iDreamPost
android-app
ios-app

రోహిత్​ను కాపీ కొట్టిన బంగ్లాదేశ్ కెప్టెన్.. ఓవరాక్షన్​తో పరువు తీసుకున్నాడు!

  • Published Sep 04, 2024 | 3:02 PM Updated Updated Sep 04, 2024 | 3:02 PM

Rohit Sharma, Nazmul Hossain Shanto, PAK vs BAN: బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షంటో మరోమారు వార్తల్లో నిలిచాడు. పాకిస్థాన్​పై చారిత్రాత్మక సిరీస్ విజయం తర్వాత అతడు సెలబ్రేట్ చేసుకున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీమిండియా కెప్టెన్ రోహిత్​ శర్మను అతడు కాపీ కొట్టాడు.

Rohit Sharma, Nazmul Hossain Shanto, PAK vs BAN: బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షంటో మరోమారు వార్తల్లో నిలిచాడు. పాకిస్థాన్​పై చారిత్రాత్మక సిరీస్ విజయం తర్వాత అతడు సెలబ్రేట్ చేసుకున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీమిండియా కెప్టెన్ రోహిత్​ శర్మను అతడు కాపీ కొట్టాడు.

  • Published Sep 04, 2024 | 3:02 PMUpdated Sep 04, 2024 | 3:02 PM
రోహిత్​ను కాపీ కొట్టిన బంగ్లాదేశ్ కెప్టెన్.. ఓవరాక్షన్​తో పరువు తీసుకున్నాడు!

బంగ్లాదేశ్ జట్టు అనుకున్నది సాధించింది. పాకిస్థాన్​తో తాడోపేడో తేల్చుకుంటామంటూ టెస్ట్ సిరీస్ ఆరంభానికి ముందు చెప్పిన ఆ జట్టు తాము అనుకున్నది చేసి చూపించింది. వరుసగా రెండు టెస్టుల్లో పాక్​ను చిత్తు చేసి సిరీస్​ను 2-0తో క్లీన్​స్వీప్ చేసింది. బంగ్లానే కదా ఈజీగా గెలిచేస్తామని లైట్ తీసుకున్న ఆతిథ్య జట్టు బొక్కబోర్లా పడింది. నిన్న ముగిసిన రెండో టెస్టులో పర్యాటక జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గి పాక్​ను వాళ్ల సొంతగడ్డపై వైట్​వాష్ చేయడం సంచలనంగా మారింది. బంగ్లా విక్టరీని ప్లేయర్లు, అభిమానులు ఫుల్​గా సెలబ్రేట్ చేసుకున్నారు. మ్యాచ్ గెలవగానే వాళ్ల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. ఒకర్నొకరు హగ్ చేసుకొని సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే వీళ్లందరి కంటే బంగ్లా సారథి నజ్ముల్ హొస్సేన్ షంటో సెలబ్రేట్ చేసుకున్న తీరు చర్చనీయాంశంగా మారింది.

పాక్​పై సిరీస్ నెగ్గడంతో సంతోషాన్ని తట్టుకోలేకపోయాడు బంగ్లా కెప్టెన్ నజ్ముల్ షంటో. గెలిచిన ట్రోఫీని విడిచి ఉండలేకపోయాడు. నిద్రపోయే సమయంలో కూడా ట్రోఫీని పక్కనే పెట్టి పడుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి ఇలాంటి సెలబ్రేషన్ స్టార్ట్ అయింది. వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 వరల్డ్ కప్-2024ను భారత్ నెగ్గిన సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత రాత్రి కప్పును ఇలా పక్కన పెట్టుకునే పడుకున్నాడు హిట్​మ్యాన్. దీనికి సంబంధించిన ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాను షేక్ చేశాయి. తాజాగా నజ్ముల్ షంటో రోహిత్​ను కాపీ చేస్తూ అదే మాదిరిగా ట్రోఫీని పక్కనే పెట్టుకొని పడుకోవడంతో ఈ సెలబ్రేషన్ గురించి అందరూ మళ్లీ మాట్లాడుకుంటున్నారు.

బంగ్లా కెప్టెన్ ట్రోఫీని పక్కన పెట్టుకొని నిద్రలోకి జారుకున్న ఫొటోలపై నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. రోహిత్​ను కాపీ కొట్టి షంటో పరువు తీసుకున్నాడని అంటున్నారు. వరల్డ్ కప్ ఎక్కడ? పాక్​పై గెలిచిన ట్రోఫీ ఎక్కడ? రెండూ సమానమేనా అని క్వశ్చన్ చేస్తున్నారు. నెక్స్ట్ టీమిండియాతో సిరీస్ ఉన్నందున ఇలా హిట్​మ్యాన్​ను ఇమిటేట్ చేసి రెచ్చగొడుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. భారత్​తో సిరీస్​కు రెడీగా ఉన్నాం.. పక్కా ఓడిస్తామంటూ షంటో నిన్న వార్నింగ్ ఇచ్చాడని, ఇప్పుడు రోహిత్ సెలబ్రేషన్​ను కాపీ చేసి మరోసారి గెలికాడని అంటున్నారు. ఆ టీమ్​తో పాటు షంటోకు భారత జట్టు నుంచి బడితపూజ తప్పదని.. వాయించి వదలడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. ఐసీసీ ట్రోఫీ లేదా ఆసియా కప్ లాంటిది గెలిచి సంబురాలు చేసుకుంటే ఏమో అనుకోవచ్చు.. పాక్​పై విజయానికి ఇంత ఓవరాక్షన్ అవసరమా? అనవసరంగా పరువు తీసుకున్నారని నెటిజన్స్ చెబుతున్నారు. మరి.. బంగ్లా సారథి ట్రోఫీని పక్కనే పెట్టుకొని నిద్రపోవడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet