ప్రతిరోజు వార్తల్లో నిలుస్తున్నాడు పాండ్యా. బ్రిటీష్ సింగర్ జాస్మిన్ వాలియాతో డేటింగ్ లో ఉన్నట్లు న్యూస్ వైరల్ గా మారింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet