iDreamPost
android-app
ios-app

విడాకుల రూమర్స్‌.. వరల్డ్‌ కప్‌ విజయం తర్వాత నటాషా తొలి ట్వీట్‌!

  • Published Jul 05, 2024 | 5:37 PM Updated Updated Jul 05, 2024 | 5:37 PM

Natasa Stankovic, Hardik Pandya: టీమిండియా క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్‌ నుంచి విడిపోతున్నట్లు రూమర్స్ వైరల్ అయ్యాయి. నటాషా తన ఇన్‌స్టా అకౌంట్ లో పాండ్యతో కలిసి ఉన్న కొన్ని ఫొటోలను డిలీట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్టు చేసింది.

Natasa Stankovic, Hardik Pandya: టీమిండియా క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్‌ నుంచి విడిపోతున్నట్లు రూమర్స్ వైరల్ అయ్యాయి. నటాషా తన ఇన్‌స్టా అకౌంట్ లో పాండ్యతో కలిసి ఉన్న కొన్ని ఫొటోలను డిలీట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్టు చేసింది.

  • Published Jul 05, 2024 | 5:37 PMUpdated Jul 05, 2024 | 5:37 PM
విడాకుల రూమర్స్‌.. వరల్డ్‌ కప్‌ విజయం తర్వాత నటాషా తొలి ట్వీట్‌!

భారత్ క్రికెట్ టీమ్ టీ-20 వరల్డ్ కప్ సాధించడంతో…. టీమిండియా ప్లేయర్లపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంలు అందుతున్నాయి. అంతేకాక వరల్డ్ కప్ తో గురువారం టీమిండియా స్వదేశంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా భారత్ క్రికెటర్లకు ఘన స్వాగతం పలికారు. ప్లేయర్లపై పూల వర్షం కురిపిస్తూ తమ ప్రేమను చాటుకున్నారు అభిమానులు. ఇక ముంబైలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో దాదాపు మూడు లక్షల మంది క్రికెట్ అభిమానులు పాల్గొన్నారు. ఇది ఇలా ఉంటే.. భారత్ వరల్డ్ కప్ విజయంలో ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసింది. ఇలా వరల్డ కప్ గెలిచిన తరువాత తొలిసారి ఆయన భార్య నటాషా ఈ సంచలన ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కొద్ది రోజుల నుంచి టీమిండియా క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్‌ నుంచి విడిపోతున్నట్లు రూమర్స్ వైరల్ అయ్యాయి. గతంలో నటాషా తన ఇన్‌స్టా అకౌంట్ లో పాండ్యతో కలిసి ఉన్న కొన్ని ఫొటోలను డిలీట్ చేసింది. కేవలం కుమారుడితో ఇద్దరూ ఉన్న చిత్రాలను మాత్రమే ఉంచింది. దీంతో పాండ్యా, నటాషా విడాకులు తీసుకోనున్నారు అనే రూమర్స్ ప్రారంభమయ్యాయి. అంతేకాకా పాండ్యా, నటాషా మధ్య కొన్ని వివాదాలు కూడా చోటుచేసుకున్నాయి. ఇలా వివాదాలు కొనసాగుతుండగానే అమెరికాలో జరిగిన టీ-20 వరల్డ్ కప్ కు హర్ధిక్ పాండ్యా వెళ్లాడు. అక్కడ తన అద్భుతమైన ఆట ప్రదర్శనతో భారత్ వరల్డ్ కప్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఇది ఇలా ఉంటే.. భారత్ ప్రపంచ కప్ గెలిచిన తరువాత పాండ్యా భార్య నటాషా తొలిసారి

సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. జీవితంలో కొన్ని సమయాల్లో మనం ఒంటరిగా ఉంటామని నిరుత్సాహపడతామని తెలిపింది. అయితే అలా ఒంటరిగా ఉండేవేళ ఎవరూ తోడుగా లేరని బాధ పడనవసరం లేదని రాసుకొచ్చింది. అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడని,మనకు ఏం కావాలో ఆయనకు బాగా తెలుసన్నారు. దాని గురించి దేవుడి వద్ద ఓ ప్రణాళిక ఉంటుందంటూ నటాషా ఓ వీడియోను పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ఐపీఎల్-2024 సీజన్ 17లో ముంబై టీమ్ హర్దిక్ పాండ్యా నాయకత్వం వహించిన సంగతి తెలిసింది. ఆ సమయంలో ముంబై విఫలం కావడంపై, హర్ధిక్ ప్రదర్శనపై నటాషా కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. తాజాగా ఇండియా వర్డల్ కప్ గెలిచిన తరువాత తొలిసారి మరో పోస్టు చేసింది. మరి..నటాషా పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by @natasastankovic__

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş